మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు:సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్,ఐపిఎస్

548

ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి: సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్

ఆల్ ఇండియా రేడియో, ఎఫ్  ఎమ్ రెయిన్బో లైవ్ ఇన్ లో పాల్గొన్న  సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్

లైవ్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన

రోడ్డు ప్రమాదల నివారణకు గాను ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ .,  డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్  ఈరోజు ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ ఎమ్ రెయిన్బో లైవ్ ఇన్ లో ‘’Stay Alive- Think & Drive’’, Wait for the Red.. Do not end up dead అనే ట్యాగ్ లైన్ తో నిర్వహించిన లైవ్ ఇన్ ప్రోగ్రామ్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్నచర్యలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నారు.

1)ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లు ఎక్కువగా జరగడానికి కారణలేమిటి? ఎక్కువగా ఏ టైమ్ లో జరుగుతున్నాయి?

సీపీ  : రోడ్డు ప్రమాదాలకు సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 వరకు ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రంకెన్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున కూడా నిద్రలేమి, అర్జెంట్ గా వెళ్లాలనే కారణంగా డివైడర్లకు, చెట్లకు వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

2)గత వారం గచ్చిబౌలి లోని ఫైనాన్షియల్ జిల్లా విప్రో జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదం లో ఐదుగురు యువకులు ప్రయానిస్తున్న కారు రెడ్ లైట్ పడినప్పటికీ వేగంగా ముందుకు వెళ్లడంతో అటుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది.  ఈ ప్రమాదంలో ఆ యువకులు చనిపోయారు. దీన్ని ఎలా చూస్తారు మీరు?

సీపీ  : ఇంటి నుంచి బయట కు వెళ్లిన తర్వాత సురక్షితంగా తిరిగి రావాల్సిన బాధ్యత మీదే. మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచమని యువత గుర్తించాలి. ఫైనాన్షియల్ జిల్లా విప్రో జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లైతే రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ముందుకు వెళ్లడం తప్పిదం. పగలైనా, రాత్రైనా, రెక్లెస్ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం తప్పు. వాహనం నడుపుతున్న ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, ఓపిక ను పెంచుకోవాలి. ఇటీవల రోడ్లు బాగుండడంతో యువత జాయ్ రైడ్స్ కు వస్తున్నారు. ఇది సరి కాదన్నారు.

డిసిపి ట్రాఫిక్ : ఐదుగురు యువకులు ఒకసారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇది సమాజానికి వారి కుటుంబానికి తీరని విషాదం. మరోవైపు రోడ్డు మీద ప్రయాణించే ఇతర ప్రయాణీకులను కూడా ఇది భయాందోళనకు గురి చేస్తుంది.  సాయంత్రం 6 గంటల నుంచి మధ్య రాత్రి 12 గంటల వరకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడే కచ్చితమైన కారణాలను తెలుసుకోగలుగుతాము. 2019, 2020 సంవత్సరాలకు గాను సైబరాబాద్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేశిస్తే ఓవర్ స్పీడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, వాహనాన్ని నడపదానికి సరైన నైపుణ్యత లేని వారు నడపడం వల్ల అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

3)చిన్న పిల్లలు వాహనాలు నడిపితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వారి తల్లిదండ్రులను బాధ్యులను చేస్తున్నారా?

చిన్న పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నాం. మైనర్లకు వాహనాలు  ఇస్తే నడిపిన వారిపై, ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాము.

ఎలాంటి వాహనాలు ఎక్కువగా ప్రమాదలకు గురవుతున్నాయి? ద్విచక్ర వాహనాలా ? ఫోర్ వీలర్సా ?

డిసిపి ట్రాఫిక్ : ప్రతీ సంవత్సరం దాదాపు 55 శాతం ద్విచక్ర వాహనాల ప్రమాదాలు fatal accidents/ మారనాంతిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.

4)వాట్సాప్ గ్రూప్ ల ద్వారా పోలీసుల తనిఖీలు తప్పించుకుంటున్నవారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి.. ?

డిసిపి ట్రాఫిక్ : ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవింగ్ చెకింగ్స్ చేసేది మీకోసమేనని గుర్తించాలి. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు గానీ ప్రమాదాల నుంచి కాదని గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ల పై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ల పై సమాచారమిస్తే కేసులు నమోదు చేస్తాం.

5)రోడ్ సేఫ్టీ దృష్ట్యా టీనేజర్లు ఎక్కువ సీసీ వాహనాలు నడుపుతున్నారు? ఇది ఎంత వరకు శ్రేయస్కరం?

సీపీ : ప్రజలల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు అప్పు చేసి మరీ పిల్లలకు ఎక్కువ సీసీ వాహనాలు కొనిస్తున్నారు. అయితే టీనేజ్ యువత ఆయా వాహనాలను కంట్రోల్ చేయలేక కొన్నిసార్లు మృత్యువాతపడుతున్నారు. ఇది సరి కాదు.

6)డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సీపీ  : రోడ్డు భద్రత పై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటోంది. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం.  జైల్ కి కూడా వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కంపెనీస్ కి లెటర్లు రాస్తున్నాం. తాగి వాహనాన్ని నడపడం రోడ్ టెర్రరిజం లాంటిది. తాగి బండి నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా వాహనాన్ని నడపడం శిక్షార్హం. పదేళ్ళ వరకు శిక్ష పడుతుంది. Under section 304 part II of IPC (Culpable homicide not amounting to murder) for which the punishment involves imprisonment upto 10 years.

డిసిపి ట్రాఫిక్ : డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వారి వివరాలు ఆర్టీఓ కి పంపిస్తున్నాం. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మళ్లీ మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా తాగి వాహనాలు నడపవద్దు.

7)ఓవర్ స్పీడింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డిసిపి ట్రాఫిక్ : రోడ్ ఇంజనీరింగ్ శాఖ నిర్ణయించిన మేరకు ప్రతీ రోడ్డు కు ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. అది సూచిక బోర్డులపై పై రాసి ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, నాగ్ పూర్ ఎన్ హెచ్-44, చేవెళ్ల, బీజాపూర్ అన్ని రోడ్ల మీద ఓవర్ స్పీడింగ్ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడింగ్ ఎక్కువగా ఉండే చోట్లలో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు స్పీడ్ లేజర్ గన్, సిసిటివి సాయంతో స్పీడ్ గా వెళ్లే వాహనాలను గుర్తించి ఓవర్ స్పీడింగ్ కేస్ ఈ చలాన్ నమోదు చేసి అట్టి వారికి నోటీస్ పంపిస్తున్నాం. తద్వారా ఓఆర్ఆర్ పై చాలా వరకు ప్రమాదాలు తగ్గాయి.

8)బైక్ నడపాలనుకునే వారి వయసు ఎంత ఉండాలి?

 డిసిపి ట్రాఫిక్ :  ముందుగా వాహనం నడపాలనుకునే వారికి లైసెన్స్ ఉండాలి. ద్విచక్ర వాహనాలు రెండు రకాలు. బైక్ 50 సిసి కంటే తక్కువ కెపాసిటీ ఉండే వాహనాలు వెహికిల్ విత్ అవుట్ గేర్ వాహనాలు నడపాలంటే 16 ఏళ్లు నిండి ఉండాలి. ఆర్టీఓలో అప్లికేషన్ తీసుకుంటే లర్నర్స్ లైసెన్స్ ఇస్తారు. బండి నేర్చుకొని ఆర్టీఓ లో పరీక్ష పాస్ అయిన వారికి  లైసెన్స్ ఇస్తారు. 50 సిసిల కంటే ఎక్కువ ఉంటే సిసి ఉండే వాహనాలు అంటే వెహికిల్ విత్ గేర్ నడపాలంటే 18 ఏళ్లు వయసు నిండి ఉండాలి. ఆర్టీఓ లో అప్లికేషన్ తీసుకుంటే లర్నర్స్ లైసెన్స్ ఇస్తారు. బండి నేర్చుకొని ఆర్టీఓ లో పరీక్ష పాస్ అయిన వారికి లైసెన్స్ ఇస్తారు.  లర్నర్స్ లైసెన్స్ తీసుకున్న వారు ‘L’ బోర్డును ఏర్పాటు చేసుకోవాలి. వాహనం వచ్చిన వారు వారితో పాటు ఉండాలి. ఈ రెండు నిబంధనలు అతిక్రమిస్తే వాహనాన్ని జప్తు చేస్తాం.

9)రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేసే వారికీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?

సీపీ : రోడ్డు ప్రమాదలకు గురైన వారికి సాయం చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దగ్గర్లో ఉన్న ఆసుపత్రులలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇవ్వండి. రోడ్ సేఫ్టీ కో-ఆర్డినేటర్స్ ను ఏర్పాటు చేశాము. వీరు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి సాయం చేస్తారు.

డిసిపి ట్రాఫిక్ : ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే తగు సాయం అందిస్తే వారు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో క్షతఘాత్రులను కాపాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సుప్రీం కోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం యాక్సిడెంట్ ల విషయంలో సాయం చేసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సాక్షిగా పరిగణిస్తారు. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రోడ్డు ప్రమాదాల బాధితులకు దయ చేసి సాయం చేయండి.