టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు‌

238

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్వర్యంలో గవర్నర్ తమిళసై ను బీజేపీ నాయకులు కలిసారు. గవర్నర్‌తో భేటీ అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ…జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ది కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదు. వారు చెప్పిన సమస్యలు పరిష్కరించడంలేదు. టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి దోపిడీ ప్రణాళిక పూర్తయ్యే వరకు కొత్త పాలక వర్గాన్ని అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు అని బండి సంజయ్‌ ఆరోపించారు. కొత్తగా గెలిచిన కార్పొరేట్లను గుర్తిస్తు గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. అలాగే జీహెచ్‌ఎంసీ కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ను బీజేపీ నాయకులు కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, బీజేపీ నేతలు ప్రభాకర్‌, రామచందర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.