ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ్యాన్ని,అర్చక లోకాన్ని ఆదుకోండి……..

338

బ్రాహ్మణ సామాజిక వర్గం పరిస్థితి ఈనాడు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా మారింది “తెలుగుదేశం ప్రభుత్వ” హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల చూపిన  నిర్లక్ష్య ధోరణి “వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” కూడా కొనసాగించడం దురదృష్టకరం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండేందుకు గతంలో  ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వినూత్నంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ను నెలకొల్పరు. దీనితో బ్రాహ్మణులలో ఆశలు చిగురించాయి మన జీవితాలు బాగుపడతాయి అని భావిస్తున్న తరుణంలో నిధులు విడుదల కాక ప్రభుత్వంలో ఎలాంటి పదవులు కల్పించక అర్చక వంశపారంపర్య హక్కు రద్దు పరచటంతో ,76 GO అర్చకులకు ఇస్తామని కడవరకు నమ్మించి మోసం చేయటంతో సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ పై బాబు గారిపై నమ్మకం కోల్పోయింది.

ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు న్యాయం చేస్తామని నమ్మ పలకటంతో గత ఎన్నికలలో అందరూ కూడా జగన్ కి అండగా నిలవడం జరిగింది. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ గతం కంటే నిర్వీర్యం అయిపోయింది అర్చక సమస్యలు మరింత జటిలంగా మారాయి  వంశపారంపర్య హక్కు కల్పించారు 76 జీవో ను సవరణ చేస్తూ 439 జీవో ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అది ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు అట్లాగే అర్చకులు అనుభవిస్తున్న సర్వీస్ భూములు రెవెన్యూ రికార్డులో, 1బి అనుభవ దారుని కాలంలో నమోదుకు నోచుకోలేదు దాని వల్ల సామాన్య రైతులకు ఇచ్చే ఎటువంటి రాయితీలు రుణాలు అర్చకులు పొందలేకపోతున్నారు

అనారోగ్య సమస్యలతో బాధపడే అర్చకులకు హాస్పిటల్ కు అగు ఖర్చులు అర్చక వెల్ఫేర్ నుండి గతంలో క్లెయిమ్ చేసుకొనే వారు చివరికి ఆ నిధులు కూడా లేవు అని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. అదేవిధంగా గృహనిర్మాణానికి,పెళ్లిలు ఉపనయనాలు అర్చకవెల్ఫేర్ నిధుల నుండి రుణాలు మంజూరు చేసే వారు అక్కడకూడా మొండి చెయ్యి చూపారు దానితో వందలాది ఫైల్స్ అనుమతి పొంది పెండింగ్ లో ఉండిపోయినాయి.ధూప, దీప నైవేద్యాలకు ,ధార్మిక పరిషత్ నుండి రావలసిన సొమ్ములు అర్చకులకు అందక ఇబ్బందులు పడుతున్నారు.

అండగా ఉండే వెల్ఫేర్ నిధులు కూడా లేకపోవడం నిధులు లేమితో అర్చక లోకం,ఆర్ధికంగా విలవిలాడుతోంది.వీటితోపాటుగా పులిమీద పుట్ర లా అర్చకులపై కొందరు దేవాదాయశాఖ అధికారుల దౌర్జన్యాలు తట్టుకోవడం కష్టంగా మారింది.గౌ”ముఖ్యమంత్రి గారు ఈ శాఖపై కూడా దృష్టి సారించి కష్ట, నష్టాలకు గురి కాబడుతున్న మమ్ములను ఆదుకోవాలని అర్చకలోకం కోరుకుంటుంది
పరిస్థితులు ఇలా ఉంటే నిధులు లేని బ్రాహ్మణ కార్పొరేషన్ కు లక్షల జీతాలు ఇచ్చి MD ని నియమించడం, దానికి ఒక చైర్మన్ నియమించడం వలన ప్రయోజనం ఏమిటి అని సామాజికవర్గం ప్రశ్నిస్తోంది.

అర్చక బంధువుగా కీర్తించబడ్డ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని  స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించాల కోరుతున్నాము మీపై మాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము లేకుంటే సామాజికవర్గంలో అసంతృప్తి పెల్లుబికే ప్రమాదం ఉంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తగు రీతిలో స్పందించి న్యాయం చేయగలరని బ్రాహ్మణ సామాజిక వర్గం ఆశిస్తుంది

                                                                             వేదాంతం.వెంకట హరనాధ్
                                                                                          స్టేట్ కో ఆర్డినేటర్  
                                                                     “ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య”