‘రాజధాని విషాదాని’కి పెరుగుతున్న ఆదరణ

324

మూడురోజుల్లోనే లక్షన్నరకు చేరువయిన నెటిజన్లు

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యానికి  దృశ్యరూపం ఇచ్చిన డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రయత్నమే ‘రాజధాని విషాదం’ డాక్యుమెంటరీ.  సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి.. కాంగ్రెస్-భాజపా ఆడిన రాజకీయ చదరంగంలో, రాజధాని లేకుండా అనాధలయిన ఏపీ ప్రజల దుస్థితిపై,  పరకాల తీసిన ఈ డాక్యుమెంటరీకి దేశ విదేశాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం మూడురోజుల్లోనే వీక్షకుల సంఖ్య లక్షన్నరకు చేరువకావడం విశేషం. దానిని గంటకు 1500 నుంచి 2 వేల మంది వీక్షిస్తున్నారు. అమరావతి ‘రాజధాని విషాదైం’పె పరకాల తీసిన డాక్యుమెంటరీపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. 95 శాతం మంది నెటిజన్లు డాక్యుమెంటరీని అభినందిస్తుండగా, 5 శాతం మంది నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కాగా దీనిని ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి, ఆమేరకు అమెజాన్‌తో ఒప్పందం జరిగినట్లు తెలిసింది. కాగా.. ఈ డాక్యుమెంటరీ టీజర్ విడుదలకు ముందు, అదంతా టీడీపీకి అనుకూలంగా రూపొందించినదేనంటూ వైసీపీ వర్గాలు ట్రోల్ చేశాయి. అయితే డాక్యుమెంటరీ విడుదల తర్వాత,  విచిత్రంగా టీడీపీ వర్గాల నుంచి ట్రోల్ పెరగడం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. అందులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ వర్గాలు ఆశించినట్లు విమర్శలు లేవు. వాస్తవాలే ప్రస్తావించారు కాబట్టి!  ఆ రకంగా రెండు పార్టీలను ఆయన నిరాశపరిచారన్నమాట. పాపం.. పరకాల!!

                                                                                   – సుమ