జగనన్నకు వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు

197

ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా.. ఆయన క్యాంపు కార్యాలయం మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో సందడిగా మారింది. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఆమె, జగన్‌కు కేక్ తినిపించారు. డీజీపీ గౌతం సవాంగ్,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, వనిత, మంత్రి సురేష్, విశ్వరూప్,  వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు సీఎంఓ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి, సీఎంసీపీఆర్‌ఓ పూడి శ్రీహరి తదితరులు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,  తిరుమల వేదపండితులతో జగన్‌కు ఆశీర్వచనం ఇప్పించారు.