నిజా నిజాలు ఓసారి వాస్తవ దృష్టితో పరిశీలిద్దాం…

247

కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, ప్రజలను దోచుకుంటాయి అని మనలను బెదరగొట్టే కమ్యూనిస్టుల మాటలవెనుక ఉన్న నిజా నిజాలు ఓసారి వాస్తవ దృష్టితో పరిశీలిద్దాం.
ఎయిర్ ఇండియా ఒక్కటే  ఉన్నంత వరకు విమానప్రయాణం అన్నది ధనవంతులకు మాత్రమే సాధ్యం  అయ్యేది. తరువాత ప్రైవేట్  ఎయిర్ లైన్స్ రావడంతో సామాన్యులు సైతం విమానం ఎక్కగలిగే స్థితి ఏర్పడింది.

హైదరాబాద్ నుండి గుంటూరుకి ఫోన్ లో మాట్లాడాలంటే నిమిషానికి 40 రూపాయలు కాల్ ఛార్జ్ అయ్యేది. తరువాత రిలయన్స్  పుణ్యమాఅని నిముషానికి 40 పైసలు కాల్ ఛార్జ్ కి వచ్చింది. అదికాస్తా ఇప్పుడు 4 పైసలకు దిగిపోయింది. మరి ఇదంతా ఎవరివల్ల సాధ్యం అయింది. కార్పొరేట్ ల వల్ల కాదా?ఇంతకు మునుపు ఇంటర్నెట్ వాడకం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. 250  రూపాయలకు 1 GB డేటా ఇంటర్నెట్ కొనుక్కొని జాగ్రత్తగా వాడుకొనే పరిస్థితి నుండి రూ 2 .50  పై కు 1 GB డేటా ను పొందే సౌలభ్యాన్ని పోదాము. ఇవ్వాళ అతిసామాన్యుడు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు అంటే  దానికి కారణం ఆ కార్పొరేట్లే కదా… మన అందరికీ ఉపయోగకరంగానే ఉంది కదా..

హెరిటేజీ & భారతి సిమెంట్ లాంటివి మన రాష్ట్ర ముఖ్య నాయకుల సమర్ధతకి చిహ్నమైన కార్పొరేట్ లు కావా? ఇవాళ చైనాలో మనదేశంలో కన్నా ఎంతో పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. అసలు ఇప్పుడు అక్కడ ఉన్నది నిజమైన కమ్యూనిజమేనా? అక్కడ(చైనా) ప్రజలకి వారి ప్రభుత్వం మీద ఏదైనా అసంతృప్తి ఉంటే, ఇక్కడి(ఇండియాలో) వలే (ఓటు ద్వారా మాత్రమే కాకుండా) బహిరంగంగా వెల్లడించే స్వేచ్ఛ ఉన్నదా?

కమ్యూనిస్టులందరూ ప్రపంచంచేత,  తిరస్కరించబడి, అక్కడక్కడా మిణుకు మిణుకు మంటూ ఉన్నారు. వారి పిల్లలు కూడా వారి పార్టీని ఎందుకు అనుసరించడం లేదో వారే తెలుసుకోవాలి. తమ ఉనికిని చాటుకోవడానికి వారికి తెలిసిన  పాత పంధా, కాలం చెల్లిన పడికట్టు పదాలనే  వల్లెవేస్తూ ఈ దేశానికి మేలుచేస్తున్నారా? కీడు చేస్తున్నారా? వారే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కార్పొరేట్ కంపెనీల సరళీకరణ అనేది రాజీవ్ గాంధీ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పటి నుండి మొదలై పి.వీ నరసింహారావు గారు మరియు మన్మోహన్ సింగ్ గార్ల హయాంలో పెంపొందించబడింది కాదా?
అంబానీలు, అదానీల వారి హయాంలో అభివృద్ధి చెందలేదా…కనుక కార్పొరేట్ లు వచ్చేసి మనల్ని దోచేసుకుంటాయని ఊదర గొట్టే దిగజారుడు రాజకీయ పార్టీల అవకాశవాద దుష్ప్రచారాలకు భయపడనవసరం లేదు..

-యడ్లపాటి రఘునాథ బాబు, చైర్మన్,భారత టుబాకో బోర్డు,గుంటూరు