కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శుల ఆగ్రహం

494

రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్నికల ముందు వైయస్సార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఇంతవరకు ,పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ ఆ ఊసే ఎత్తక పోయినప్పటికీ మంత్రి కొడాలి నాని ఏమి పీకాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు  కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ,కామరాజుగడ్డ  కుసుమకుమారి ,కొడాలి నాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా కమలాపురంలో శుక్రవారం  సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు .

అమరావతి రాజధాని తరలింపు పై సంవత్సరకాలంగా దీక్షలు చేస్తున్న రాజధాని రైతులకు సంఘీభావంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడాన్ని విమర్శించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్టీఆర్ సానుభూతి ఓట్లు దండుకుని ఎన్నికల్లో గెలుపొంది ఇంతవరకుకృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టక పోయినప్పటికీ కొడాలి నాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుమాలిన చర్య గా వారు పేర్కొన్నారు ఎన్టీఆర్ పేరుతో ఓట్లు దండుకుని దివంగత ఎన్టీఆర్ పై కపట ప్రేమ చూపించి ,ఓట్లు కొల్లగొట్టు కున్న వైసీపీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు  కొడాలి నాని గుడివాడ బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునే స్థాయికి త్వరలోనే దిగజారి పోతాడని వారు మండిపడ్డారు .రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పెట్టడానికి వణికిపోతున్న వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల రిఫరెండానికి  సిద్ధం కాకుండా నోటికొచ్చినట్లు పిచ్చి కుక్క లాగా వాగడం సిగ్గుమాలిన మంత్రి కొడాలి నానికే చెందుతుందన్నారు. అలాగే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడని ప్రతిసారి ఎద్దేవా చేస్తున్న కొడాలి నాని 2014 ఎన్నికల్లో వైజాగ్ లో వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం నీవు మరచి పోయావా అని కొడాలి నానిను హేళన చేశారు.

మంగళగిరిలో లోకేష్ బాబు కేవలం అయిదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడ ని కానీ వైజాగ్ లో విజయమ్మ రెండు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చెందినా ఇంతవరకు వైసిపి నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని  ఎద్దేవా చేశారు.ఎన్నికల్లో గెలుపోటములు సాధ్యమేనని ప్రతిసారి వాటి గురించి ప్రస్తావిస్తే ,,ఇంకా అనేక విషయాలు బహిర్గతం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు సొంత శాఖ మీద ఏమాత్రం పట్టు లేని పౌరసరఫరాల మంత్రి కొడాలి ప్రవర్తన చూస్తుంటే పిచ్చి కుక్కలు కరిచిన వారికంటే ఘోరంగా వాగుతున్నాడని వారు దుయ్యబట్టారు .

రాష్ట్రంలో,ఎస్సీ ,ఎస్టీ ,బిసి ,మైనార్టీలకు 45 సంవత్సరాల  పెన్షన్ల విషయంలో మాట తప్పడం ,రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని విషయంలో మాట దాటవేయడం ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మీ ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగులను లోపాలను సరి చేసుకోవాల్సింది పోయి  పొద్దున లేచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడును  విమర్శిస్తుండడం పనికిమాలిన చర్యగా వారు పేర్కొన్నారు నోరు ఉందని పిచ్చి కుక్క లాగా వాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు కొడాలి నాని ని హెచ్చరించారు ఈ విలేఖరుల సమావేశంలో కడపజిల్లా తెదేపా నాయకులు ఈ.జనార్దన్ , రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు ప్రవీణ్ అప్పాజీ పాల్గొన్నారు