పుట్టినరోజు పేరుతో కార్యకర్తలు వసూళ్లకు పాల్పడుతున్నారు

439

రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు
చిరు వ్యాపారులను కార్యకర్తలు వేధిస్తున్నారు
ఇలాంటి పనుల వల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తుంది
అభిమానుల ఉన్మాద చర్యలపై జగన్ జోక్యం చేసుకోవాలి
వైసీపీ కార్యకర్తలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు పేరుతో పార్టీ కార్యకర్తలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే పండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పనుల వల్ల వైసీపీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. వైసీపీ అభిమానుల ఉన్మాద చర్యలపై జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జగన్ జోక్యం చేసుకోకపోతే… ప్రజల్లో అసహనం పెరుగుతుందని అన్నారు