కమ్యూనిష్టులు ఇప్పుడు ఏం చేయాలి?

0
453

కమ్యూనిష్టుల త్యాగాల గురించి, నీతి నిజాయితల గురించి, నిస్వార్థత గురించి తక్కువ చేసి చెప్పేవారు సమాజంలో బహు అరుదు. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకు ప్రజలకు తెలిసిన రాజకీయ పార్టీలు కాంగ్రెసు, కమ్యూనిష్టు పార్టీ లే.కాంగ్రేసు పోతే కమ్యూనిష్టులు అధికారంలోకి వస్తారని  అంతా బావించే వారు.కాని ప్రస్థుతం ఆపరిస్థితి దరిదాపుల్లో లేదని అభిమానులంతా ఆవేదన పడుతున్నారు.
ఈ సందర్భంగా  1920 దశకంలో  సంఘ్ పరివార్ మరియు కమ్యూనిష్టు ఉద్యమాలు ప్రారంభం .. ఒక్కసారి వీటి క్రమాన్ని పోల్చి చూద్దాం.

భారతీయ జనతా పార్టీ వయసు40 సంవత్సరాలు.బిజెపికి ముందున్న RSS ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ వయసు 70 సంవత్సరాలు.బిజెపి, జనసంఘ్ పార్టీలకు మాతృక అయిన ఆరెస్సెస్ వయసు 100 సంవత్సరాలు.  మార్స్కిష్టు సిద్దాంతం, రష్యా సోషలిస్టు విప్లవ ప్రభావం తో 1920 లో పుట్టిన భారత కమ్యూనిష్టు పార్టీ కి 100 సంవత్సరాలు అయింది. బీజేపీ రోజు రోజుకి ఎదిగి అధికారాన్ని సంపాదించుకుంది.300 పైగా సీట్లు సంపాదించుకొని, అధికారంలోకి వచ్చింది. కాని  కమ్యూనిష్టులు ఒకనాడు బిజెపి కంటే  ఎంతో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు కలిగి వుండి  ఈ రోజు మూడు నాలుగు సీట్లకు పరిమితమయ్యారు.ఇలా దిగ జారడానికి కారణాలెతకాల్సి వుంది.

కమ్యూనిష్టు ల పొరపాట్లు ఏమిటి?
కమ్యూనిష్టులు చేసిన రెండు పొరపాట్లే బి జె పి ఎదగడానికి కారణమయి వుంటాయని బావించాల్సి వుంటుంది. అవి:- 1. భారతసమాజాన్ని అంచనా వేయడంలో కమ్యూనిష్టుల చేసినపొరపాటు. సామాజిక న్యాయ ప్రాదాన్యత గుర్తించక పోవడం. 2. కమ్యూనిష్టు పార్టీచీలి పోవడం.చీలికలుపేలికలై ప్రజలలో విశ్వాసం కోల్పోవడం.

 భారతీయ సమాజం పట్ల అంచనా..
కమ్యూనిష్టు నాయకుల్లో అత్యధికులు సమాజాన్ని కూడా లోతుగా అధ్యయనం చేస్తుంటారు.కాని రష్యా, అమెరికా, చైనాలగురించి అధ్యయనం చేసినంత భారతీయ సమాజం గురించి చేయలేదని పిస్తోంది..భారతీయ సమాజ ప్రత్యేకత లు గుర్తించ లేదు.భారత సమాజ ప్రత్యేక వైరుధ్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్థిక వైరుధ్యాల చుట్టే తిరిగారు.అందువలననే మనువాద/బ్రాహ్మణీయ వ్యవస్థ కెతిరేక పోరాటానికి తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోలేదు. .
అందులో భాగంగానే బౌద్దాన్ని own చేసుకోకపోవడంగా పరిగణించవచ్చు.
మనువాద,బౌద్ద స్రవంతుల మద్య జరిగిన,జరుగుతున్న వైరుధ్యాన్ని గుర్తించలేదు,ప్రస్థుతపాలకవర్గాలకుల వ్యతిరేకఉద్యమాలకున్న వైరుధ్యాన్ని గుర్తించ లేదు.
వేలసంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న   కుల వ్యవస్థ తీవ్రత గుర్తించడంలో కమ్యూనిష్టు అగ్ర నాయకత్వం విఫలమయింది .కులం పునాదిలో వున్న వాస్తవం ఆదారంగా పార్టీ కార్యక్రమాల్లో బాగం చేయలేదు.

వర్గపోరాట మంటేఆర్ధిక,రాజకీయ, సామాజిక,సాంస్కృతిక,సైద్ధాంతిక రంగాలలో పోరాటాలని గుర్తించక పోవడం వలన దానికి తగ్గ  ఆచరణాత్మక  కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకో లేదు.
సామాజిక (కుల) వైరుధ్యం భారత సమాజ ప్రత్యేకతగా గుర్తించక పోవడం వలన శ్రామికజనాలనుండి,బహుజనుల నుండి నాయకత్వాన్ని ఎదిగించడానికి ప్రత్యేక కార్యచరణ ఫథకం లేక పోయింది.
అన్ని రంగాలలో ప్రత్యామ్న యాలు ప్రజల ముందు పెట్టలేక పోయింది.ఆర్ధికసమానత్వం , కుల నిర్మూలన పోరాటాలు ఈ దేశం లో జమిలీగా జరగాల్సివుంటుందని గమనించలేదు .
బుద్దుడు,పూలే,అంబేద్కర్ పట్ల వ్యతిరేక లేదా నిర్లక్ష్య వైకరి వదిలి,ప్రజాతంత్ర విప్లవ దశ లో అనివార్య, అవసరమైన శక్తులుగా గుర్తించి ఉండాల్సింది.ప్రతి అంశంలో రెండు పరస్పర విరుద్ధాలుంటాయనేదే గతి తర్క భౌతిక శాస్త్రము చెబుతుంది.

.వర్గఅస్థిత్వమైతే  యాజమాన్య వర్గ అస్థిత్వాల మద్య కార్మికవర్గ అస్థిత్వాలమద్య వైరుధ్యం ముంటుంది. కుల అస్థిత్వాలకు ఈ గతి తార్కిక సూత్రాలు వర్తింప చేస్తే,  ఆధిపత్యకుల అస్తిత్వానికి (ఫీడక కుల అస్థిత్వానికి) అణచ బడ్డ కుల అస్థిత్వానికి  (ఫీడిత కుల అస్థిత్వానికి) మద్య వైరుధ్యం వుంటుందని గుర్తించ లేదు. కులవ్యతిరేకపోరాట అవశ్యకత గురించి ఎవరైనా మాట్లాడితే వారికి కుల వాదులనే ముద్రవేసి వారంతా పార్టీ ను విడిచిపెట్టి పెట్టి పోయేలా చేశారు.

చివరకు రిజర్వేషన్ లాంటి సమస్యల పట్ల కూడా ఒక స్పష్టత లేకపోవడం లాంటి కారణాలు ఎన్నోవున్నాయి. బీసీలు సమాజం లో 50% పైగా వుంటారు. వీరికి రాజకీయ రిజర్వేషన్లు కు అన్ని కమ్యూనిష్టు పార్టీలు వ్యతిరేకం.బీసీలు బ్రహ్మణ,క్షత్రీయ,వైశ్యు కులాలతో పోటి పడాలంటారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు యిస్తే కమ్యూనిష్టు పార్టీలకు ఏమి నష్టమో చెప్పరు. పైగా దాటేస్తారు. అదే అగ్ర కులాలకు ఉపయోగ పడే అగ్రకులాల పేదలకు ఉపయోగ పడే 10% రిజర్వేషన్లు మాత్రం ఆగమేఘాల మీద బూర్జువా పార్టీ లతో పోటిపడి సమర్థించారు.

సామాజిక న్యాయ సిద్దాంతానికి ప్రతీకగా వున్న అంబేద్కర్ ను, ఆయన కృషిని గుర్తించక పోవడం, వ్యతిరేకంగా ప్రచారం చేయడం, పార్టీ రాజకీయ తరగతుల లో బూర్జువా, కుల వాది అని దుష్ర్పచారం చేయడం కమ్యూనిష్టు ఉద్యమాలకు తీవ్ర నష్టం చేసిందని గుర్తించడం లేదు.
క్యాపిటలిజం, బ్రహ్మణీజం శత్రువని ప్రకటించి జీవితాంతం పోరాడిన అంబేద్కర్ ను మాత్రం బూర్జువా అంటారు.
సామాజిక న్యాయ పేరిట ఏర్పాటై పని చేస్తున్న ఎస్పీ, బిఎస్పీ, ఆర్జేడీ ,రిపబ్లికన్ పార్టీలను కుల పార్టీ లని కమ్యూనిష్టు లు ముద్రలేస్తారు. ఎన్నడూ కనీసం సోషలిజం గురించి మాట్లాడని సుభాష్ చంద్ర బోస్ పార్టీ పార్వర్డ్ బ్లాక్ పార్టీ నేమో ఏకంగా లెప్ట్ ప్రంట్ లో చేర్చుకుంటారు. పార్టీ నాయకత్వం తమకున్న కుల అస్థిత్వాన్ని  తమ కులచైతన్యాన్ని అధిగమించలేకపోతున్నారు.
పైగా తాము పుట్టీ పుట్టడం తోనే కులరహిత ,అస్థిత్వ రహితంగా పుడుతామనే భ్రమలనుండి బయటికి రాలేకపోతున్నారు. ఇలాంటికారణాలు ఏమేమి  వున్నాయో మరింత లోతుగా వెతకాల్సివుంది.
ఇదేవిధంగామరోక ముఖ్యమైన కారణం కమ్యూనిష్టు పార్టీ చీలిక: అదెలనో చూద్దాం.

గతితార్కిక సూత్రాలననుసరించి శతృవైరుధ్యం అయితే చీలడం సరైందవుద్ది,మిత్రవైరుద్యమైతే చీలడంతప్పవుద్ది.ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా కలిసి వుండడమేసరైంది .
దేశం లోవున్న కమ్యూ నిష్టు పార్టీల మద్య వున్నది మిత్రవైరుధ్యాలే తప్ప శతృవైరుధ్యాలు కావు.  కాబట్టి చీలడమే తప్పు. భిన్నాభిప్రాయాలుండటం సహజం. వాటి పరిష్కారానికే “కేంద్రీకృత ప్రజాస్వామ్య “ నిర్మాణ సూత్రమున్నదే అందుకోసం. కాని అన్ని కమ్యూనిష్టు పార్టీలు,గ్రూపులు “కేంద్రీకృత ప్రజా స్వామ్యం”మానిర్మాణసూత్రాలంటారు ,మాకు శిరోధార్యం అంటారు. కాని అందరూ దానిని ఉల్లంఘించుతున్నవారే. కమ్యూనిష్టు నాయకత్వం “కేంద్రీకృత ప్రజాస్వామ్యం’ నిర్మాణ సూత్రం పాటిస్తే కమ్యూనిష్టు ఉద్యమం చీలకుండేది. ఈ సందర్భంగా‘ కమ్యూనిష్టు ప్రణాళిక‘. లో చెప్పింది గమనార్హం.కార్మికవర్గ పార్టీ లను కొంత మంది నాయకులు పదవి వ్యామోహం తోనో, సంకుచిత ధోరణితోనో చీల్చే ప్రమాదం ఉందని గ్రహించి హెచ్చరించారు . అది ఎలాగో చూద్దాం.

“కమ్యూనిష్టుప్రణాళిక”  2 వ చాప్టర్ “ “ కార్మికులు-కమ్యూనిష్టులు” లోని మొదటి 4వాక్యల లోనే కార్మికవర్గపార్టీల చీలికల ప్రమాదాన్ని గుర్తించి మార్క్స్ చెప్పింది చూడొచ్చు.
ఆ 4 లైనులు
మొదటి లైన్    “మొత్తం శ్రామిక వర్గంతో కమ్యూనిష్టుల సంబంధం ఎలా వుంటుంది?”
రెండవ లైన్ “కమ్యూనిష్టులు ఇతర శ్రామికవర్గ పార్టీలకు వ్యతిరేకంగా వేరే పార్టీగా ఏర్పడరు.”
మూడవ లైన్ “శ్రామికవర్గ ఉమ్మడి ప్రయోజనాలకు భిన్నంగా విడిగా కమ్యూనిష్టులకు ఏ ప్రయోజనాలు లేవు.”
నాల్గవ లైన్ “ వాళ్శు శ్రామికవర్గ ఉద్యమాన్ని తమకు నచ్చిన మూసలో పోతపోయడానికి ఏ సొంత సంకుచిత సూత్రాలనూ రూపొందించరు.”
పై నాలుగు లైనులు కమ్యూనిష్షులు చీలొద్దని చెప్పాయి తప్ప చీలి పొమ్మని చెప్పలేదు.
కమ్యూనిష్టుపార్టీ చీలకుండా వుండటానికే “కేంద్రీకృత ప్రజాస్వామ్యం” అనే నిర్మాణ సూత్రాన్ని రూపొందిం చాడు లెనిన్. లెనిన్,మావో లు తాము మైనార్టీ లోవున్నప్పుడు  ఓపిక,బాద్యత లతో వ్వహరించి మెజారిటీ సాధించుకొని విప్లవాలు జయప్రదం చేసుకున్నారు.
మార్క్స్ చెప్పిన కార్మీకులంతా  ఐక్యం కావాలన్నధృక్పథం ను,లెనిన్ చెప్పిన కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని పాటించి వున్నట్లైతే భారత కమ్యూనిష్టు ఉద్యమం చీలి వుండక పోయేది. దేశంలో ఒకే కమ్యూనిష్టు పార్టీ వుండేది. ఇంత అస్థవ్యస్త పరిస్థితి దాపురించి వుండకపోయేది.

దేశం లో 1885 లో కాంగ్రేసు, 1920లో  కమ్యూనిష్టుపార్టీ ఏర్పడింది. రాజకీయపార్టీలంటేకాంగ్రేసు,కమ్యూనిష్టులే అనేది1960వ దశకం వరకు జనాలకు తెలిసింది.పాలకవర్గపార్టీ అంటే కాంగ్రేసు, ప్రతిపక్షపార్టీ అంటే కమ్యూనిష్టు పార్టీ నే చూసేవారు.కొన్ని చిన్నచిన్న పార్టీలున్నా అవి పెద్ద లెఖ్ఖలోకి రాక పోయేవి. పాలక పక్షం పై సహజంగా వచ్చే వ్యతిరేకత కమ్యూనిష్టులకు ఉయోగపడేది.
1964 చీలిక  తర్వాత కమ్యూనిష్టు ఉద్యమమేధావులు,కవులు,    రచయితలు  నిరాశ , నిస్పృహలకు లోనయ్యారు.   నెమ్మది నెమ్మదిగా కమ్యూనిష్టు పార్టీ లకు దూరమయ్యారు.  ప్రజాసంఘాల చీలికలతో ఒకటి, రెండు రాష్ట్రాలలో తప్ప దేశమంతా బలహీనపడుతూ వచ్చారు.ఓటింగ్ లో కూడా అదే పరిస్థితి.

మొదటి చీలిక అనేక చీలికలకు దారి తీసింది. చీలిన ప్రతి గ్రూప్ తాము చీలడం చారిత్రకఅవసరం, అనివార్యం అనడం సహజమై పోయింది. చీలి వారెవరైనాచీలికనుశ్లాఘిస్తారు,
సమర్దిస్తారు తప్ప చీలిక తప్పనరు. ఫలితంగా చీలికలుపేలికలైన కమ్యూనిష్టుల పట్ల  ప్రజలలో చులకనబావం పెరిగింది.
చీలిన పది గ్రూపులలో ,ప్రతి గ్రూప్ మిగతా తొమ్మిదిగ్రూపులు,పనికిమాలినవని మార్క్సిజాన్నివదిలేశాయని, విప్లవానికి ద్రోహం చేశాయని ఒకరి పై మరొకరు  దుష్ప్రచారం చేయడమే ఒక కార్యక్రమంగా పెట్టుకొన్నారు.దానికనుకూల సాహిత్యం సృష్టించి క్లాసుల పేరిట మిగతా గ్రూపులపట్ల చులకన బావన,అసహ్యత కలిగేలా భోదిస్తారు.అనివార్యమై నాయకులు కలిసి పని చేయాల్సివచ్చినా కార్యకర్తలు కలువలేని పరిస్థితి ఏర్పడింది.చీలిన ఏగ్రూప్ ను అడిగినా తాము రోజు రోజు కి పెరుతునే వున్నామని చెపుతారు.  ఇది వాస్తవ విరుద్దం కాబట్టి ఆ పార్టీల పట్ల మరియు నాయకుల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు చీలిక తర్వాతనే ప్రాంతీయపార్టీలు దేశమంతా పెరిగాయి.

జనసంఘం( బి జె పి మాతృక) , చీలిక తర్వాతనే ముస్లీంలీగ్ లాంటి శక్తులు పెరిగాయి.చీలిక తర్వాతనే కమ్యూనిష్టుకార్యకర్తలు,అభిమానులు కమ్యూనిష్టు పార్టీలపై విశ్వాసం కోల్పోయి ఇతర పార్టీలలో చేరికలు ప్రారంభమయినవి.రోజురోజు కొత్త శక్తులు రావల్సింది పోయి ఉన్న వాళ్లే పోతున్న పరిస్థితి.
ఇలాంటి కారణాలరీత్యా, కమ్యూనిష్టులు వెనక పట్టు పట్టడంతో, ప్రత్యామ్నాయం లేక పోవడంతో,  ఆ ఖాళీని బిజెపి మరియుకొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు,తిష్టవేయగలిగాయి.
ఇది కమ్యూనిష్టు నాయకుల స్వీయమానసిక దోరణి,భాద్యతరాహిత్య ఫలితమే.
దేశంలో విప్లవాత్మక మార్పులు రాక పోవడానికి కారణం ప్రజలు కాదు. కోచైతన్యం చేయాల్సింది ప్రజలను కాదు . చైతన్యం చేయాల్సింది నాయకులను మాత్రమే.ప్రజలకు కోపమొచ్చినప్పుడల్లా ప్రభుత్వాలను మార్చుకుంటునే వున్నారు.సరైన ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు ప్రజలెప్పుడు.గురితప్పలేదు.
సరైన ప్రత్యామ్నాయం ఏర్పాటు లేనప్పుడు  అందుబాటులో ఉన్న ప్రధాన ప్రతిపక్షంకు ఓట్లేసి గెలిపించిన ఉదాహరణ లు అనేకం మన ముందు వున్నాయి. ప్రజలందరూ ‘పదురుకొని‘ లేదా”కూడబలుక్కొని” నిర్ణయం తీసుకున్నారా అన్నట్లు తీర్పులిచ్చారు.
1977 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన ఓడించారు. 1983 లో ఎన్టీఆర్ నుగద్దెనెక్కించారు. బెంగాల్,కేరళ,త్రిపురా లో వామపక్ష ప్రభుత్వాలను తెచ్చుకున్నారు.ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో అగ్ర కుల ఆధిపత్యన్నెదిరించి బహుజనులను గెలిపించుకున్నారు.డిల్లీలో కాంగ్రెసు, బిజెపి లను కాదని కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. సరైన ప్రత్యామ్నాయం లేనప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మీద కోపంతో అంతకంటే అద్వాన్నంగా వున్న ప్రభుత్వాలను కూడా తెచ్చుకున్నది చూస్తూనే ఉన్నాము.  ప్రజల కు విశ్వాసం కలిగించే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడం కమ్యూనిస్టు పార్టీల తప్పు తప్ప ప్రజలది కాదు.

 ఇప్పుడు ఏమి చేయాలి?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయినాయి..
బూర్జువాపార్లమెంటరి వ్యవస్థ కుంటుకుంటూ అయినా లౌకిక ,ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తూ వుంది.లౌకిక ప్రజాస్వామ్యాన్నైనా మరింత పటిష్ట పరుద్దామని వామపక్ష, బహుజన పార్టీలు కృషి చేస్తున్నాయి.అందుకు రాజ్యంగ  పరిరక్షణ ఒక ప్రజాతంత్ర కర్తవ్యంగా ఎంచుకొని పని చేస్తున్నవి.
కాని 6సంవత్సరాలక్రితం బిజెపి అధికారంలోకి రావడంతో దేశ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.  బిజెపి పచ్చి పాసిస్ట్ పాలనకు బాటలు వేసింది.దళితులు ,గిరిజనులు,మైనారిటీ,మహిళలు, వెనుకబడిని తరగతులపై దాడులు ,దౌర్జన్యాలు, హత్యాకాండ లు పెచ్చరిల్లిపోతున్నాయి. రేప్, మానభంగాలు నిత్యకృత్యంగా మారినయి. గుండాయీజానికి, హంతకమూఠాలకు పట్టపగ్గాలు లేకుండా పోయినవి. బిజెపి పాలనలో మనుషుల ప్రాణాల కంటే గోవులు,ఏనుగులు,గుడులు,రథాలే మాత్రమే ముఖ్యమని భావించ బడుతున్నవి .
ఆధునిక భారతీయ సమాజంలో ఎమర్జెన్సీ యే దుష్టపాలన అనుకున్నాము.కాని మోడి పాలన ఎమర్జెన్సీ కంటే  ఎన్నోరెట్లు ఎక్కువప్రమాదకర మని అందరికి అర్థమయింది. రాజ్యంగాని కి ప్రమాదం వచ్చింది. న్యాయ వ్యవస్థ, దర్యాప్తు వ్యవస్థ, పాలకుల చేతిలో పావులుగా మారినవి. ఈ పరిస్థితి మార్చేదెలా అని అభ్యుదయ వాదులంతా ఆందోళన పడుతున్నారు.  దేశంలో అభ్యుదయ వాదులుగా వున్న కవులు, రచయితలు, మేదావులు చాల ఎక్కువ సంఖ్యలోనే వున్నారు.వీరు రెండు స్రవంతులుగా విడిపోయి వున్నారు.
ఒకటి వామపక్ష స్రవంతైతే రెండోది సామాజికన్యాయ స్రవంతి.  ఈరెండు స్రవంతులకు చెందిన వీరంతా మనువాద సంస్కృతి కి,  బిజెపి చేసే దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్పందిస్తుంటారు. మనువాద పాలనకు , ఆర్ధిక రంగంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాలు చేసే వామపక్షాలు అభ్యుదయ శక్తులలో ప్రధాన మైనది గా వున్నద మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థ భారతీయ సమాజాన్ని తిరోగమన దిశగా మళ్లిస్తుంది. దీనికెతిరేకంగా బుద్ధుడు, పూలే , పెరియార్,అంబేడ్కర్ తదితరుల సామాజిక న్యాయ సిద్దాంతం కైకృషి చేస్తున్న అభ్యుదయ శక్తులు చురుకుగా పని చేసే సామాజిక శక్తులు మరో ప్రథాన శక్తిగా వున్నది.
ఈరెండు శక్తుల మద్య ఐక్యత తక్షణ కర్తవ్యం గా కమ్యూనిష్టు లు గుర్తించాలి. అన్ని అభ్యుదయ శక్తులకు కేంద్రం గా కమ్యూనిష్టు లు నిలవాలి. ఈ శక్తులన్నీటి కి విశ్వాసం కలిగించాలంటే దేశంలో వున్న కమ్యూనిష్టు లంతా  నేపాల్ కమ్యూనిష్టు లను ఆదర్శం తీసుకోవాలి. తక్షణ మే సిపిఐ ,సిపిఎంలైనా విలీనం కావాలి. అప్పుడు కమ్యూనిష్టు పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలు, కమ్యూనిష్టు సానుభూతి పరులంతా ఉత్సాహంగా కదులుతాయి.కమ్యూనిషేతర అభ్యుదయ శక్తులన్నీటికి భరోసా ఏర్పడుతుంది.
అభ్యదయశక్తుల మద్యవుండే అనవసర, చిన్న చిన్న అంశాలపై వున్న విభేదాలు కూడ ప్రక్కలకు పోతాయి. దేశంలో వున్న ప్రధాన అభ్యుదయ శక్తులన్నీ ఒకే వేదికపై కి రావడం సులభమవుద్ది.మనువాద బ్రాహ్మణీయ పాసిస్టు శక్తుల నివారించడం ,కమ్యూనిష్టుల పునర్ వైభవం అసాద్యమేమికాదు.

                                                                                                    – రాములు జి.  9490098006