చంద్రబాబు జీవితమే కుట్రలమయం

541

ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం : కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఎవరితో సంప్రదించాలో వారితో చర్చించి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు జీవితమే కుట్రలమయం అని ధ్వజమెత్తారు. పోలీస్ అధికారి కింద పడిపోతే వైఎస్సార్‌సీపీ కార్యకర్త సహాయం చేస్తే.. దాడి చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఆ దమ్ము,ధైర్యం లేదు: అవంతి శ్రీనివాస్‌
మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ తమ వాదం కోసం రాజీనామాలు చేసి, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారు. చంద్రబాబు కూడా వైఎస్‌ జగన్‌ లాగే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలపై వైఎస్‌ జగన్‌కి ఉన్న దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అమరావతిలో తన భూములు ధరలు తగ్గిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.