థాంక్యూ సోనూ సూద్…నీ మనసు బంగారం:చిరంజీవి

303

చిరంజీవి ఎంతో సహృదయుడన్న సోనూ సూద్
వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
లక్షల మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్ష
ఇలాగే సేవలు కొనసాగించాలని వ్యాఖ్యలు
ఈ గుర్తింపుకు నువ్వు అర్హుడివేనంటూ ట్వీట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సహనటుడు సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో సోనూ సూద్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇప్పటివరకు తాను పనిచేసిన వారిలో ఎంతో సహృదయుడు, స్నేహశీలి ఎవరంటే అది నిస్సందేహంగా చిరంజీవేనని పేర్కొన్నారు. అందుకు చిరంజీవి బదులిచ్చారు.

థాంక్యూ సోనూ సూద్ అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మానవత్వమున్న వ్యక్తుల్లో నీవు కూడా ఉన్నావు సోనూ అంటూ కొనియాడారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునే నీ అద్భుతమైన సహాయక చర్యలను కొనసాగించాలి అని ఆకాంక్షించారు. లక్షలాది  మంది ప్రజలకు ఇలాగే స్ఫూర్తిగా నిలవాలని, ఈ దిశగా మరింత శక్తిని పొందాలని దీవించారు. “నీ మనసు బంగారం సోనూ సూద్… ఇప్పుడు నీకు లభిస్తున్న ఈ గుర్తింపు నువ్వు అక్షరాలా అర్హుడివే” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.