నేను వచ్చే వరకూ గడ్డిపీకారా?

503

వైసీపీ సర్కారుపై బాబు ఫైర్
తెలుగుదేశం పార్టీ ఏపి రాష్ట్ర స్థాయి సమావేశం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ సమాజాన్ని, ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ప్రజావేదికతో ప్రారంభమైన వైసిపి విధ్వంసం వందలాది ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం చేసే స్థాయికి చేరింది.
రామతీర్థం దుర్ఘటన 28న జరిగితే, మరుసటిరోజే విజయనగరం వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కనీసం సందర్శించలేదు. 1వ తేదీ నేను ప్రోగ్రామ్ ఇచ్చాక నాకన్నా గంట ముందు ఎ2 వెళ్లి ఘర్షణలు రెచ్చగొడ్తాడు. నా పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తారు, ఎ2 వెళ్తే ఎదురేగి మర్యాదలు చేస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను వెళ్తే చూడనీకుండా తాళాలు వేస్తారు, ఎ2, రౌడీ మంత్రులు వెళ్తే అన్నీ చూపిస్తారు.

నేను వెళ్లేదాకా రామతీర్ధం వెళ్లకుండా 5రోజులు ఏం గడ్డి పీకారు..? నాకన్నా ముందే ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకని వెళ్లలేదు..? విజయనగరం వెళ్లి రామతీర్ధం వెళ్లలేదంటే లెక్కలేని తనం కాదా..?
దాదాపు 140పైగా ఆలయాలపై దాడులు జరిగేదాకా నిద్రపోతున్నావా…? వందలాది విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే కళ్లు మూసుకుంటావా..?
దాడికి గురైన ఒక్క ఆలయం కూడా ముఖ్యమంత్రి సందర్శించడా..? డిజిపి ఒక్క చోటకు కూడా వెళ్లడా..? దాడి జరిగిన ఏ ఆలయాన్ని హోం మంత్రి చూడరా..? ఈ చేష్టల వల్లే కదా ఉన్మాదులంతా చెలరేగిపోతోంది..
శ్రీరాముడి తల తీసినప్పుడే అధికారంలో కొనసాగే నైతిక యోగ్యత జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు.నేను రామతీర్ధం వస్తున్నానని తెలిసి టిడిపి వాళ్లపై తప్పుడు కేసులు పెడతారా..?ఇతనేదో సంక్షేమ పథకాలు పెడ్తున్నాడట, అవి ప్రజల్లోకి వెళ్లకుండా టిడిపి దాడులు చేస్తోందట..నీ నాటకాలు కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డీ..
ఈ రోజు కూడా తెల్లవారే నేను వెళ్లి సింగరాయకొండపై విగ్రహం పగులకొట్టానా..? సిగ్గుండాలి ఈ జగన్మోహన్ రెడ్డికి..
నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి..నీ ఇష్టదైవం ఏసుక్రీస్తు..
నేను గెలిస్తే తిరుపతి వెళ్తాను..నువ్వు గెలిస్తే జెరూసలెం వెళ్తావు..నీ పక్కనే బైబిల్ పెట్టుకుంటావు.. తప్పులేదు, కానీ ఇతర మతాలపై దాడులు చేసే హక్కు ఎవరికీ లేదు.
బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహించడానికి కాదు నీ ముఖ్యమంత్రి పదవి..సిఎం కన్వర్షన్లు చేయడం ఏమిటి, వాటిని స్వయంగా ప్రోత్సహించడం ఏమిటి..? ఆ అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు..?

కులమతాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తానని ప్రమాణం చేసిన నువ్వు కన్వర్షన్లు ఎలా చేయిస్తావు..? కన్వర్షన్లను ప్రోత్సహించే పాస్టర్లకు రూ5వేలు ఇవ్వడం చట్టవిరుద్దం. పోలీసులే రోడ్లపై క్రిస్మస్ ఊరేగింపులు చేయడం, పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేయడం… దేశంలో ఎక్కడైనా ఉందా ఈ పరిస్థితి..?
వైసిపి నాయకులు తిరుపతి కొండపై క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి..? మీరు హిందు దేవాలయాలకు వెళ్లేది క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడానికా…?
ఈ రోజు కూడా దక్షిణ సింహాచలంగా ప్రసిద్దిగాంచిన సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం చేయడం కిరాతకం.
రాష్ట్రంలో హిందువులపైనే కాదు ముస్లింలపై కూడా దాడులు చేస్తున్నారు..
హిందూ ముస్లిం మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకెక్కడిది..?14ఏళ్లు ముఖ్యమంత్రిగా నేనున్నా ఎక్కడా ఒక్క చర్చిపైగాని, మసీదుపైగాని దాడి జరగలేదు. తాడేపల్లిగూడెంలో ఒక్క దుర్ఘటన జరిగితే నేనేవెళ్లి స్వయంగా విచారించి, కఠిన చర్యలు తీసుకున్నాం. అటువంటి బాధ్యత నీకు లేదా..?
ఎన్టీఆర్ హయాంలోగాని, 18మంది ముఖ్యమంత్రుల పాలనలో రాష్ట్రంలో ఏనాడూ ఆలయాలపై దాడులు లేవు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక 19నెలల్లో సుమారుగా 140పైగా ఆలయాలపై దాడులు, విధ్వంసాలను ప్రజలే చూస్తున్నారు.

అశోక్ గజపతి రాజు కుటుంబానికి, మీ కుటుంబానికి పోలిక ఉందా..? సేవ చేసే కుటుంబం అశోక్ గజపతి రాజుది..దోచుకునే కుటుంబం మీది.. వేల ఎకరాల భూములు దానాలు చేసే కుటుంబం అశోక్ గజపతి రాజుది..పేదల అసైన్డ్ భూములు లాక్కునే కుటుంబం మీది..నా పర్యటనలో పాల్గొన్నాడనే అక్కసు పట్టలేక, సాయంత్రానికల్లా అశోక్ గజపతి రాజును ట్రస్టీగా తొలగిస్తారా..? బాధ్యతలో విఫలమైన మిమ్మల్ని ఏం చేయాలి..? సిఎంగా నీకు బాధ్యత లేదా..? డిజిపికి బాధ్యతలేదా..?
వాటికన్ సిటి అంటే నీకు ఆనందం..అమరావతి అంటే కంపరం..దేవతల రాజధాని అంటే నీకెందుకు ఉలుకు..? అమరావతిలో రూ2లక్షల కోట్ల రాష్ట్ర సంపద నాశనం చేశావు.
వందలాది రైతులు మనోవేదనతో చనిపోయారు. వేలాది రైతులపై తప్పుడు కేసులు పెట్టారు. వేలాది ఆడబిడ్డలను అవమానాల పాలు చేశారు.

చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డిని..
ప్రజలకు నా పిలుపు ఒక్కటే..మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం.. అందరం అప్రమత్తంగా ఉందాం..పోలీసు వ్యవస్థ ఎవరికి ఊడిగం చేస్తోంది..?కేసులకు టిడిపి కార్యకర్తలు ఎవరూ భయపడేది లేదు. 1,336మంది టిడిపి కార్యకర్తలపై దాడలు చేస్తే, తప్పుడు కేసులు పెడితే ఎవరైనా భయపడ్డారా..?
ఛలో పులివెందులకు వెళ్లిన టిడిపి ఎస్సీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెడతాడా ఈ పెద్దమనిషి..? రాజధాని అమరావతిలో ఎస్సీ రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెడతారా..?
ప్రతి తప్పుడు కేసును సమీక్షిస్తాం..తప్పు చేసిన పోలీసు అధికారులను కూడా వదిలే ప్రసక్తే లేదు. నా ఇంటికి తాళ్లు కట్టినప్పుడే(ఛలో ఆత్మకూరులో), భవిష్యత్తులో ఈ పసుపుతాళ్లే నీకు ఉరితాళ్లు అవుతాయని హెచ్చరించాను.

ఎమ్మెల్సీ బిటెక్ రవి టెర్రరిస్టా..? అంతర్జాతీయ నేరస్తుడా..? 2ఏళ్ల క్రితం ఏదో కేసు సాకుతో చెన్నై ఎయిర్ పోర్టుకెళ్లి అరెస్ట్ చేస్తారా, జైలుకు పంపిస్తారా..? టిడిపి నాయకుడి ఇంటిపై దాడిచేసిన వైసిపి ఎమ్మెల్యేను వదిలేస్తారా..? పేకాట డెన్ లు నడిపే మంత్రులను వదిలేస్తారా..?
పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ ను చంపుతారు, ఫోన్ మాయం చేస్తారు.. పొద్దుటూరులో చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను చంపుతారు, ఫోన్ మాయం చేస్తారు..జమ్మలమడకలో మాజీ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని చంపుతారు, ఫోన్ మాయం చేస్తారు. మొన్న దాచేపల్లిలో కాపు నేత మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును చంపుతారు, ఫోన్ మాయం చేస్తారు..
మీ అవినీతిని బైటపడితే చంపేస్తారా..?గ్రామసభ జరిగిన గుళ్లోనే గురుప్రతాప్ రెడ్డిని చంపేస్తారా..? ఇళ్ల పట్టాల పంపిణీ వద్దే నందం సుబ్బయ్యను చంపేస్తారా..? ఆంబోతు మాదిరిగా వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై పడతాడా..? పోలీసులు తలుపులు తీసి పెద్దారెడ్డితో వీరంగం వేయిస్తారా..?
16మంది టిడిపి కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారు. వందలాది మందిని నెలల తరబడి జైళ్లలో పెడతారా..?
వైసిపి వేధింపులను తట్టుకుని వీరోచితంగా పోరాడుతున్న టిడిపి కార్యకర్తలను అభినందిస్తున్నాను. మీ పోరాటాలే మొత్తం తెలుగుదేశం శ్రేణులకు స్ఫూర్తిదాయకం.
పోలవరం పనులు నిలిపేసే అధికారం మీకెక్కడిది..? 12నెలల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేశాం, 19నెలల్లో మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా..? ప్రతి ఏడాది రూ14వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణంపై టిడిపి ఖర్చుచేస్తే, ఏడాదిన్నరలో కనీసం రూ 4వేల కోట్లు ఖర్చు పెట్టారా మీరు..?
ఊరూరా తిరిగి రాగాలు తీస్తూ చెప్పిన నీ మాటలు ఏమయ్యాయి..? ప్రత్యేక హోదా తెస్తా, ప్రతి ఊరూ హైదరాబాద్ చేస్తా అన్నావు..ప్రత్యేక హోదా ఎందుకని తేలేక పోయావు..? కేంద్రానికి కనీసం ఉత్తరం ఎందుకని రాయలేదు..? 25మంది ఎంపిలను గెలిపిస్తే హోదా తెస్తానని చెప్పి, ఇప్పుడు 28మంది ఎంపిలు(రాజ్యసభతో కలిపి) ఉండి ఏం పీకావు..?
నీ వ్యాపారాలకు, కేసుల మాఫీకి ఉపయోగిస్తావా 28మంది ఎంపిలను..
రూ 16లక్షల కోట్ల పెట్టుబడులను పోగొట్టావు..31లక్షల ఉద్యోగాలను పోగొట్టావు..అమరావతికి రూపాయి తేలేక పోయావు కేంద్రం నుంచి..వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు పైసా రాబట్టలేక పోయావు..
టిడిపి పోరాటం రాష్ట్రం కోసం..వైసిపి ఆరాటం జగన్ కేసుల మాఫీ కోసం..
పంపు సెట్లకు మీటర్లు పెట్టి రైతులకు నమ్మకద్రోహం చేస్తావా..? ఎడాపెడా పన్నులతో పట్టణ ప్రజలపై భారాలు వేస్తావా..? కుక్క పిల్లను పెంచుకుంటే పన్నేస్తారా..? మరుగుదొడ్డి ఎన్నిమార్లు వాడితే అన్నిసార్లు పన్ను కట్టాలా..? గాలోడివి కాబట్టి గాలి పీలిస్తే పన్ను కట్టాలని అన్నా అంటావు..
నీ నోరు తెరిస్తే అబద్దమే.. ఖాతాల్లో డబ్బులు వేయకుండా వేశానని చెప్పి రైతులను మోసం చేశావు..45ఏళ్లకే పించన్ ఇస్తానని చెప్పి బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలను మోసం చేశావు.
పించన్ టిడిపి రూ 1,875పెంచితే, తండ్రీకొడుకులు(రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి) పెంచింది కేవలం రూ375మాత్రమే..
గాలి చేష్టలు, గాలి కబుర్లు, గాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గాలి పార్టీ వైకాపా..

టిడిపి కట్టిన ఇళ్లను పాడుబెట్టి నాశనం చేస్తున్నాడు..రూ157కోట్ల విలువైన ఆటోలను ఉపయోగించకుండా పాడుబెట్టాడు..కోట్లాది రూపాయిల విలువైన ‘‘ఆదరణ’’ పరికరాలను ఇవ్వకుండా నాశనం చేశారు. చివరికి సైకిళ్లు కూడా ఆడపిల్లలకు ఇవ్వకుండా నాశనం చేశాడు..మొత్తం రాష్ట్రాన్ని పాడుబెట్టడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు.
నీ తండ్రి చనిపోతే అందరి ఇళ్లకు వెళ్లి ఓదారుస్తావా..? అబ్దుల్ సలామ్ కుటుంబం సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటే గెస్ట్ హవుస్ కు పిలిపించి పరామర్శిస్తావా..? నీ ఓదార్పు రాజకీయం ఇదేనా..?
పేకాటలో పట్టుకుంటే ఏమవుద్ది..? ఉరేస్తారా..? కేసులు పెడ్తారు, బైటకు వస్తారు, మళ్లీ ఆడుకుంటారు అనేవాళ్లు మంత్రులా..?
పేకాట ఆడించేవాళ్లు, హవాలా చేసేవాళ్లు, బెట్టింగ్ చేసేవాళ్లు, బూతులు తిట్టేవాళ్లు…వీళ్లా మంత్రులు..? వీళ్లా ఆదర్శం ఈ రాష్ట్రానికి..?
ఏపిలో మద్యం హోల్ సేల్, రిటైల్ వ్యాపారి జగన్మోహన్ రెడ్డే..ఈయనే మద్యం తయారీ, మద్యం పంపిణీ, మద్యం అమ్మకాలు అన్నీ ఈయనే.. మద్యం దుకాణాలన్నీ ఈయనవే..ఇదీ జగన్ మద్యం కథా కమామిషు..
గ్రానైట్ నుంచి బాక్సైట్ దాకా హోల్ సేల్ దోపిడికి పాల్పడుతున్నారు. మొత్తం సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. ఇసుక, మట్టి, దేనినీ వదలి పెట్టకుండా మేసేస్తున్నారు.
పోర్టులు, సెజ్ లు బినామీ పేర్లతో స్వాహా చేస్తున్నారు.
ఒక్క సెంటు స్థలానికి రూ6,500కోట్ల అవినీతా..?
ఊరికి 20కిమీ దూరంగా ఇచ్చే స్థలాలు ఎవరికి ఉపయోగం..? వాటిలో కూడా వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడతారా..? ఆవభూముల్లో రూ 500కోట్ల కుంభకోణం, మడ అడవులు నరికివేస్తారా..? 15అడుగుల లోతు ముంపుభూముల్లో మీరు ఇళ్లు కట్టుకుంటారా..?
టిడిపి అద్భుతంగా కట్టిన ఇళ్లు పేదలకు ఇవ్వకుండా వేధిస్తారా..? మళ్లీ టిడిపి అధికారంలోకి వచ్చాక ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తాం..అప్పటిదాకా మీ ఇళ్లు మీరు కాపాడుకోండి..
ప్రతి స్కీమ్ లోనూ స్కామ్ లకు పాల్పడుతున్నారు.
771పదవులు నీ వర్గానికే ఇవ్వడమా నువ్వు చేసే సామాజిక న్యాయం..? వీసిలు, సలహాదారులు, టిటిడి పదవులు అన్నీ నీ వర్గానికేనా..? బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటిలు కనబడరా ఉన్నత పదవులు ఇవ్వడానికి..?

బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం..అప్పుడు ఇప్పుడు బిసిలే వెన్నెముక టిడిపికి..
ఎన్నికలు పెడ్తామన్న ఎలక్షన్ కమిషనర్ పై దాడి..3రాజధానులు అడ్డుకున్న శాసనమండలి పై దాడి..ఇవి తప్పని చెప్పిన కోర్టులపై దాడి..వాటిని చూపిన, రాసిన మీడియాపై దాడి..మొత్తం రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తారా..?
మీ నాన్న విగ్రహాలు ఊరూరా ఉండాలి.. బిసి పితామహుడు గౌతు లచ్చన్న విగ్రహం తీసేస్తారా..?
ఇంత రాక్షస రాజకీయాలను నాలుగు దశాబ్దాల చరిత్రలో చూడలేదు.
మీరు చంపుకుంటూ పోతే మేము చూస్తూ ఉండాలా..? మరొక్క సంఘటన జరిగితే సహించేది లేదు. ముఖ్యమంత్రికి, డిజిపికి బాధ్యత లేదా..?
అవినీతిపై ప్రశ్నిస్తే చంపేస్తారా..? ప్రజా సమస్యలపై పోరాడితే జైల్లోపెడతారా..?
జగన్మోహన్ రెడ్డికి సిగ్గుఎగ్గు లేదు, మానం మర్యాద లేదు..హుందాతనం మచ్చుకి కూడా లేదు. నిలువెల్లా అహంభావమే..ఆయన అహంభావాన్ని ప్రజలే దించుతారు.
వైసిపి వేధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
పలాసలో గౌతు శిరీష, గౌతు శివాజీల పోరాటం..అనపర్తిలో రామకృష్ణారెడ్డి పోరాటం..విశాఖలో వెలగపూడి రామకృష్ణ పోరాటం..గురజాలలో యరపతినేని శ్రీనివాస రావు పోరాటం.. పులివెందులలో, పొద్దుటూరులో టిడిపి నాయకుల పోరాటం..అభినందనీయం..ఛలో నంద్యాల, ఛలో పులివెందుల, ఛలో పొద్దుటూరు, ఛలో తంబళ్లపల్లి..ఆందోళనలన్నీ బాగా చేశారు..ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలి.
వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, బిసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలి.
60లక్షల సైన్యంగల ఏకైక పార్టీ తెలుగుదేశం. పోరాడితే న్యాయం జరుగుతుంది. ఉపేక్షిస్తే అన్యాయం పాలే..ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించం. ఏ వర్గం ప్రజలపై దాడులు చేసినా ఉపేక్షించం..ఏ ఆలయం కూల్చినా, విగ్రహాలు ధ్వంసం చేసినా సహించేది లేదు.
అందరూ కమ్ముకుని రావాలి. సమష్టిగా పోరాడాలి. వైసిపి దౌర్జన్యాలపై నిరసించాలి.
ఆయారామ్ ,గయారామ్ ల అవసరం లేదు టిడిపికి.. నాయకులను తయారుచేసుకునే శక్తి, సత్తా టిడిపికి ఉంది. మనకున్న కార్యకర్తల బలం ఎవరికీ లేదు. మనకున్న సంస్థాగత నిర్మాణం ఎవరికీ లేదు. గ్రామం నుంచి రాష్టస్థాయి దాకా పార్టీ పటిష్టత మనందరి లక్ష్యం. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలి.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి శ్రేణులంతా సంసిద్దంగా ఉండాలి. తిరుపతి ఉపఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికలో వైసిపికి బుద్ది చెప్పాలని’’ చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

అచ్చెన్నాయుడు: టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఇప్పుడెలాంటి పరిస్థితులు ఉన్నాయి..? ఇటువంటి కక్ష సాధింపు రాజకీయాలు చరిత్రలో లేవు. మరింత అప్రమత్తంగా టిడిపి శ్రేణులు ఉండాలి. రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేయాలని జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మతాల మధ్య, కులాలమధ్య చిచ్చులు పెట్టి టిడిపిపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. రాజీనామా చేస్తేనే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామన్న నీ మాటలు ఏమయ్యాయి..? దేశానికే ఆదర్శంగా ఏపి శాసనసభ ఉండాలన్న నీ నీతులు ఏమయ్యాయి..? అసెంబ్లీని వైసిపి కార్యాలయం చేశారు. శాసనసభను, రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఆస్తులు పోయినా, అవమానాల పాలైనా టిడిపి జెండా దించకుండా మోస్తున్న కార్యకర్తలకు శిరసు వంచి నమస్కారాలు.
జగన్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదు. ఆయన ప్రసంగాలకు, కార్యకలాపాలకు పొంతన లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలే.. ఫేక్ సిఎం, ఫేక్ కబుర్లు..జగన్ నోట ప్రతి మాట అబద్దమే..

టిడిపి విచ్ఛిన్నం చేయడం చేతగాక రాష్ట్రాన్ని వినాశనం చేస్తున్నాడు. ఎవరడిగారు 3 రాష్ట్రాలు కావాలని..? దానిపైనా అభాసు పాలయ్యారు చివరికి..రాముడి తల నరికే నీచానికి దిగజారారు. ముఖ్యమంత్రి, డిజిపి, హోంమంత్రి క్రిస్టియన్లు కావడంలో తప్పులేదు. క్రిస్టియన్లు కాబట్టి మరింత జాగ్రత్తగా రాత్రింబవళ్లు కాపాడాల్సింది పోయి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
నీ కనుసన్నల్లోనే, నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయి. దేవాలయాలపై దాడులకు కర్త, కర్మ, క్రియ నువ్వే..
మొదటి దాడి జరిగినప్పుడే నువ్వు ఖండిస్తే భయం వచ్చేది, దుర్ఘటన ప్రాంతాన్ని నువ్వు సందర్శిస్తే హెచ్చరికగా ఉండేది. వందల సంఖ్యలో దాడులు జరిగినా నోరు మెదపలేదు. నీ తప్పులపై సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వందలాది మందిని అరెస్ట్ చేయించావు. 140పైగా దాడులలో ఒక్కదానిలో నిందితుడిని అయినా అరెస్ట్ చేశారా..?
టిడిపి హయాంలో కూడా దేవాలయాలు కూల్చివేశారన్న బిజెపి ఆరోపణలను ఖండిస్తున్నాం. కేంద్రమంత్రి గడ్కరీ సూచనల మేరకే ఫ్లై వోవర్ నిర్మాణంలో అడ్డుగా ఉన్న ఆలయం, మసీదు తొలగిస్తే, దానికి దీనికి ముడిపెట్టడం దారుణం. అప్పటి బిజెపి రాష్ట్ర మంత్రి కూడా దీనిని అర్ధం చేసుకుంటే ఇప్పటి బిజెపి నాయకులు వక్రభాష్యాలు చెప్పడం శోచనీయం. ఏపిలోని దేవాలయాల్లో దాడులపై దర్యాప్తును సిబిఐ కి ఇవ్వడం మీ బాధ్యత.

వైసిపి వేధింపులపై టిడిపి కార్యకర్తలు, నాయకుల పోరాటం అభినందనీయం. పర్యటనల సందర్భంగా ఎన్టీఆర్ కు వచ్చిన నీరాజనాలు లోకేష్ కు రాష్ట్ర ప్రజానీకం పలుకుతోంది. యువతరం అంతా మరింత ఉత్సాహంతో పనిచేయాలి. టిడిపి బలోపేతానికి కృషి చేయాలి.
ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, వర్ల రామయ్య, కాలువ శ్రీనివాసులు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత, ఎంపిలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, కమిటి సభ్యులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.
సమావేశానికి ప్రారంభానికి ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల చనిపోయిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నివాళులు అర్పించారు.