దివాలా తీసిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

531

అనేకసార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా వర్ణించిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు రైతుబంధు డబ్బులు అన్ని ఒకే సమయంలో రైతుల అకౌంట్లో వేసేవారు. ఇప్పుడు అనేక దఫాల వారీగా రైతుబంధు సొమ్ము చెల్లిస్తున్నారు
ఇంతకుముందు ఉద్యోగుల జీతాలు అన్ని మొదటి తారీకు నాడే వచ్చేవి.ఇప్పుడు జిల్లా కు ఒక తేదీ చొప్పున ప్రతి నెల 10వ తేదీ వరకు జీతాలు వస్తున్నాయి. ఇంత ముందు కాంట్రాక్టర్లకు బిల్లులు కాస్త ముందో వెనుకో చెల్లించేవారు.ఇప్పుడు తక్షణం 15 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చెల్లించవలసి ఉంది కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.
ఇంత ముందు ఎప్పుడో ఒకసారి ట్రెజరీ లు ఫ్రీజింగ్ లో ఉండేది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఫ్రీజింగ్ ఉండడం లేదు.ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలను కొనేది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి రైతులను మీ ఇష్టం ఉన్న దగ్గర అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచిస్తుంది.
ఇంతకు ముందు రైతుల కోసం  ఎంత డబ్బైనా బడ్జెట్ నుంచి కేటాయిస్తామని బీరాలు పలికింది.కానీ ఇప్పుడు మాకు 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కాబట్టి ఇక నుంచి పంటను కొనుగోలు చేయలేని నిస్సహాయత వ్యక్తం చేసింది.ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పోటీపడి మరీ పిఆర్సి ఇచ్చింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో IR ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇక్కడ ఆ జాడే లేదు.
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే FRBM ప్రకారం తీసుకోవాల్సిన అప్పు గరిష్ట స్థితికి చేరింది. పాత అప్పులకు ఇప్పటికే దాదాపు ప్రతి సంవత్సరం 30 వేల కోట్లకు పైగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది.ఇంతకుముందు నాలుగు విడతలుగా నైనా రైతు రుణమాఫీ అయింది. కానీ ఇప్పుడు 25 వేలకు పైగా అప్పు ఉన్న ఏ ఒక్కరికి రుణ మాఫీ కాలేదు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి లాంటి హామీల గురించి దేవుడికెరుక!! ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యొక్క రోజువారి ఖర్చులను భరించడానికి తల ప్రాణం తోకకు వస్తుంది.దాదాపు ఏడేళ్ల క్రితం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారి ఖాయిలా పడిన పరిశ్రమ స్థాయికి దిగజారింది.
ఇప్పుడు దేశంలో కొన్ని ధనిక రాష్ట్రాలకు పేద ముఖ్యమంత్రులు ఉన్నారు.
కానీ దివాలా తీసిన అప్పుల తెలంగాణ రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి ఉన్నందుకు ఆనందిస్తూ తృప్తి పడవలసిన అవసరం ఉందేమో!!
                                                                                                      — భారతీయ విద్య