సుస్థిరమైన విద్యుత్ రంగమే లక్ష్యం

0
162

➢ ప్రభుత్వ రంగంలో నే  విద్యుత్ సంస్థల బలోపేతం  ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

➢ ఆర్థిక అభివృద్ధిలో 24 x 7 విద్యుత్ సరఫరా కీలక పాత్ర 

➢ నిరంతర విద్యుత్ తో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి 

➢ రైతులను ఆదుకునేందుకే 9 గంటల పగటి పూట  ఉచిత విద్యుత్ 

➢ రబీ లో   నూరు శాతం వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ 

➢ ఉచిత విద్యుత్ కోసం రూ . 8,353 కోట్లు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

➢ వ్యవసాయం  కోసమే ప్రత్యేకం గా  10,000 మెగా వాట్ల సౌర విద్యుత్ 

➢ ఉచిత విద్యుత్  ను శాశ్వతం   చేయడమే ముఖ్యమంత్రి  వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం 

➢ వినియోగదారులకు అత్యుత్తమ విద్యుత్ సేవలను అందిచడం పై  ప్రత్యేక ద్రుష్టి 

➢ విద్యుత్ సంస్థల డైరీ , క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి 

➢ విద్యుత్  వినియోగ దారులకు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి 

రాష్ట్రంలో సుస్థిర విద్యుత్ రంగాన్ని  నిర్మించేందుకు ప్రభుత్వరంగంలోని విద్యుత్సంస్థలు బలోపేతం చెయ్యాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇంధనశాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  తెలిపారు. వినియోగదారులకు 24×7 నాణ్యమైన నిరంతర విద్యుత్, వ్యవసాయానికి పగటిపూటే ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని మంత్రితెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కాములు , నెడ్క్యాప్ , ఏపీ సోలార్ కార్పొరేషన్   , రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (APSECM),  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్ధ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో) డైరీ ఆవిష్కరణ, విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా గురువారం ఎపిసిపిడిసిఎల్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తిన సందర్భంగా, ఎపిసిపిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ  జె.పద్మ జనార్థన రెడ్డి అద్యక్షతన జరిగిన సమావేశం లో విద్యుత్ శాఖ ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

విద్యుత్ రంగానికి  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రితెలిపారు. విద్యుత్ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యుత్ సంస్థల  ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం 2019-20 సంవత్సరంలోరూ.17,900 కోట్లు విడుదల చేసింది అని తెలిపారు.

గత ప్రభుత్వ హయాములో బలహీనపడిన  విద్యుత్ రంగాన్ని  పునరుజ్జీవింపచేసేందుకు ముఖ్యమంత్రి వై .ఎస్. జగన్ మోహన్ రెడ్డి  పఠిష్టమైన చర్యలను చేపట్టారు. ఉద్యోగులలో, ప్రజలలో  విద్యుత్ సంస్థల భవిష్యత్తుపై భరోసా ఏర్పర్చగలిగామన్నారు. వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన చౌక విద్యుత్   అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పారిశ్రామికీకరణ , ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు, మెరుగైన వృద్ధిరేటు సాధించడంలో 24×7 నిరంతర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్  పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో రైతాంగం ఎంతో సంతోషంగా ఉంది. వ్యవసాయ దిగుబడులు పెరిగేందుకు, తద్వారా రైతుల ఆదాయం పెరిగేందుకు  ఉచిత    విద్యుత్  దొహదకారి  అయ్యిందని  మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ పథకానికి  బడ్జెట్లో రూ 8353.58  కోట్లు కేటాయించింది అని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల కన్నా ఇది 18 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ని మొత్తం 18.5 లక్షల  వ్యవసాయ కనెక్షన్లకు 11,593 మిలియన్ యూనిట్లు విద్యుత్  ను  సరఫరాచేస్తున్నారు.  రాష్ట్రం లోని 1.2 లక్షల ఆక్వా రైతులకు 3130 మిలియన్ యూనిట్లు విద్యుత్  ను సబ్సిడీ పై సరఫరా చేసేందుకోసం రూ 717.39 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది అని తెలిపారు.  రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారుల కు కూడా విద్యుత్ సబ్సిడీ ఇస్తుందన్నారు.ఇందు కోసం రాష్ట్రప్రభుత్వం 2020-21 సంవత్సరంలో  రూ 1707.05 కోట్లు  సబ్సిడీ అందజేయనుంది అనితెలిపారు. అలాగే ఉచిత విద్యుత్ ను  శాశ్వతం  చేయాలని దేశం లో తొలి సారిగా వ్యవసాయం కోసమే ప్రత్యేకించి  10,000 మెగావాట్ల సౌరవిద్యుత్  కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. ఇందు కోసం టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు.

ఏపీట్రాన్స్కో దేశంలోనే తొలి సారిగా కృత్రిమమేధ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్  (Machine Learning) సాంకేతికత ను ఉపయోగించి  ఇంధన డిమాండును ఒక రోజు ముందే అంచనా వేసే విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనివల్ల విద్యుత్ సంస్థలు  గ్రిడ్ ను సక్రమంగా నిర్వహించడంతో పాటు విద్యుత్ కొనుగోలు ధరను సాధ్యమైనంత మేరకు తగ్గించవచ్చునని తెలిపారు.

అలాగే విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని  తగ్గించేందుకు విద్యుత్ ఎక్సేంజీల  ద్వారా సుమారు రూ . 2 లు,  ధర వద్ద విద్యుత్ కొనుగోలు     జరిగిందని అన్నారు . ప్రధానంగా వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించటం పై విద్యుత్ సంస్థలు మరింతగా  దృష్టి పెట్టాలి అని మంత్రి సూచించారు. విద్యుత్ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా 7000 మంది ఎనర్జీ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగుల ను  నియమించింది అని మంత్రి తెలిపారు. విద్యుత్  వినియోగ దారులకు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి తెలియజేసారు .

ఈ  సందర్భంగా  ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు  చేస్తున్న ‘నవరత్నాలు’లో భాగంగావ్యవసాయానికి  పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ పథకాన్నివిజయవంతం చేయడంలో ప్రతి ఉద్యోగి విశేష కృషి  చేశారు.  అంకిత భావంతో పని చేశారు. ఈ పథకం ప్రారంభించిన కొద్దినెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం  వ్యయసాయ విద్యుత్ ఫీడర్లకుఉచిత విద్యుత్తును అందించగలగడం అభినందనీయం. అతి  త్వరలోనే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోనున్నాం. తద్వారా రాష్ట్రంలో రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనర్జీ సెక్రటరీ,  ఎ పి ట్రాన్స్కో  ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  – శ్రీకాంత్ నాగులపల్లి, ఐఎఎస్

ఎ పి జెన్కో  చైర్మన్ –  జి.సాయ్ ప్రసాద్, ఐఎఎస్

ఎ పి జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ – బి. శ్రీధర్, ఐఎఎస్

ఎపిఈపిడిసిఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ – Ms. నాగాలక్ష్మి.ఎస్, ఐఎఎస్

ఎపిసిపిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ –   జె.పద్మ జనార్థన రెడ్డి, బిటెక్

ఎ పి ఎస్ పి డి సి ఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ –  హెచ్.హరనాథ రావు, బిటెక్, ఎంబీఏ

ఎ పి ట్రాన్స్కో  జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విజిలెన్స్ & సెక్యూరిటీ – కె. వెంకటేశ్వరరావు, ఐపిఎస్

ఎ పి ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ –   కె.శ్రీధర్ రెడ్డి

ఎ పి ట్రాన్స్కో డైరెక్టర్ గ్రిడ్ & ట్రాన్స్మిషన్ –   కె. ప్రవీణ్ కుమార్

ఎ పి ట్రాన్స్కో  డైరెక్టర్ ఫైనాన్స్  –  డి.ముత్తు పాండ్యన్

ఎ పి సిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ ,  ఎ పి ఎస్ ఈ సి ఎమ్  సి ఈ ఓ  , ఎ పి ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ –  ఎ.చంద్రశేఖర రెడ్డి

ఎపిజెన్కో డైరెక్టర్ థర్మల్ –  జి.చంద్ర శేఖర్ రాజు

ఎపిజెన్కో డైరెక్టర్ ఫైనాన్స్ & కమర్షియల్ (ఎఫ్ఎసి) –  బి.వి.రెడ్డి

ఎపిజెన్కో  డైరెక్టర్ కోల్ & లాజిస్టిక్స్  –  ఆంటోనీ రాజా

ఎపిజెన్కో డైరెక్టర్ హెచ్ఆర్ (ఎఫ్ఎసి) –  ఎమ్ వి వి .  సత్యనారాయణ

ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ –  కె.రాజబాపయ్య

ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ ఆపరేషన్ –  బి.రమేష్ ప్రసాద్

ఎపిఇపిడిసిఎల్  డైరెక్టర్ ఫైనాన్స్ & హెచ్‌ఆర్‌డిఐ –  డి.చంద్రమ్

ఎపిసిపిడిసిఎల్ డైరెక్టర్ టెక్నికల్ –  కె. సంతోష్ రావు

ఎపిసిపిడిసిఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ (ఎఫ్ఎసి) –   వి.వి.గోపాల కృష్ణ మూర్తి

ఎపిఎస్పిడిసిఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ –  కె. కళాధర్  రావు

ఎపిఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ – వి.ఎన్. బాబు