బృహస్పతి

380

సురూప ఆంగీరసులకు “బృహస్పతి” సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి నాడు జన్మించెను.ఇతని భార్య “తారాదేవి”  బృహస్పతి దేవతలకు గురువుని కావున ఇతడిని “గురుడు” అంటారు.
గురుడు : దేశ త్యాగం , విత్తం లాభం అనర్ధం ధన నాశనం
సంపద , క్లేశం , ఆరోగ్యం , ధన హానిం ,ధనాగమం
పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః
తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము 3 కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు. బృహస్పతి హిందూ మతంలో ఒక దేవుడు. వేదములు మరియు 64 కళలలో దిట్ట. ఎన్నో త్యాగాలకొనర్చి దేవతల యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అసురుల యజ్ఞయాగాదులకు విఘ్నాలను ఏర్పరుస్తూ, దేవతలకు శిక్షణ, రక్షణ ని అందిస్తూ, వారిని పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవతలకు బృహస్పతి గురువు మరియు పురోహితుడు. గురువారం (లక్ష్మీవారం) బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడినది. మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురు గ్రహం) ఒకడుకొన్ని వేదము ఋక్కులలో బృహస్పతి అగ్ని అని భావించారు. ఇతడు యజమానులకు పురోధ (పౌరోహితుడు). దేవతలకు గురువు.ఋషి.సప్తఋషులలో ఒకడుగు అంగిరునకు బ్రహ్మతేజో రూపముగా బృహస్పతి పుట్టెనని పరాశరుడు చెప్పెను. బృహస్పతి అంగిరునకు శుభ కడుపున పుట్టెను. ఇతనికి తేజస్సు అధ్యయన సంపద ప్రతిభావిశేషము మంత్రశక్తియు అత్యధికము కావున ఇతనికి బృహస్పతి అని పేరు వచ్చెను అని మహా భారతము చెప్పు చున్నది.

అతి పురాతన కాలమునకే గురుడు ఉనికిని తెలియుననుటకు తార్కాణంగా పరాశరుడితనిని బ్రహ్మ మానసపుత్రుడని వచించెను. ఇతడు తిష్యలో పుట్టెనని తైత్తిరీయబ్రాహ్మణము. సూర్యుడును, చంద్రుడును, బృహస్పతియు ఏకకాలములో (కర్క) పుష్యమిలో సమ్మిళితురగురని అపుడు సత్యయుగ మావిర్భవించునని విష్ణు పురాణము చెప్పెను గురుడు జీవుడని ఒక పేరుకలదు. ఋగ్వేదము న ఇతడు పుష్టివర్ధకుడు. ఓషధులకు జనకుడు. గురుడు దేవాసుర సంగ్రామమున చనిపోయి దేవతలకు దివ్యౌషధములు ఇచ్చి బ్రతికించుచుండువాడు కావున జీవుడని పేరు వచ్చెను. ఇతడు ఫల్గునిలో పుట్టెనని వాయు పురాణము చెప్పెను. కావున ఇతడు ఫల్గునీభవుడు. గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు.
 గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము. స్వక్షేత్రము :- ధనసు మీనము. ఉచ్ఛ క్షేత్రము :- కర్కాటకము. శత్రుక్షేత్రము :- మిధునము, కన్య,
మిత్రక్షేత్రము :- మేషము, వృషభము, సింహము. సమక్క్షేత్రము :- వృషభము, తుల. నీచక్షేత్రము :- మకరము. మూలత్రికోణ క్షేత్రము :- ధనసు. గోచార రీత్యా శుభస్థానాలు :- 2,5,7,9,11. గోచారరీత్యా అశుభస్థానములు:-1,3,4,6,8,12.
                                                                  –  చింతా గోపీ శర్మ సిద్ధాంతి
                                       లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం) 
                                                        పెద్దాపురం, సెల్:- 9866193557