ప్రధాని సూచనను విశ్వవిద్యాలయాలు తక్షణమే అమలు చేయాలి

-చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ వినతి.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని మా సర్వం త్యాగం చేసిన విస్మృత స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను వెలికి తీయడంలో అలీఘర్ విశ్వవిద్యాలయం దృష్టి సారించాలని మన ప్రధాన మాతృ నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఆనందదాయకమని చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహమ్మెద్ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయమ శతాబ్ది ఉత్సవాల సందర్భగా ప్రధాన మంత్రి విశ్వ విద్యాలయాన్ని సందర్శించటమే కాక ఉత్తేజపూరిత ప్రసంగం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు . ఈ సందర్భగా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగిస్తూ భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న సమరయోధుల చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి విశ్వవిద్యాలం కృషి చేయాలనీ ప్రధాని సూచింజటాన్ని ఆయన స్వాగతించారు. ఒక్క అలీఘర్ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈ విష్యం మీద ద్రుష్టి సారించాలని నసీర్ అహమ్మద్ కోరారు. మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్న త్యాగధనుల చరిత్రలను వెలికి తీయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ముస్లింల చరిత్రలు చాలావరకు కనుమరుగయ్యాయలర్ చరిత్రకారుడు నసీర్ అన్నారు.

ఈ అంశం మీద తానూ గత 22 ఏండ్లుగా బహుముఖ ప్రయత్నాలు చేస్తున్నానాని. భారత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ, స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబీకులకు, మిత్రులను కలసి సమాచారాన్ని రాబట్టి ఇప్పటి వరకు పధ్ధెనిమిది చరిత్ర పుస్తకాలను ప్రచురించారని నశీర్ వెల్లడించారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నందున ఆనాడు బ్రిటిష్ ప్రభుతావనికి వ్యతిరేకంగా ఉద్యమించి ధన-మన-ప్రాణాలను కోల్పోయిన సమరయోధులు సజీవంగా ఉండే అవకాశాలు లేనప్పటికీ వారి కుటుంబీకుల నుండి, అలనాటి గ్రంధాల నుండి, ప్రభుత్వ దస్త్రాల నుండి విశేషవంశాను రాబట్ట వచ్చని నసీర్ అభిప్రాయ పడ్డారు. మన దేశంలోని అతి పురాతన విశ్వవిద్యాలయాల లోని గ్రంథాలయాలలో అపూర్వ గ్రంధాల నుండి దస్త్రాల నుండి ఈ సమాచారారం రాబట్టటం విశ్వవిద్యాలయాలకు సులువని నశీర్ అన్నారు. ప్రధాన మంత్రి సూచనా మేరకు దేశంలోని విశ్వవిద్యాలయాలన్ని క్రియాశీలకంగా స్పందిస్తూ ముందుకు సాగినట్లయితే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న పలువులు సమరయోధుల వివరాలు ప్రపంచానికి వెల్లడి చేయవచ్చని నసీర్ అభిప్రాయపడుతూ విశ్వవిద్యాలయాల అధికారులు ప్రధాని నరేంద్ర మోడీ సూచనను అమలులు పెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami