రాజ్ భవన్ లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు

2021 సంవత్సర కాలమానిని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

తిరుమల శ్రీవెంకటేశ్వరుడు, పూరి జగన్నాధ స్వామి, కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నూతన సంవత్సర శుభవేళ ప్రతి ఇంటా సంతోషం వెల్లి విరియాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర ఆగమన శుభవేళ విజయవాడ రాజ్ భవన్ లో శుక్రవారం నిరాడంబరంగా వేడుకలు జరిగాయి. కరోనా నేపధ్యంలో ఓపెన్ హౌస్ ను రద్దు చేయటమే కాక, రాజ్ భవన్ ప్రవేశం పై కూడా ఆంక్షలు అమలు చయటంతో కేవలం కొద్ది మంది అధికారులు, ఉద్యోగుల సమక్షంలో కార్యక్రమాన్ని ముగిసింది. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ కరోనా చేదు అనుభవాలకు నూతన సంవత్సరం ముగింపు పలుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో భాగంగా కరోనా సూచనలు, అధికారిక సెలవుల సంపూర్ణ సమాచారంతో రూపొందించిన రాజ్ భవన్ డిజిటల్ కాలమానికి గవర్నర్ ఆవిష్కరించారు.  తొలుత విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్దానం పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. తదుపరి తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు ఆశీర్వచనం పలికి తీర్ధ ప్రసాదాలు అందించారు.

గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మంత్రులు బొత్సా సత్యన్నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం ఛైర్మన్ సోమినాయిడు,  స్దానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. ఐఎఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, కృష్ణబాబు, విజయానంద్, సిద్దార్ధ జైన్, ప్రసన్న వెంకటేష్, మాధవి లత,  ధ్యాన్ చంద్, భావన, ప్రోటోకాల్ సంచాలకులు బాలసుబ్రమణ్య రెడ్డి,  ఐపిఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, ద్వారకా తిరుమల రావు, రవి శంకర్ అయ్యన్నార్, సునీల్ కుమార్, రాజేంద్రనాధ్ రెడ్డి, బత్తిన శ్రీనివాసులు, విక్రాంత్ పాటిల్ తదితరులు ఉన్నారు. సమాచార హక్కు చట్టం కమీషనర్లు రమేష్ కుమార్, రవి కుమార్, రమణ కుమార్, జనార్ధన్,  ఐలాపురం రాజా, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శులు శ్యామ్ ప్రసాద్, నాగమణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami