క్రైస్తవుడైన ముఖ్యమంత్రికి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే,నిద్రెలా పడుతోంది?

530

• ముఖ్యమంత్రి స్వతహాగా  క్రైస్తవుడు, రాష్ట్రవ్యాప్తంగా  దాడులేమో  హిందూ దేవాలయాలపై జరుగుతున్నాయి.
• దాడులు అరికట్టడంలో జగన్  ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందన్న అపవాదు రాష్ట్రంలో  ఎక్కువశాతమున్న హైందవుల్లో ఉంది.
• ముఖ్యమంత్రి చుట్టూ ఎప్పుడూ ఉండే,   హోంమంత్రి క్రైస్తవురాలు, డీజీపీ సవాంగ్ క్రైస్తవుడు.
• రామతీర్థానికి ముఖ్యమంత్రి వెళ్లిఉంటే, అక్కడకు వెళ్లాల్సిన అవసరం చంద్రబాబునాయుడికి ఉండేదా?
టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి   వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలాకాలం తర్వాత నేడు ఒక మూకీ ప్రెస్ మీట్ నిర్వహించారని, ఆయనకు ఆయనే మీడియా వారిముందు ఏకపాత్రాభినయం చేశారని, తనపాలనవైభవం, తాను సాగిస్తున్న జనరంజక, ప్రగతిపాలన చూసి ఓర్వలేని ప్రత్యర్థులే దేవాలయాలపై దాడులకు తెగబడుతున్నారని ఆయన చెప్పడం  సిగ్గుచేటని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి , పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.   ఊరిచక్కదనం గోడలు చెప్పినట్లుగా, జగన్ పరిపాలనా గొప్పతనం తొలినాళ్లలోనే ప్రజలకు అర్థమైందన్నారు.

రాష్ట్రప్రజలెవరూ కూడా జగన్ పాలనలో వైభవాన్ని, వైభోగాలను ఆశించడంలేదని రామయ్య స్పష్టంచేశారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తరతరాలనుంచి క్రైస్తవ మతాన్నే ఆయన తండ్రి, తాతలుకూడా ఆచరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో కూడాఆయన తొలిగా బైబిల్ మీదనేప్రమాణంచేశారన్నారు.రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే వారెవరూ అలాచేయరని రామయ్య స్పష్టంచేశారు.  గతంలో హైందవేతరుడైన ఏ.ఆర్. అంతూలి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన  ఒక మహమ్మదీయుడని, కానీ ఆయన ఏనాడూ ఖురాన్ పై ప్రమాణం చేయకుండా, భారతరాజ్యాంగంపై ప్రమాణంచేశాడన్నారు. కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన ఫరూఖ్ అబ్దుల్లాకూడా రాజ్యాంగం పైనే ప్రమాణం చేశాడన్నారు. వారికి విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుచూస్తుంటే, ఒక మతఛాందసుడిగా ఆయన కొనసాగాలని అనుకుంటున్నారా అని రామయ్య నిలదీశారు.

హిందూమతంపై, దేవాలయాలపై దాడి జరిగినప్పుడు క్రైస్తవుడిగా ఉన్న ముఖ్యమంత్రికి అసలు నిద్రఎలా పడుతుందన్నారు.  తనకు అపవాదు, అపకీర్తిరాకముందే మేల్కొని, అధికారులనుఅప్రమత్తం చేసి, జరిగినసంఘటనలపై చర్యలుతీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా అని రామయ్య నిలదీశారు. రామతీర్థంలో రాములవారి శిరస్సు ఖండిస్తే, ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అక్కడకు ఎందుకువెళ్లలేదన్నారు? గతంలో తాడేపల్లి గూడెంలో ఒకచర్చిపై దాడిచేస్తే, చంద్రబాబునాయుడు పరుగు పరుగున అక్కడకు వెళ్లి, సమీక్ష చేశారన్నారు. రామతీర్థానికి ముఖ్యమంత్రి వెళ్లిఉంటే, అక్కడకు వెళ్లాల్సిన అవసరం చంద్రబాబు కి ఉండేదికాదని రామయ్య స్పష్టంచేశారు. క్రైస్తవుడైనందునే ముఖ్యమంత్రి రామతీర్థానికి వెళ్లలేదా అన్నారు.  ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవమతస్తులు కాబట్టే దేవాలయా లపై దాడులు జరుగుతున్నాయా అని వర్ల సందేహం వెలిబుచ్చారు

గతంలోఅనేక ప్రభుత్వాలహయాంలో ఎంతోసమర్థవంతంగా పనిచేసిన పోలీస్ శాఖ ఇప్పుడు ఎందుకింత చేతనావస్థలో ఉందో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు. పెద్దలసభకు అర్థమే తెలియని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశాడని, చంద్రబాబునాయు డిపై, అచ్చెన్నాయుడిపై, కళావెంకట్రావులపై కేసులు పెట్టడమేంట ని రామయ్య నిలదీశారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారంటున్న ముఖ్యమంత్రి, అటువంటివారిని పట్టుకోకుండా ప్రతిపక్షంపై నిందలేయడం ఏమిటన్నారు. దేవాలయాలపై దాడులకు కారకులైనవారిని ప్రభుత్వమే గుర్తించలేకపోతే ఎలాగన్నారు. ఇంటికి కన్నమేసిన దొంగ తప్పించుకుతిరిగినట్లుగా, ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై నిందలు, అభాండాలు వేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడని రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.

బూతుల మంత్రి నేడు జగన్ ను కలిసి, బయటకు వచ్చాక మాట్లాడుతూ, పేకాట ఆడితే తప్పేముం దని తిరిగి ప్రశ్నించడంతోనే ముఖ్యమంత్రి వ్యవహరశైలి ఏమిటో తేలిపోయిందన్నారు. చట్టవ్యతిరేక శక్తులకు ఈ ప్రభుత్వం ఎంతగా వత్తాసు పలుకుతోందో, ఎంతగా భరోసా కల్పిస్తోందో జరుగుతున్న ఘటనలు, మంత్రుల మాటలే నిదర్శనాలన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి, ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తుల ఆటకట్టించి, ఆయన తననిజాయితీని నిరూపించుకోవాలని రామయ్య సూచించారు. జరుగుతున్న సంఘటనలపై అవసర మైతే గవర్నర్ ను కలవడానికి కూడా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. హిందూమతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులదృష్ట్యా అవసరమైతే కేంద్రాన్ని కదిపేందుకు కూడా టీడీపీ వెనుకాడబోదని రామయ్య తేల్చిచెప్పారు.

ఈ విధమైన దాడులు, దాష్టీకాలు పునరావృతం కాకుండా, మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. ప్రతిపక్షాలపై నిందలేయడం మానేసి, అధికారంచేతిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి దోషులను పట్టుకోకుండా అపవాదులు వేయడమేంటన్నారు.  పేకాట స్థావ రాలపై జరిగిన దాడుల్లో దొరికింది కొంతేనని, దొరకాల్సింది చాలా ఉందని, దానిపై మాట్లాడిన మంత్రి సిగ్గు, లజ్జలేకుండా స్పందించి, తనను తానే కించపరుచుకున్నాడన్నారు. అటువంటి  మంత్రి తన కేబినెట్లో ఉండాలో లేదో నిర్ణయించుకోవాల్సింది ముఖ్యమంత్రేనని రామయ్య తేల్చిచెప్పారు.