రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి రామ మందిరం

147

రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ఆధ్వర్యంలో స్థానిక అరుండల్ పేటలోని నాగసాయి హోటల్ నందు పత్రికా విలేకరుల సమావేశం జరిగింది.  ఈసందర్భంగా ఆర్. ఎస్ ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు డా.కే ఎస్. ఎన్ చారి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి రామ మందిరం పేరుతో కార్యకర్తలు,నాయకులు, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు, అందరూ కలసి రామ మందిర నిర్మాణ నిధికి తరలి రానున్నట్టుతెలిపారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు ఈమందిర నిర్మాణ నిధి సమర్పణకు ముందుకు రావాలని అన్నారు. నిధి నిర్మానానికి శ్రీకారం జనవరి 15నుంచి31తారీకువరకు జరుగుతుందని స్పష్టం చేశారు.నిధి సేకరణపేరుతో రామసేవకులు ప్రతి గ్రామానికి, పట్టణానికి వస్తారని వారివద్దనుంచి 10రూ.ల నుంచి ఎంతైనా ఇవ్వవచ్చని సూచించారు. ఈరామదండుకు ప్రతిఒక్క భారతీయ పౌరుడు తప్పనిసరిగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రాంత సంపర్క ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ హిందువుల మనసులో కొలువుదీరిన రామచంద్ర మహరాజ్ యొక్క దేవాలయ నిర్మాణానికి కులమతాలకు అతీతంగా నిర్మాణ నిధికి ప్రతిఒక్కరు సహకరించాలని పిలుపు నిచ్చారు. ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఈకార్యక్రమమును దేశవ్యాప్తంగా చేపట్టామని తెలిపారు. రామతీర్థంలో జరిగిన ఘటన మతమౌడ్యుల ఆరాచకమని ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో డాక్టర్ కల్లగంటి నాగార్జున, రామజన్మభూమి తీర్థ క్షేత్ర గుంటూరు జిల్లా ప్రముఖ్ చలువాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు