డిప్యూటీ స్పీకర్ కోన దూకుడు

– జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడని ప్రజలు
– అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రతిపక్షాల వ్యాఖ్యలు, కుట్రలు
– సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై వివరణ
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు తగిన విధంగా మాట్లాడకపోవడంపై ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ప్రసంగాలు మనం గమనించినట్లయితే సుమారు పది మందిలో ఎనిమిది మందికి లబ్ధి జరిగి, ఇద్దరికీ జరగకపోతే ఇద్దరి గొంతు 8మంది కంటే ఎక్కువగా వినపడుతుంది అని,ఎనిమిది మంది మౌనంగా ఉండటం పై ఆంధ్ర రాష్ట్ర ఉప సభాపతి కోన రఘుపతి ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం, అంతేకాకుండా బాపట్ల నియోజకవర్గం లో మునుపెన్నడూ జరగని అంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉండటం పై కనీసం జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గమనించినట్లయితే జిల్లా ప్రకటన రాకముందే బాపట్ల కు కావలసినటువంటి సకల హంగులను ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని వక్రీకరిస్తూ ఫోటోలు తీయడం, ఇక్కడ ఏదో జరిగిపోయినట్టుగా బయటకి చిత్రీకరించే ప్రచారం చేయడంపై కూడా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దూకుడు పెంచారు. ఆయన ప్రసంగాల్లో వాడి పెరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్న జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరనే సంకేతాన్ని సదరు వ్యక్తులకు ఇస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు పై కూడా ప్రజలు బహిరంగంగా మాట్లాడుకోవాలని,ఎవరికైతే పథకాలు అందలేదో వారికి ఏ కారణం చేత అందటం లేదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రసంగాల్లో వివరిస్తున్నారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా ఉపసభాపతి కోన రఘుపతి ని పరిశీలిస్తున్న నాయకులు మాత్రం గతంలో ఆయన ఇంత దూకుడుగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని, ఆయన మాట్లాడుతున్నవి అన్ని నిజాలని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.