బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహనం

0
169

ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం కోటి చౌరస్తా చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుండి ఇప్పటివరకు ఇరవై ఒక్క మందిరాల పైన దాడులు చేయడం జరిగింది .హిందు వ్యతిరేకులు ఒక పథకం ప్రకారమే హిందూ మందుల పైన దాడులు జరుగుతున్నాయి. దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయుచున్నారు అయినా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి విగ్రహ ధ్వంసం చేసిన దోషులను అరెస్టు చేసి కేసులు పెట్టిన సంఘటనలు ఇప్పటివరకు జరగలేదు అంటే హిందువుల మనోభావాలు జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదా అని బజరంగ్దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ ప్రశ్నించారు .ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూ మందిరాల పైన జరిగిన దాడులపై సిబిఐ విచారణ చేయించాలి అని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్థుంది. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సి పి లో ఉన్న హిందూ నాయకులకు బజరంగ్ దళ్ ఒకటే సూటి ప్రశ్న అడుగుతుంది , మీరు హిందూ మతస్తులు అయితే హిందూ దేవతలకు అవమానం జరుగుతుంటే ఎందుకు ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించలేకపోతున్నారు బజరంగ్ దళ్ ప్రశ్నిస్తుంది. హిందూ ధర్మానికి హిందూ దేవతల పైన జరిగే దాడులను ప్రతి హిందువు ఖండించివలసిందిగా భావిస్తున్నాం.

తిరుపతిలో ప్రతిరోజు ఏదో ఒక ఒక హిందూ వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నవి శ్రీశైలంలో ఒక ముస్లిం వ్యక్తి మందిరానికి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఏమని భావించాలి
జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి క్రిస్టియన్ మత రాజ్య చేయుట కొరకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు జరుగుతున్నాయని భావించవలసి వస్తుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్  సిఎం స్పందించకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని బజరంగ్ దళ్ హెచ్చరిక చేసింది ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విభాగం నాయకులు చైతన్య రుద్ర బ్రహ్మం బజరంగ్ దళ్ జిల్లా నాయకులు అఖిల్ వినోద్, విశాల్ ప్రవీణ్ ,అభిషేక్, విశ్వహిందూ పరిషత్ విద్యా నగర్ జిల్లా అధ్యక్షులు మీ పేరు అజయ్ రాజ్ మరియు మహేష్, శ్రీనాథ్ అంకిత్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.