ABVP జాతీయ కార్యవర్గంలో నల్సార్ న్యాయ విద్యార్థి సాదినేని రాజశేఖర్ కి చోటు

0
18

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గం ఎన్నిక జాతీయ మహాసభలలో జాతీయ అధ్యక్షులు ఛంగన్ భాయ్ పటేల్ ప్రకటించారు. 2020-21 కార్యవర్గంలో తెలంగాణ లోని జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామానికి చెందిన సాదినేని రాజశేఖర్ ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా ప్రకటించారు. రాజశేఖర్ హైదరాబాద్ లోని నల్సార్ లో LL.M చదువుతున్నారు, రాజశేఖర్ గతంలో జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ గా, తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యాలయ కార్యదర్శి,  జగిత్యాలలో SKNR డిగ్రీ చదువుతున్న సమయం నుండి చురుకైన కార్యకర్త.

సైద్ధాంతిక విషయాలపైన, విద్యార్థుల సమస్యల పట్ల అనేక వ్యాసాలు రాస్తూ, ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారు. తెలంగాణలోని జాతీయ సంస్థలలో పనిని పెంచటం మరియు సోషల్ మీడియా వేదికగా సంస్థ పనిని పెంచటంలో కీలక పాత్ర పోషించారు. ఇది గుర్తించిన జాతీయ నాయకత్వం ఆయనకి కీలక బాధ్యతలను అప్పగించారు. రాజశేఖర్ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ కార్యవర్గ సభ్యులు గా తన బాధ్యతను నిర్వహిస్తారు.