చంద్రబాబు ఓ కలల బేహారీ

294

-మ్యానిప్యులేట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌ చంద్రబాబు.. మ్యాన్‌ ఆఫ్‌ పీపుల్  జగన్
-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి

2020 ప్రపంచ చరిత్రలో కోవిడ్‌ కారణంగా గుర్తుండిపోయే సంవత్సరమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించి కోవిడ్ ఇబ్బందులను ఎదుర్కొంటూ, కొత్తరకం పాలనను రూపొందించుకోవటంలో 2020 వేదికైందని సజ్జల తెలిపారు. రాజకీయంగా కూడా ఒకతరం నుంచి మరొక తరానికి మార్పు జరిగినట్లు అయిందన్నారు. అతిపెద్ద కొవిడ్‌ సవాలు ఎదురైన ఈ సమయంలో జగన్ గారి ప్రభుత్వం ఈ సవాలుని సమర్థవంతంగా ఎదుర్కొంది. కోవిడ్ విపత్తు ఉన్నా రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమమూ ఆగలేదని సజ్జల వివరించారు.

గత 20 ఏళ్లుగా చంద్రబాబు విజన్ 2020 అని చెప్పారు. కానీ ఆ 2020 అయిపోయి ఇప్పుడు మూడో దశాబ్ధంలోకి వచ్చామని సజ్జల అన్నారు. ఏ పెద్ద మనిషైతే (చంద్రబాబు) 2020 అంటూ వచ్చారో తన ఆలోచనలను, తన విలువలను, విధానాలను అమలుచేయటానికి ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.  2019 ముందు చంద్రబాబు ఏకంగా విజన్‌ 2020 నుంచి విజన్‌ 2050కి జంప్ అయ్యారు. 2018 వచ్చేసరికి చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయని సజ్జల అన్నారు. 2050 విజన్‌ అంటూ చంద్రబాబు కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  జగన్ లాంటి వ్యక్తో, లోకేశ్ లాంటి వారు 2050 అని చెబితే ఓ అర్థం ఉంటుంది. ఎందుకు అంటే వీరికి వయస్సు ఉంది కాబట్టి చెప్పవచ్చు, కానీ 70 ఏళ్లు వచ్చిన వ్యక్తి 100 ఏళ్లు ఉండి ప్రజలకు సేవ చేయాలని ఉన్నట్టుంది.

పదేళ్లు, ఇరవై ఏళ్ల తర్వాత జరగబోయేది చెప్పటాన్ని కలల బేహారులుగా సినిమా వాళ్లు అంటుంటారు. అది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం బావుంటుంది. కానీ, రాజకీయంలో ఉండేవారు అలా చేయటానికి వీల్లేదని సజ్జల తెలిపారు. జనం జీవితాలతో ఆటలు ఆడుకోవటమే. అదే పనిని చంద్రబాబు చేశారు. ఐదేళ్ల తర్వాత అయితే కళ్ల ముందు ఉంటారు. ఏం చేశారో సమాధానం చెప్పాల్సి వస్తుందని 2020, 2050 అంటూ విజన్‌ ల పేరుతో కాలయాపన చేశారు. కానీ,  20-30 ఏళ్లు తర్వాతది అయితే అది కలల కింద చూపిస్తే బ్రహ్మాండమైన విజనరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. రెండోవైపు మన అధికారం ఇచ్చిన కాలమూ అయిపోతుంది. ప్రజల బతుకుల్ని గాలికి వదిలేసి అనుకున్న పని చక్కబెట్టుకోవచ్చు అనేది 14 ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు దార్శనికత అనేది నకిలీ దార్శనికత అని గుర్తు చేసుకోవటానికి 2020 ఉపయోగపడిందని సజ్జల అన్నారు. నిజమైన దార్శనికుడు, విజనరీ ఎలా ఉంటారంటే.. తన చేతల్లో తను బ్రతికే విధానంలో చూపిస్తారని.. ఒక తండ్రీ, ఒక కొడుకు ద్వారా ప్రపంచానికి తెల్సి వచ్చిందని సజ్జల అన్నారు. ఆ తండ్రి వైయస్‌ఆర్‌ అయితే, కొడుకు  జగన్ గారని సజ్జల పేర్కొన్నారు.

వైయస్‌ఆర్‌ ఏం అనుకున్నారో అది చేసుకుంటూ పోయారు. ఈరోజున  జగన్ గారు కూడా ప్రజలకు మేలు చేస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నో చేసి చూపించారు. ఇంకా చేసి చూపిస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవాలంటే… కేరక్టర్‌ ఉన్న వ్యక్తి నాయకుడు అయితే అతని వెంట ఎలాంటి వారు నిలబడతారు. పార్టీ అయితే దాని కల్చర్ ఎలా ఉంటుందనేది తెలుస్తాయని సజ్జల తెలిపారు. రెండు పార్టీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అందులో ఒకటి (టీడీపీ) మనకి దురదృష్టం అయితే ఇంకొకటి (వైయస్‌ఆర్‌సీపీ) మన అదృష్టమని సజ్జల అన్నారు. చంద్రబాబు దురదృష్టం అయితే, దివంగత రాజశేఖరరెడ్డి ,  జగన్ మన అదృష్టమని సజ్జల అన్నారు. ఈ రెండింటి మధ్య తేడానే మనకు పెద్దగీత, చిన్నగీత అని సజ్జల తెలిపారు. అసలు చంద్రబాబుది అయిపోయింది కదా.. మీది మీరు చెప్పుకోవచ్చు కదా అని అందరూ చెబుతున్నారు. మాది మేం చెప్పుకోవాలంటే దగ్గరలో గుర్తుగా ఇది చిన్నది అని చెప్పుకోవటానికి చంద్రబాబును ప్రస్తావిస్తున్నాం తప్ప ఆయన్ను అగౌరవపరచాలనో, అవమానించటానికి కాదని సజ్జల తెలిపారు.

రియల్‌ విజనరీ టీచర్‌ అయితే టీచింగ్‌లో, ఫిలాసఫర్ అయితే తన ఫిలాసఫీ టీచింగ్‌లో కనిపిస్తుందని, లెక్చరర్‌ అయితే విద్యార్థులను తయారు చేయటంలో కనిపిస్తుందని సజ్జల అన్నారు. అదే ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు అయితే పార్టీలో, తన జీవిన విధానంలో, చుట్టూ ఉండేవారిలో వ్యక్తం కావటంతో పాటు ఆయన ఆలోచనల్లో ప్రస్ఫుటిస్తాయని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు ఇన్నాళ్లు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. గతంలో జనాలు చూసేది మీడియాలో వచ్చే ఫొటోల్లో  అయితే ఇప్పుడు టీవీ కెమెరాల్లో కనపడుతోందన్నారు. నువ్వు ఎలా ఉన్నావన్నది గాలికి వదిలేసి.. అవతల వారికి బురద పట్టించి జనాలకు చూపించటమే చంద్రబాబు సిద్ధాంతం అని సజ్జల తెలిపారు. అలా అవతలవారు బయట స్వచ్ఛంగా ఉన్నా జనానికి పట్టదు అన్న సిద్ధాంతం ఇప్పటి వరకు చంద్రబాబు పాటిస్తూ వచ్చారు. ఎందుకు పనికిరాని వ్యర్థమైన భ్రమల్ని చంద్రబాబు కల్పించారని సజ్జల అన్నారు.

గతంలో వ్యవసాయం దండగ-టూరిజం పండగ అని చంద్రబాబు అన్నారు. చివరకు రైతు ఎలా బ్రతుకుతున్నారు. పేదలు ఎలా ఉన్నారు. రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు కాకుండా కొరియా, రష్యాలు అంటూ భ్రమల్లో పెట్టొచ్చు అనుకుంటూ కొద్దికాలం నడిపించారు. ఇది కూడా ప్రజలంతా గమనించారన్నారు. గతంలో వైయస్ఆర్‌ గారిపై ఫ్యాక్షనిస్ట్‌ ముద్ర వేయటంతో పాటు ఎన్నిరకాలుగా బురద చల్లాలో అన్నింటినీ చేయించటంలో చంద్రబాబు పాత్ర అందరికీ తెల్సని సజ్జల అన్నారు. వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈయన కదా నాయకుడు అనుకున్నారు. ఇన్నాళ్లు ఈయన్ని మిస్‌ అయ్యాం అని జనం అనుకున్నారు. అప్పట్లో వైయస్‌ఆర్‌ తనకు ఉన్న పరిమితులకు లోబడి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఆధునిక వైద్యం, విద్యను పేదలకు అందించటంలో విజయవంతం అయ్యారు. రైతులకు ఉచిత విద్యుత్‌ వంటివి వైయస్‌ఆర్‌ ఇచ్చారు. ఆయన హఠాన్మరణంతో ఎన్ని గుండెలు ఆగాయో చూసి ఇది కదా రియల్ అన్నది ప్రపంచానికి తెల్సిందని సజ్జల గుర్తు చేశారు. అదీ అసలైన దార్శనిక, కమిట్మెంట్‌. విలువల పట్ల ఒక నమ్మకం, విశ్వాసం. ఏదో చేయాలి. నేను బ్రతికి ఉన్నంత కాలం దాంట్లో కనిపిస్తాయని సజ్జల అన్నారు. చంద్రబాబు, టీడీపీ చేసిన దుష్ప్రచారం ఎంత అబద్ధమో అన్నది వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలిసి వచ్చింది.

ఆనాడు వైయస్‌ఆర్‌ను ఏరకంగా ఇబ్బంది పెట్టారో, తర్వాత జగన్  గారిని కూడా సంబంధం లేని కేసుల్లో ఇరికించాలని చూశారు. వాటినన్నింటినీ కోర్టులో ఎలా మేనేజ్‌ చేశారో.. అన్యాయంగా, అక్రమంగా  జగన్ జైల్లో ఉండాల్సి రావటం అందరం చూశామని సజ్జల తెలిపారు. 2014లో ప్రజలు  జగన్ గారికి చంద్రబాబుతో పాటు దాదాపు సమానమైన ఓట్లు ఇచ్చి అభిమానం చూపారు. అధికారంలో రాలేకపోయినా తక్కువ మార్జిన్‌తో చంద్రబాబు బయటపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబు జగన్ గారికి కూడా బురద పూయాలని చూశారు. అయినా తండ్రి వైయస్‌ఆర్ రాజకీయ వారసుడిగా  జగన్ గారిని ప్రజలు గుర్తించారు. 2014లోనే ప్రజలు చంద్రబాబును ఆల్‌మోస్ట్‌ తిరస్కరించారు. ఇక, 2019 వచ్చేసరికి చంద్రబాబుకు దణ్ణం పెట్టి  జగన్ గారికి ప్రజలు పట్టాభిషేకం చేశారు. తద్వారా విశ్వసనీయతకు, నమ్మిన విలువులకు కట్టుబడితే 2019 ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయని సజ్జల తెలిపారు.

2014-19 మధ్య వచ్చిన అధికారాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు. ఆఖరు దశలో ఎంత వీలైతే అంత దండుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు కూడా ఆశ చావక విజన్‌ 2030, 2050 డ్రీమ్స్ క్రియేట్ చేయాలని చూశారు. అప్పుడు రాజధాని ఒక భ్రమ అయితే పోలవరంను ఒక సంపాదన యంత్రంలా బాబు మార్చారు. మోడీ గారి మాటల్లో చెప్పాలంటే కామధేనువులా.. ఏటీఎంలా పోలవరంను చంద్రబాబు చేశారు. అధికారం కోసం రుణమాఫీ అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. తద్వారా రైతులకు, డ్వాక్రా మహిళలకు అప్పులు పుట్టని పరిస్థితి చంద్రబాబు తెచ్చారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలతో పాలన ప్రారంభమైందని సజ్జల వివరించారు. ఇలాంటి క్రైసిస్ సమయంలో ఎవరైనా పాలన మొదలుపెడితే ఓట్ల సమయంలోనే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారన్నారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు లాంటి రాజకీయనాయకుడు దీన్నో అవకాశంగా భావించి వెంటనే తను ఇచ్చిన హామీలు అన్నింటినీ నామం పెట్టేస్తారు. కోవిడ్‌లాంటిది దొరికితే మొత్తం చాప చుట్టేసేవారు. మొత్తం కోవిడ్‌కే పెట్టాలి. వీలైతే భ్రమరావతి కోసం మట్టి, స్మశానం, ఇటుకలు అని విరాళాలను ఎదురు అడిగేవాడు. కానీ, సీఎం  జగన్ ఏం చేస్తున్నారో ప్రజలు అందరం చూస్తున్నారు. కోవిడ్‌ ఛాలెంజ్‌ వచ్చినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని గర్వంగా చెబుతున్నామని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సజ్జల వివరించారు. ప్రకృతి విపత్తులు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్‌ రూ.3000 కోట్లతో పెట్టారని, రైతులకే కాకుండా మిగిలిన వర్గాలకు డీబీటీ ద్వారా రూ.80 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి చేరాయి. మధ్యవర్తి లేకుండా నేరుగా తల్లులు, రైతుల ఖాతాల్లోకి నగదు వెళ్లటం జరిగిందన్నారు. ఇదంతా తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చింది కాబట్టే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌గా ఉందన్నారు. 2019తో పోలిస్తే జీఎస్టీ 26% అడ్వాన్స్‌లోకి వెళ్లటం జరిగిందని సజ్జల వివరించారు.

జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సహాయం చేయటంతో పాటు మహిళలకు పెద్ద పీట వేయటం జరుగుతోందని సజ్జల తెలిపారు. వైయస్ఆర్‌ గారి తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు మాత్రమే భారీగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం జరుగుతోందని సజ్జల తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసి లేఅవుట్లు వేసి ఇస్తోంది. ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంటే టీడీపీ కుట్రలు చేసి కోర్టుల్లో కేసులు వేసి అడ్డంపడుతోందని సజ్జల మండిపడ్డారు.  పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంత ఆస్తి కింద ఇళ్లను ఇవ్వాలని సీఎం  వైయస్‌ జగన్ అనుకున్నారు. ఆ అక్కచెల్లెమ్మలు తమ అవసరాలకు ఇళ్లను బ్యాంకులో తనఖా పెట్టి లోన్లు తీసుకోవచ్చు. అయితే దీన్ని టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డంపడింది. ప్రస్తుతం పట్టా మాత్రమే ఇస్తున్నామని ఆస్తి హక్కు కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని సజ్జల వివరించారు. ఇంటి నిర్మాణం కూడా ఒక పద్ధతి ప్రకారం చక్కని సొంతింటిని సీఎం జగన్  ఇవ్వనున్నారని సజ్జల తెలిపారు.

జవనరి 9న అమ్మ ఒడిని సీఎం  జగన్ ఇవ్వనున్నారు. దీనివల్ల మహిళా సాధికారికత అనేదాన్ని చేతల్లో సీఎం శ్రీ జగన్ చేసి చూపిస్తున్నారని సజ్జల వివరించారు. ఆసరా, అమ్మ ఒడి, చేయూత రూపంలోనే కాకుండా ఆస్తిని కూడా అక్కచెల్లెమ్మలు రాసిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు చేసి ఉండొచ్చు. అయితే, ఎందుకు చేయలేదు అంటే ఆయన ఆలోచన వేరు కాబట్టి. ప్రజలు ఆ ఆలోచన ధోరణి ఉన్న నాయకుడు కావాలా? ఇలా ప్రజలకు మేలు చేసే ఆలోచన ధోరణి ఉన్న నాయకుడు కావాలా అంటే ..  జగన్ గారిని ఎంచుకుంటారన్న సంగతి అందరికీ తెల్సిన విషయమే అని సజ్జల అన్నారు.

చంద్రబాబు, ఆయన పక్కన ఉండే వాయిద్య బృందాలు ఎక్కడాలేని విధంగా మతం, కులం, స్థానిక సంఘటనలు ఏవైనా జరిగితే దాన్ని తీసి… వీటన్నింటినీ కూర్చి మీడియా ద్వారా, కోర్టుల ద్వారా వ్యవస్థలను ఎలా మెయింటైన్‌ చేస్తున్నారో చూస్తున్నామని సజ్జల అన్నారు. ప్రభుత్వం తల్చుకుంటే ఏవైనా చేయొచ్చు. కానీ సీఎం జగన్  మొత్తం వికేంద్రీకరణ చేసి పారదర్శకతతో పాలన చేస్తున్నారని సజ్జల తెలిపారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు పైగా ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా లబ్ధిపొందుతున్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల విత్తనాల నుంచి పంటల కొనుగోలు వరకు చేస్తున్నారని సజ్జల వివరించారు. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పనుల్ని పూర్తి చేసి నీరు ఇస్తామని సజ్జల తెలిపారు.

జగన్ గారి పాలన ఎలా ఉందో లాభం పొందుతున్న ప్రతి ఒక్కరికీ తెల్సని సజ్జల తెలిపారు. కానీ చంద్రబాబు మిడిల్‌క్లాస్‌, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌, మేధావులు, ఈ బెనిఫిట్స్ అవసరం లేని వర్గాల అభిప్రాయాలను మార్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వర్గాల వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని.. చంద్రబాబు ఎలాంటి వారో, జగన్ ఎలాంటి వారో గమనించాలని సజ్జల కోరారు. ఎన్టీఆర్‌ను గద్దె దించిన దగ్గర నుంచి ఇటీవల ఓటుకు నోటు కేసు వరకు చంద్రబాబు ఏం చేశారో గమనించాలన్నారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్య ఏం జరిగిందో చెబుతున్నారు. గతంలో నిబంధనల ప్రకారం 90 రోజుల్లో జగన్ గారికి రావాల్సిన బెయిల్‌ను రాకుండా కూడా అడ్డుకున్నారు. పైగా 2019 ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోను కంప్యూటర్‌లో నుంచి చంద్రబాబు తీసేయించారని సజ్జల గుర్తు చేశారు. జగన్‌ గారు మాత్రం.. ప్రజలకు ఐదేళ్లు కాలపరిమితి ఇచ్చారని హామీలను నాలుగేళ్లలో చేయాలని ముందుకువెళ్తున్నారు.

చేయలేనిది అస్సలు చెప్పటం లేదు. చెప్పింది ఏదీ చేయకుండా ఆగటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను దగ్గర తీసుకొని వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇచ్చారు. దీనికోసం 700 మందికి పైగా బీసీలను కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు చేశారు. డీబీటీ ద్వారా పై నుంచి కిందివరకు అన్ని కులాల వారికి లబ్ధి జరుగుతోందన్నారు. ఎవరికైనా అర్హత ఉన్నా లబ్ది జరగకపోతే చెప్పండని అడిగినా అలాంటివి ఏవీ లేవన్నారు. ఏతావాతా తేలేది ఏమిటి అంటే.. పార్టీలకు, కులాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని సజ్జల వివరించారు. ఇందుకు భిన్నంగా ఏమైనా అయిందేమో ఓపీనియన్‌ మేకర్స్ అయిన మేధావులు, విజ్ఞులను కోరుతున్నామన్నారు.

రాష్ట్రంలో కొత్తగా పోర్టులు వస్తున్నాయని సజ్జల తెలిపారు. కోస్టల్ లైన్‌ డెవలప్‌మెంట్ జరుగుతోందని భోగాపురం ఎయిర్‌పోర్టు కూడా త్వరలో పూర్తి అవుతుందని సజ్జల వివరించారు. కోర్టుల్లో అడ్డంపడకపోతే ఇప్పటికే విశాఖపట్నం నుంచే పాలన మొదలై ఉండేదన్నారు. మూడు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు గౌరవిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణ జరిగి ఉండేదన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో చిత్తశుద్ధితో పాలన చేస్తున్నారని సీఎం జగన్  ఆచరణలో చూపించారన్నారు. జగన్  వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అమల్లో చూపటం మొదలుపెట్టారు. ఇంకొంత అడ్వాన్స్‌తో ఇళ్ల పనులు మొదలైతే కన్‌స్ట్రక్షన్‌ రంగం, ఎకానమీ బూస్ట్‌ అవుతుందని సజ్జల తెలిపారు.

నాయకుడు ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చని సజ్జల అన్నారు. యువనాయకుడు సీఎం  జగన్ గారిని చూసి ఆదర్శపాయంగా నాయకుడు ఎలా ఉండాలో పెద్దవారు, వృద్ధులు కూడా నేర్చుకోవచ్చన్నారు. అంతకుముందు చంద్రబాబు పాలన, ఏడాదిన్నరలో  జగన్గా రి పాలన పరీక్షలకు తట్టుకొని ఎలా నిలబడిందో సజ్జల వివరించారు. 2020లో మ్యానిప్యులేట్‌ పాలిటిక్స్‌, మ్యాన్‌ ఆఫ్ మ్యానిప్యులేషన్స్, మ్యాన్‌ ఆఫ్‌ ఇమేజిటేటివ్ మీడియా క్రియేషన్స్ చంద్రబాబు అని సజ్జల అన్నారు. కానీ ఇటువైపున మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌, మ్యాన్‌ ఆఫ్‌ పీపుల్ జగన్  ఉన్నారని సజ్జల తెలిపారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. చరిత్రలో ఘోరమైన జీవిత చరిత్రను తనే సొంతంగా రాసుకుంటూ చంద్రబాబు ముగించుకుంటున్నారని సజ్జల అన్నారు.  రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది?

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల దృష్టి మరల్చటానికే బాబు ప్రయత్నిస్తారు
ఇవాళ కాకపోతే, రేపైనా రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని పోలీసులు పట్టుకుంటారు

– ఇటీవల రాముడి విగ్రహం శిరస్సు తీసినా, అది కచ్చితంగా తెలుసు… ఎవరు చేశారో. ఆ పని చేయటం వల్ల ఎవరికి ఇంట్రెస్ట్‌ ఉంటుందని సజ్జల ప్రశ్నించారు. దేవుడి విగ్రహాలు తప్పించటం వల్ల వైయస్ఆర్‌సీపీకి, సీఎం  జగన్ గారికి ఏవిధమైన లాభం ఉంటుందని సజ్జల ప్రశ్నించారు. ఎవరు ఇలాంటివి చేస్తారు. ఆ చిట్టా ఓపెన్‌ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. విధ్వంసకులు ఆ పనిచేస్తారని సజ్జల అన్నారు. తిరుమలలో ఎప్పుడూ ఉండే పూర్ణకుంభమే ఉంది. కానీ అందులో క్రాస్‌ ఉందని ఎవరు ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారని సజ్జల ప్రశ్నించారు. ఎవరైతే సీఎం జగన్ పై బురద చల్లాలని దీనికి లేని రంగు పూయాలని చూసేవారే,  ఆ ప్రయత్నాలు చేస్తారని సజ్జల అన్నారు. ప్రజారంజక పాలన అందించాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే.. ఇలాంటి పనులను .. ప్రజల దృష్టిని మళ్లించాలనుకునేవారే చేస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా అదే చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నా అదే చేస్తున్నారు. ఒక సంబంధంలేని సమస్య సృష్టిస్తే అసలు సమస్య పక్కకుపోతే చాలని బాబు అనుకుంటారు. లేదా భ్రమలు క్రియేట్ చేస్తారు. అధికారంలో లేనప్పుడు ఎదుటివారిని నల్లగా, చండాలంగా చూపాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా రాముడి విగ్రహం ధ్వంసం చేసినా వారిని పోలీసులు పట్టుకుంటారని సజ్జల తెలిపారు. పట్టుకున్న తర్వాత అతడు చంద్రబాబు గుంపులో నుంచో, లేక బాబు తాబేదారు మందలో నుంచి వచ్చిన వ్యక్తో, అలాంటి లక్షణాలు ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తో అయి ఉంటాడని సజ్జల అన్నారు