స్వదేశీ కంపెనీలపై విదేశీ కంపెనీల కుట్ర?

469

విదేశీ కంపెనీ పెప్సికో 30 ఏళ్ళ నుండి పంజాబ్ రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నా వారు ఎప్పుడూ ఆ విదేశీ కంపెనీ ప్యాక్టరీలు మీద దాడి చెయ్యలేదు.

ఇప్పుడు రిలయన్స్ కి వ్యవసాయ పరిశ్రమతో అస్సలు సంబంధం లేదు. మరి రేపు రాబోయే వ్యవసాయ బిల్లులు వల్ల రిలయన్స్ వంటి సంస్థలు బాగుపడతాయి అనే అపనమ్మకం ఉంటే ఆ రాష్ట్ర రైతులు గతంలో పెప్సీ పరిశ్రమని ఎందుకు అనుమతించారు?

ఒక విదేశీ పరిశ్రమ కంటే దేశీయ పరిశ్రమ ప్రమాదకరమైనదా?

మరి రిలయన్స్ జియో టవర్ల మీద పంజాబ్ లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న ముఖ్య రాజకీయ శక్తులు ఏవి? ఆప్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్.
వీరిని వెనుక ఉండి రెచ్చగొడుతున్న శక్తులు ఏవి? వాటికి అవసరం ఏమిటి?

ఇక్కడే ఉంది అసలు కథ.
ప్రపంచంలో 5G టెక్నాలజీకి చైనా హువాయి పేరు.
మన దేశంలో కూడా ఈ కంపెనీ కాలుమోపడానికి ప్రయత్నిస్తోంది.

రిలయన్స్ జియో క్వాల్ కం కంపనితో కలసి 5G ట్రయల్స్ చేస్తోంది. ఇప్పటికే సుమారు 1GB స్పీడ్ సాధించామని చెప్పారు. ట్రైల్స్ చివరి దశలో ఉన్నాయి. ఇందువల్లే గూగుల్ వంటి కంపెనీలు, సౌదీ వంటి దేశాలు లక్ష కోట్ల రూపాయలకు పైగా జియోలో పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడుల వల్లే విదేశీ మదుపరుల్లో రిలయన్స్ మీద నమ్మకం బాగా పెరిగి అమాంతం షేర్ వాల్యూ పెరుగుతూ వస్తోంది.

అంటే ఒకవేళ రిలయన్స్ జియో అనుకున్న టైం కి 5G ట్రైల్స్ పూర్తి చేసి దేశంలో 5G నెట్ వర్క్ ప్రవేశపెడితే  చైనా దేశ కంపనీ హువాయికి గట్టి పోటీగా ఎదుగుతుంది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా టెలి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మరియు ఆ కంపెనీలపై విదేశాల ప్రభుత్వ సమాచారం మరియు ఆ దేశాల పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తమ రహస్య టెక్నాలజీ ఉపయోగించి చోరీ చేస్తూ చైనా దేశానికి చేరవేస్తున్నాయి అని కూడా ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే చాలా దేశాలు ఈ చైనా కంపెనీ హువాయ్ కి తమ దేశంలో 5G నెట్ వర్క్ ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడానికి
తటపటాయిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో కానీ రిలయన్స్ జియో 5G ట్రయిల్స్ పూర్తి చేసి మన దేశంలో సేవలు ప్రారంభిస్తే మన దేశ 5G వ్యాపారం చైనా కంపెనీకి దక్కకపోవడమే గాక  చైనా టెలికాం కంపెనీల మీద ఉన్న అపనమ్మకంతో చాలా దేశాలు రిలయన్స్ ని తమ దేశంలో 5G నెట్ వర్క్ ప్రారంభించమని కోరవచ్చు. అదే జరిగితే(భవిష్యత్ లో జరగబోయేది అదే రిలయన్స్ 5G ప్రపంచాన్ని ఏలుతుంది) చైనా టెలికాం రంగానికి కోలుకోని దెబ్బపడుతుంది.

ఇప్పుడు అర్ధమయిందా రైతులు ఆందోళనలు ముందు పెట్టి వెనుక రిలయన్స్ ని అపఖ్యాతి చేసే కుట్ర. ఇప్పటికే పంజాబ్ లో 1450 టెలికాం టవర్స్ ధ్వంసం చేశారు. దానిలో 1000 కి పైగా జియో టవర్స్ ఉన్నాయట. వీడియో చూడండి టెలికాం టవర్ ధ్వంసం చేసి ఖరీదైన జనరేటర్ దోచుకుపోతున్నారు. లక్షల మందికి ఫ్రీగా భోజనాలు పెట్టే సంస్కృతి గల పంజాబీయులు ఇలా దోపిడీకి పాలుపడుతున్నారు అంటే నమ్మగలమా?
అసలు పంజాబ్ లో పోలీస్ వ్యవస్థ ఉందా?
కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలా మౌనం వహిస్తోందా?

చాడా శాస్త్రి.