చంద్రబాబు కాదు…ఆంధ్రా ఔరంగజేబు ..!!

( వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ )

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా రథం పరుగులు పెడుతుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు చేసుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. పాలనా సంస్కరణలు ప్రవేశ పెట్టడంలో దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. మేనిఫెస్టోలోని హామీలను దాదాపుగా నెరవేర్చారు. ఏపీలో శాంతి,భద్రతలు నెలకొల్పడంలో పోలీసులు జాతీయ అవార్డులు పొందారు. ఏపీ హై కోర్టు ద్వారాసీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు అండ్ కోకు లేఖాస్త్రంతో ముఖ్యమంత్రి మచ్చెమటలు పోయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో  దూసుకుపోతుండటం చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను ప్రతి గడప తొక్కించడాన్ని చంద్రబాబు సహించలేక పోతున్నారు.

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్‌ క్లాసెస్‌ అని ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే నిధుల వాన కురిపిస్తున్నారు. 50కిపైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కార్పొరేషన్లలో మహిళలకు పెద్ద పీట వేసి వారి రాజకీయ స్వాతంత్రానికి బీజాలు వేశారు. అట్టడుగు వర్గాల్లో ఉన్న మహిళలను ప్రోత్సహిస్తూ  ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని చంద్రబాబు గ్యాంగ్ సహించలేకపోతుంది. కడుపు మంటతో రగిలి పోతుంది. ఇళ్ల పట్టాల పంపిణీని సుధా నారాయణ మూర్తి  ప్రసంశించారు. జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తింది. జాతి మీడియా మాత్రం కుక్కిన పేనులా గమ్మునుంది. ప్రజల్లో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద గ్రాప్‌  పెరుగుతుంది.

80శాతానికిపైగా మహిళలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు నిద్ర పట్టనివ్వడం లేదు. అందుకే..ఏదో ఒక గందరగోళం సృష్టించాలి. రాజకీయ అలజడి క్రియేట్ చేయాలి. ఏదో విధంగా బీజేపీకి దగ్గర అవ్వాలి.  అందుకే రథాలు తగల బెట్టించడం..తిరుమలలో శిలువ అంటూ దుస్ఫ్రచారం చేయించడం..తాజాగా విజయనగరం జిల్లా రామతీర్ధంలో విగ్రహం పగల గొట్టించడం. ఇవన్నీ కూడా చంద్రబాబు అరాచక ఆలొచనలకు ప్రతి రూపాలు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్య క్తి ప్రత్యక్షంగా  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మత రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారు.

విజయనగరం జిల్లా రామతీర్ధంలో చంద్రబాబు రాజకీయ డ్రామా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. టీడీపీ కార్యకర్తలే విగ్రహాల ధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చంద్రబాబు జూమ్ డైరక్షన్‌లో స్థానిక టీడీపీ నేతలు కార్యక ర్తలను రెచ్చ గొట్టి విగ్రహాలు ధ్వంసం చేయించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రజల తరపున పోరాడటానికి ఏం లేవు. ఆ అవకాశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కల్పించడం లేదు. అమరావతిలో జరిగేది ఫేక్ రైతుల ఉద్యమం అని దేశం మొత్తం తెలిసిపోయింది. ఎక్కడా కూడా ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబుకు పిచ్చెక్కుతుంది. అందుకే  విగ్రహ ధ్వంస రాజకీయాలకు నారావారు తెరలేపారు. అయితే..రామతీర్ధంలోని విగ్రహాల ధ్వంసంపై పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు. దీంతో  చంద్రబాబు తన దొంగ నాటకం భయపడుతుందని  భయంతో రామతీర్ధం పర్యటన అంటూ ఉద్రిక్తలు రాజేయడానికి చూస్తున్నారు.

నాడు రామారావుపై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు రామతీర్ధంలో రాముని విగ్రహాలు పగల గొట్టించిన ఘోరీ చంద్రబాబు.  రామారావుపై చెప్పులు వేయించి ఆయన విగ్రహానికి దండలు వేసినట్లే..ఇప్పుడు రామతీర్ధంలో విగ్రహాలు ధ్వంసం చేయించి అక్కడికే పర్యటన  అంటూ బయల్దేరాడు ఆంధ్రా ఔరంగజేబ్ చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగానే గుడులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు ఘాటుగానే విమ ర్శిస్తు న్నారు. గుడులపై దాడులు చేయించి రాజకీయ అలజడి సృష్టించి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేక ముద్ర వేసి బీజేపీ సంకలోకి దూరడానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఛీ అనక తప్పదు. “నాకంటే నా అల్లుడు చంద్రబాబు చాలా మంచి నటుడు”అంటూ ఎన్టీఆర్‌ అన్న మాటలను  ప్రజలు ఇంకా మరిచిపోలేదు. విజయవాడలో చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చారు . పుష్కరాల్లో కుటుంబ షార్ట్‌ ఫిలిం కోసం 29 మంది భక్తులను పొట్టన  పెట్టుకున్న చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలు ఇంకా మరువలేదు. అన్ని కులాలను,మతాలను, ప్రాంతాలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న వైఎస్‌ జగన్‌ మీద చంద్రబాబు చేసే మత రాజకీయాలను ప్రజలు దగ్గరుండి గమనిస్తున్నారు.

2014-19 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన అరాచకాలు ఒక్కోటి బయటపడుతున్నాయి.దీంతో చంద్రబాబుకు చలి కాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దూకుడుతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు హయాంలో దేవాలయాల నిధులను ధర్మపోరాట దీక్షలకు  చంద్రబాబు మళ్లించారు. టీడీపీ సొంత ప్రచారానికి దేవాలయాల నిధులను పెద్ద ఎత్తున వాడుకున్నారు.  అంతేకాదు..మరో వైపు ఓటుకు కోట్లు కేసు తరముకొస్తుంది. అమరావతి  భూకుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. విశాఖలో టీడీపీ నేతల భూ కబ్జాలు చూసి ప్రజలు ముక్కువ వేలేసుకుంటున్నారు. అంతేకాదు..చంద్రబాబు బినామీ రాయపాటి సాంబశివ రావు చౌదరి బ్యాంకులకు పెట్టిన 8వేల కోట్ల టొకారా చంద్రబాబకు గాలి ఆడకుండా చేస్తున్నాయి. అందుకే..దేవాలయాలపై దాడులు చేయించి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు మత రాజకీయాలకు తెరలేపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 50వేల 958 ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు ఉన్నాయి.  వీటిలో ఆలయాలు 30వేల 415, చర్చిలు 15వేల101, మసీదులు 5వేల 442.దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఆయా మతస్తులతో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటాయి. సాధ్యమైనంత వరకు పోలీసులు ఉంటారు. కానీ..అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులు దగ్గర పోలీసులు ఉండలేరు . దీనినే చంద్రబాబు అదునుగా తీసుకుని జూమ్‌లో రెచ్చగొట్టి దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతల ఆరోపణ.

హిందూ మతం , దేవాలయాలు, దేవుళ్ల గురించి మాట్లాడే కనీస అర్హత చంద్రబాబుకు లేదు. ఎందుకంటే..రిసార్టల కోసం దేవాలయాలను కూల్చి, దేవతా విగ్రహాలను పెకిలించిన ఘనుడు చంద్రబాబు.  పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నవంబర్ 14, 2017 శివ లింగాన్ని చంద్రబాబు తొలగించారు. అది కూడా పవిత్ర కార్తీక మాసంలో  శివలింగాన్ని తొలగించడంతో  ప్రజలు ఇ ప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  శివలింగాన్నే కాదు గణపతి, నందీశ్వరుడి విగ్రహాలను కూడా తొలగించారు. విగ్రహాలను తొలగించే సమయంలో కనీసం సంప్రోక్షణ  కూడా చేయలేదు. చెప్పులతోనే విగ్రహాలను  పెకిలించారు .భారీ  సంఖ్యలో పోలీసులనె మోహరించి  పవిత్ర ఏకాదశి పర్వదినం రోజున విగ్రహాలు తొలగించారు.  పర్యాటకం ముసుగులో దేవతా విగ్రహాలు  తొలగించడంపై ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

2104-19 మధ్య కాలంలో ఔరంగజేబ్ కంటే ఘోరంగా చంద్రబాబు హిందూ మతంపై దాడి చేశారు. అడ్డు వచ్చిన దేవాలయాలను ముస్లిం రాజులు, బ్రిటిషర్లు ఏ మాత్రం కూల్చారో తెలియదు కానీ..చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం దేవాయాలను కూల్చి విగ్రహాలను పెకిలించారు. ఇటువంటి చంద్రబాబు హిందూ మతం ఉద్ధరణ గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. చంద్రబాబుకు మతం, కులం, ప్రాంతం ఉండదు. కేవలం రాజకీయ అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. దేవుడిని లేకుండా చేసి తన రాజకీయ స్వార్ధాన్ని నెరవేర్చుకుంటారు. అరిస్ట్రాటిల్ చెప్పినట్లు  చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఆ అధికారం కోసం ఏ కుట్రైనా పన్నుతారు. ఆ కుట్రలో దేవుళ్లను కూడా భాగస్వాములను చేసే  రాజకీయ నటుడు చంద్రబాబు.

కానీ…చంద్రబాబు ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలి. రాజకీయాలు అధికారం కోసం కాదు, ప్రజల కోసమని నమ్మి పాలిటిక్స్ చేయాలి. రాజకీయమంటే ప్రజాసేవ. చంద్రబాబు దృష్టిలో రాజకీయమంటే అధికారం పొందడం, అనుభవించడం. ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు. తన అధికారం మాత్రం పదిలం కావాలి. అందుకే..చంద్రబాబును 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారు. 23 సీట్లు ఇచ్చి కరకట్ట మీద నుంచి తరిమి కొట్టారు. రాబోయే రోజుల్లో  చంద్రబాబు తన ఆలోచనలు మార్చుకోకపోతే ఆంధ్రాలో చంద్రబాబుకు కరకట్ట మీద ఇల్లు కూడా మిగలదు. ఎందుకంటే..దేవుడు అన్ని చూస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు  ప్రజల చేత ఓట్లు వేయించి  శిక్షిస్తాడు. ఇప్పటికైనా చంద్రబాబు మత విద్వేషాలు రెచ్చగొట్టడం మాని జీవిత చరమాంకంలో దైవ సేవ, ప్రజా సేవ చేసుకుంటే చేసిన పాపాలైనా పోతాయి..!!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami