పోలీసులు ప్రాణాలొడ్డి పని చేశారు:డీజీపీ

146

అమరావతి: 2020లో పోలీసులు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాణాలొడ్డి పని చేశారని తెలిపారు. జాతీయ స్ధాయిలో ఏపీ పోలీస్ యాప్‌కు బంగారు పతకం వచ్చిందన్నారు. బుధవారం ఆయన పోలీసు శాఖ వార్షిక నివేదిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరితంగా స్పందించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. పోలీసులు కోవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌లో ఉండి ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 వేల మంది ఏపీ పోలీసులు మహమ్మారి బారిన పడగా, 109 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు.

పోలీసు శాఖకు ఎన్నో అవార్డులు
‘పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రధాన లక్ష్యం. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండేలా పోలీసింగ్ తీసుకొచ్చాం. పోలీసులు, ఏపీ ప్రభుత్వం నిబద్ధత కారణంగా మాకు అవార్డులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకతతో పని చేస్తాం. ఇసుక, మద్యం పాలసీల నేపథ్యంలో స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశాం. గత ఏడు నెలల్లో మద్యం అక్రమ రవాణాపై ఎస్ఈబీ ద్వారా 69,688 కేసులు నమోదవగా మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీలో నమోదు చేశారు’ అని డీజీపీ తెలిపారు.

వారం రోజుల్లోనే 16 వేల మందిని రక్షించాం
‘మహిళా భద్రతకు సంధించిన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టాం. దిశ పోలీసు స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొబైల్స్ ఇచ్చాము. దిశకు అనుబంధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. దిశ చట్టం వస్తే ఈ విధానం మొత్తం అత్యంత బలోపేతం అవుతుంది. దిశ యాప్ ఉన్న ఫోన్లు మూడు సార్లు షేక్ చేస్తే సమాచారం పోలీసులకు వెళుతుంది. ఏడు రోజుల్లో కేసుల విచారణ పూర్తవ్వాలి అనేది దిశ ఉద్దేశం. మహిళా భద్రతలో భాగంగా మహిళా మిత్ర అనేది ప్రారంభించాం. 25,298 మంది చిన్నపిల్లలను ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సంరక్షించాము. 16,257 మంది పిల్లలను ఒక వారం రోజుల్లోనే సంరక్షించాం. స్పందన ప్రోగ్రామ్‌లో 21,827 కేసులు FIR చేశాం. జిల్లా ఎస్పీ, కమిషనర్, డీజీపీ కార్యాలయం, సీఎం కార్యాలయం వరకూ స్పందన వివరాలు చేరతాయి’ అని డీజీపీ పేర్కొన్నారు.

స్పందన ద్వారా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
‘52% మహిళలు స్పందన ద్వారా ఫిర్యాదులు చేశారు. రూల్ ఆఫ్ లా అనేది స్పందన ద్వారా సాధ్యం అయింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా 87 పోలీసు సేవలు నేరుగా ప్రజలకు ఇంటి వద్దనే అందుతాయి. ఎఫ్ఐఆర్ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కోసం‌ లంచం అడిగిన 6 కేసుల్లో పోలీసులను ఎసీబీ ట్రాప్‌లో పట్టుకున్నాం. ఈ రోజు వరకు 114581 ఎఫ్ఐఆర్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్‌ను సిటిజన్ సేవ యాప్‌గా కూడా చెప్పవచ్చు. 5234 మిస్సింగ్ కేసులు పోలీసు సేవా యాప్‌లో సెర్చ్ చేశారు. 4876 గుర్తెరుగని మృతదేహాల విషయంలో‌ సెర్చ్ జరిగింది. 7654 అరెస్టుల సెర్చ్ జరిగింది. సెకండ్ హ్యండ్ వెహికల్ మీద ఉన్న కేసుల విషయంలో 28,252 సెర్చ్‌లు జరిగాయి’ అని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు

2020 లో పోలీసులు ఎదుర్కొన్న ఛాలెంజ్ లు చాలా ఉన్నాయు
కోవిడ్ – 19 నేపథ్యంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం ఏపి ప్రభుత్వం కోవిడ్ కాలంలో చాలా త్వరితంగా స్పందించింది.ఏపీలో అన్ని డిపార్ట్మెంట్ లు కోవిడ్ లో చాలా బాగా పనిచేసాయి.పోలీసులు కోవిడ్ ఫ్రంట్ లైన్ లో ఉండి ఎదుర్కొన్నారు పోలీసులు క్షేత్రస్థాయిలో కోవిడ్ ను ఎదుర్కొన్నారు. రోడ్లపై ఉంటూ పోలీసులు నేరుగా కోవిడ్ కు ఎదురు నిలబడ్డారు 14వేల మంది ఏపీ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు.

“109 మంది పోలీసులను కోవిడ్ కారణంగా కోల్పోయాం. కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నాం.సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో కోవిడ్ ను విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఏపీ ప్రజలు కూడా కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.. పోలీసు డిపార్ట్మెంట్ లో ఒక మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రధాన లక్ష్యం. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండేలా పోలీసింగ్ తీసుకొచ్చాం. పోలీసులలో పారదర్శకత, బాధ్యత, అత్యంత భద్రత వచ్చేలా కృషి చేసాం. పోలీసులు, ఏపీ ప్రభుత్వం కమిట్మెంట్  కారణంగా మాకు అవార్డులు వచ్చాయి. న్యాయానికి అందరు అమానమే. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకతతో పని చేస్తాం. ఇసుక, మద్యం పాలసీల నేపధ్యంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేసాం. గత ఏడు నెలల్లో గుర్తించ దగిన 69,688 కేసులు మద్యం అక్రమ రవాణాలో ఎస్ఈబీ ద్వారా నమోదయ్యాయి. మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీ లో నమోదు చేసారు. 102 ప్రభుత్వ అధికారులు ఈ కేసుల్లో ఉన్నారు. వారిలో 72 మంది పోలీసులు ఉన్నారు. వారిపై చర్యలు కూడా తీసుకున్నాం. మహిళా భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టాం. దిశ యాక్టుకు అనుబంధంగా పాటుగా మరిన్ని ఇతర కార్యక్రమాలు కూడా చేసాము. దిశ పోలీసు స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచాం.

త్వరితగతిన ఒక కేసు నమోదు చేసి, పూర్తి చర్యలు జరిగేలా దిశ పోలీసు స్టేషన్లలో ఏర్పాట్లు చేసాం.దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొబైల్స్ కూడా ఇచ్చాం. ఫోరెన్సిక్ అనేది చాలా ముఖ్యమైనది దిశకు అనుబంధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేసాం. దిశ అనేది ఒక కోర్సు లాగా కూడా ఇస్తున్నాం. దిశ యాక్టు వస్తే ఈ విధానం మొత్తం అత్యంత బలోపేతం అవుతుంది. దిశ యాప్ ఉన్న ఫోన్ లు మూడు సార్లు షేక్ చేస్తే సమాచారం పోలీసులకు వెళుతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టం అనేదానికి ఒక టైమ్ లైన్ ఉండేలా దిశ అనేది పని చేస్తుంది. న్యాయం త్వరితగతిన అందాలని దిశ యాక్టు వచ్చింది. ఏడు రోజుల్లో కేసుల విచారణ పూర్తవ్వాలి అనేది దిశ ఉద్దేశం.396 కేసులు దిశలో ఛార్జ్ షీటు చేసాం. దిశ అనేది మిగిలిన రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా ఉంది.మహారాష్ట్ర నుంచీ కూడా ఒక టీం వచ్చి దిశ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్నారు.”  అని డీజీపీ పేర్కొన్నారు