వివాహ వేడుక..లోపాలు

ఒకప్పుడు వివాహ వ్యవస్థకు బోలెడన్ని సంప్రదాయ పద్ధతులుండేవి. కానీ ఇప్పుడు అంతా రొటీన్. ఏవి చేయకూడదో అవి చేస్తున్నారు. ఏది చేయాలో అది పాటించడం లేదు. ఈ ఆధునిక వివాహ వ్యవస్థలో అమలవుతున్న పద్ధతులను,  పదేళ్లుగా పరిశీలిస్తున్న ఓ పండితుల బృందం.. వాటి లోపాలు ఎత్తిచూపింది. ఆ ప్రకారంగా..

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. –
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం…!

4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు…!

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!

6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి….

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami