ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ

408

హైదరాబాదులోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ  జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, గౌరవ అతిధిగా ఎమ్మెల్సీ  బసవరాజు సారయ్య, విశిష్ట అతిథిగా చిలుకూరు బాలాజీ మందిర్ ప్రధాన అర్చకులు మరియు ముని వాహన సేవ నిర్వాహకులు  సి. ఎస్. రంగరాజన్, ప్రత్యేక ఆహ్వానితులుగా అఖిల భారత సామాజిక సమరసత వేదిక సంయోజకులు

కె. శ్యామ్ ప్రసాద్ జి, మహారాష్ట్ర సంత్ గాడ్గే బాబా అమరావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ Dr. మురళీధర్ చండెకర్, తెలంగాణ ప్రాంత సంఘ్ సంచాలకులు B.దక్షిణమూర్తి, అఖిల భారత ఎస్. సి. రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు అతిథిగా కర్నె శ్రీశైలం, విముక్త సంచారజాతుల అభివృద్ధి మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  పీటల స్వర్ణ కుమార్, సామాజిక సమరసత వేదిక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Dr. వంశ తిలక్, సమరసత వేదిక, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రంలో  బసవరాజు సారయ్య గారు సంత్ గాడ్గేబాబా విగ్రహం ఆవిష్కరణ చేశారు. డా. ఆశావాది ప్రకాశరావు వ్రాసిన సంత్ రవిదాస్ బోధనల పద్య పుస్తకం మరియు సంత్ గాడ్గే బాబా పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.

ముఖ్య అతిథి  చెన్నమనేని విద్యాసాగర్  తన ప్రసగంలో సంత్ గాడ్గే బాబా విశిష్టతను వివరిస్తూ, వారి జీవన కాలంలో స్వచ్ఛత కోసం చేసిన కృషి వివరించారు. సంత్ గాడ్గే బాబా ఎప్పుడూ చేతిలో చీపురు , నెత్తిన అన్నం తినే చిప్పతో సంచరించేవారు. గ్రామంలో వీధి, వీధి తిరుగుతూ శుభ్రంచేస్తూ, ప్రజలను చైతన్యపరిచేవారు. తన జీవితకాలంలో 60కి పైగా విద్యాసంస్థలు, ఆశ్రమాలు స్థాపించినారు.

పేద, దళిత, అట్టడుగు వర్గాలను ఉద్ధరించడం విద్య ద్వారానే సాధ్యమని నమ్మి 31 పాఠశాలలు,15 వసతి గృహాలు, బాలికల పాఠశాలలు, గోశాలలు, ధర్మసత్రాలు, ఇలా 60 కి పైగా నెలకొల్పి సేవారంగంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన మహనీయులు సంత్ గాడ్గెబాబా అని వారన్నారు.

‘అజ్ఞానంలో కూరుకుపోయిన ప్రజలను మేల్కొల్పి, సుఖ సంతోషాలకు మూలమైన భక్తి, సేవా మార్గాలను చూపించిన మార్గదర్శి సంత్ గాడ్గే బాబా’ అని వక్తలు అన్నారు. విశ్వమంతా నాదే అని వసుధైక కుటుంబ తత్త్వాన్ని ప్రకటించిన మహాత్ములు, నిరంతర సంస్కరణ శీలి సంత్ గాడ్గే బాబా సామరస్య భావనలు తన భజనలు, పాటల ద్వారా సమాజానికి చేరవేశారు.

మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య మాట్లాడుతూ గాడ్గే బాబా విగ్రహావిష్కరణ చేయడం తన అదృష్టం అన్నారు.గాడ్గే బాబా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సంత్ గాడ్గే బాబా పైన పరిశోధన చేసి పత్రం సమర్పించిన విద్యార్థులకు నగదు పారితోషికం ఇస్తానని మాజీ మంత్రివర్యులు సాగర్‌జి ప్రకటించారు.

సంత్ గాడ్గే బాబా గురించి వివరిస్తూ చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రదాన అర్చకులు సంత్ రవిదాస్ బోధనల అర్ధాన్ని వివరించారు.

గాడ్గే బాబా పైన ఒక లఘు చిత్రాన్ని (తిరుమల స్వామి, గోపాలకృష్ణ, మదన్ గుప్త కలిసి రూపొందించినది) ప్రదర్శించారు. ఆ వీడియోను పెద్దలు ఆవిష్కరించారు. గాడ్గే బాబా పైన వ్రాసిన కవితల పోటిలలో గెలుపొందిన విజేతలకు బహుమతి అందించారు. ప్రపంచంలోని ఎవరెస్టు తోపాటు 5 పర్వతాలు అధిరోహించిన యువ పర్వతారోహకులు తుకారాంని విద్యాసాగర్ రావు సత్కరించారు.

-vskandhra.org