పేకాట క్లబ్ లపై బతికిన చరిత్ర చంద్రబాబు,దేవినేని ఉమాలదే..

214

– చంద్రబాబు, దేవినేని ఉమాలా పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి నాకు పట్టలేదు
– దేవినేని ఉమ విజయవాడ, గుంటూరు క్లబ్ లలో పేకాట ఆడించి, ఆ వసూళ్ళలో కొంత  వాటాను పప్పునాయుడుకి పంపేవాడు
– పేకాట క్లబ్ లపై కఠిన చట్టాలు చేస్తూ సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారు
-గ్యాంబ్లింగ్ యాక్ట్ కు సవరణలు చేస్తూ చట్టాలను సీఎం జగన్ తెచ్చారు
-గుడివాడ ప్రజలకు నేను ఏంటో.. నా వ్యక్తిత్వం ఏంటో తెలుసు
-గుడివాడ చెరువుల్లో దాడులు చేసింది ఎస్‌ఈబీనే.. మా ప్రభుత్వమే రైడ్ చేసింది
-అదేదో తమ ఘనకార్యంగా టీడీపీ, ఎల్లో మీడియా నాపై బురద చల్లుతున్నారు
-కొనకళ్ల నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే జూదం నిర్వహించారు
-పేకాట వ్యవహారంలో సీఎం గారిని కలవలేదు, ఎన్‌డీబీ టెండర్లలో గుడివాడకు ప్రాధాన్యం ఇవ్వమని కోరాను
– గుడివాడలో క్లబ్ లు మూయించింది నేనే అన్నది నియోజకవర్గంలో ఎవరైనా చెబుతారు

ఇంకా మంత్రి కొడాలి నాని ఏమన్నారంటే… కొంతమంది మీడియా సోదరులు కొడాలి నాని అడ్డాలో జూదం బట్టబయలు అయిందని అత్యుత్సాహం చూపించారు. అది బట్టబయలు చేసింది ఏబీఎన్ రాధాకృష్ణా లేక రాధాకృష్ణ టీమ్ వెళ్లి పట్టుకుందా?; లేక టీవీ5 బీఆర్ నాయుడు టీం వెళ్లి పట్టుకుందా.. అని కొడాలి నాని నిలదీశారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు బ్యూరో( ఎస్‌ఈబీ) వారు నేరుగా వెళ్లి పేకాట ఆడేవాళ్ళను పట్టుకున్నారని కొడాలి నాని తెలిపారు.  రెండు నెలల క్రితమే పేకాట ఆన్‌లైన్‌ గానీ, ఏ గ్యాంబ్లింగ్ అయినా స్థానిక పోలీసులతో సంబంధం లేకుండా ఎస్‌ఈబీ వారు పట్టుకోమని కేబినెట్‌లో సీఎం  జగన్ ఆదేశించారు. ఎస్‌ఈబీకి సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి జూదాలు నిర్వహించే వారిని పట్టుకోమన్నారు. ఎస్‌ఈబీకి దీనిపై సమాచారం ఉండబట్టే వారు వెళ్లి పట్టుకోవటం జరిగిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

పేకాట ఆడుతున్నారని ఓ వర్గం మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఒక్క గుడివాడలోనే కాదు, పేకాట ఆడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు.  కొనగళ్ల నారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోనే జూదం ఆడేవారని మంత్రి కొడాలి నాని తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమా 1200 మందిని పెట్టుకుని విజయవాడ క్లబ్‌, గుంటూరు క్లబ్‌లో పేకాట ఆడించి, కమీషన్లు వసూళ్ళు చేసి, అందులో కొంత వాటాను పప్పూనాయుడుకు పంపేవారు. ఇటువంటి పనులు చేసి క్లబ్బులపై బతికిన చరిత్ర దేవినేని ఉమా, చంద్రబాబులదే అని కొడాలి నాని స్పష్టం చేశారు.  రెండు ఎకరాల ఆస్తి నుంచి ఈరోజు వేల కోట్ల ఆస్తులకు చంద్రబాబు ఎలా ఎదిగారంటే, ఇలాంటివి చేయబట్టే అని కొడాలి నాని మండిపడ్డారు.

పోలీసులు ఎవర్ని పట్టుకున్నారు, ఏ పార్టీ వారిని పట్టుకున్నారు, పేకాట ఆడుకునేవారికి పార్టీ ఏమిటి.. ? లేకపోతే ఒకే కులం వారు ఆడుకుంటున్నారా? ఏ కులం అయినా, ఏ పార్టీ వారు అయినా.. ఎవరుంటే వారిని అరెస్ట్ చేసి  డబ్బును, వెహికల్స్‌ను సీజ్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతోంది. మా ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగమే రైడ్‌  చేశారు. గుడివాడలో క్లబ్బులు మూసేయించింది నేనేనని ఈ విషయాన్ని నియోజకవర్గంలో ప్రజల్ని అడిగితే తెలుస్తుందని కొడాలి నాని అన్నారు.

. ఈరోజు కూడా పేకాట స్థావరాలపై రైడ్స్‌ చేసింది, చేయించింది మా ప్రభుత్వమే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు, చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా, కొనగళ్ల నారాయణ చేయించలేదు. మా ప్రభుత్వంలో మేం చేయించామన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని కొడాలి నాని అన్నారు. చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసులు రైడ్ చేశారన్నారు. బుడమేరు పక్కన పశ్చిమ గోదావరి జిల్లా అని దెందులూరు నియోజకవర్గానికి బోర్డర్‌లో నా నియోజకవర్గం ఉందని కొడాలి నాని తెలిపారు.

ఒకేచోట పార్కింగ్‌లో కార్లు పెట్టి.. అందరూ కార్లలో పేకాట ఆడుతున్నారు. 28 కార్లు, 13 బైక్‌లు దొరికాయని మొత్తం మీద 40 లక్షలు నగదు లభించిందని రెండు సెట్లు పేకాట సెట్లు లభించాయని చెబుతున్నారన్నారు.  పేకాట ఆడుతున్న వారిపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. పేకాట వేరేచోట జరుగుతోంది. ఇది పార్కింగ్ ప్లేస్ అని, కొంతమంది వ్యక్తులు మిస్‌ అయ్యారని చెబుతున్నారు. దీనిమీద కూడా విచారణ జరుపుతాం. ఇందులో చంద్రబాబు దేవినేని ఉమాల పాత్రే కాదు, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని కొడాలి నాని అన్నారు.

దమ్ము, ధైర్యంతో పోలీసుల్ని పంపి పేకాట స్థావరాలపై దాడులు మా ప్రభుత్వం చేస్తే.. నేను పేకాట ఆడిస్తున్నానని దేవినేని ఉమా.. చంద్రబాబు లాంటి చవట దద్దమ్మలు విమర్శలు చేయటం ఏంటని కొడాలి నాని మండిపడ్డారు. ఇక్కడ వైయస్‌ఆర్‌సీపీ జెండా, వాటర్ బాటిల్ ఉందని పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తానని కొడాలి నాని హెచ్చరించారు.

-మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
ప్రశ్న-ఈ పేకాట వ్యవహారంలో కొడాలి నాని ప్రధాన అనుచరులు ఉన్నారని సీఎం మిమ్మల్ని క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారని అంటున్నారు?
– ముఖ్యమంత్రి గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నానని పిచ్చిపిచ్చిగా ప్రేలాపనలు చేస్తున్నారు. సీఎం గారికి నాకు ఉన్న సంబంధాలు వేరు. ప్రజలకు అవసరమైనప్పుడు సీఎం గారి వద్దకు వస్తాం. ఇంతవరకు నేను నా పర్సనల్ పని ఏదీకూడా సీఎం గారిని అడగలేదు. భవిష్యత్‌లోనూ అడగను. నాలుగు సార్లు గుడివాడ శాసనసభ్యునిగా గెలిపించిన ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా వస్తాను. ఈరోజు కూడా గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు వయా మాడికొండ మీదగా వెళ్లే రోడ్డును ఎన్‌డీబీ సెకండ్ ఫేజ్‌లో పెట్టమని సీఎం గారిని కోరానని ఆయన అంగీకరించారని కొడాలి నాని అన్నారు.
– డబ్బులు సంపాదించాలంటే అనేక మార్గాలు ఉన్నాయ్. చంద్రబాబు, ఉమాలాగా వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి మాకు పట్టలేదని నాని మండిపడ్డారు