రజని ఫోబియా?

631

జనవరి 2021లో తన రాజకీయ ప్రవేశం,పార్టీ ఆవిర్భావం తధ్యమని చెప్పిన రజని ని చూసి మిగిలిన  రాష్ట్ర  పార్టీలన్నీ భయపడుతున్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి.మూడేళ్ళ తర్జన భర్జనలు కాలంలో రజని అనేక మంది రాజకీయ నాయకుల,పార్టీల విమర్శలకి గురిఅయ్యారన్నది అందరూ ఎరిగిన విషయమే.అయితే పడ్డవా డు చెడ్డవాడుకాడు  అన్న రీతిలో ఎట్టకేలకు అయన తన నిర్ణయాన్ని తమిళుల కోసం తీసుకుంటున్నట్టు ప్రకటించడం వెనుక చాలా కధ నడిచింది అన్నది మాత్రం ఆయనకి మాత్రమే ఎరుక.నిర్ణయం తీసుకోవడంలో అయన చేసిన ఆలస్యమే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల వారికీ అలుసై కూర్చుని అయన వైఖరులపై పలు విమర్శలకు తావిస్తూ  రజనీకి  పరోక్ష పబ్లిసిటీని తెచ్చింది.

అయితే  సెప్టెంబరు,2020 మొదటి వారంలో  రజని పైన ఇతర పార్టీల విసుర్లూ-విమర్శలు ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపించడంతో ఆయనకు కొంచం అసహనం పెరిగిన మాట వాస్తవం.అయితే రజని చాలా బాలన్స్డ్ గా వ్యవహరించే మనిషి కావడం తో  అయన చెయ్యాల్సిన  పనిని  అభిమాన సంఘాలు తలకెత్తు కోవడం జరిగింది.పువ్వు చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్న చందాన తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ రజని చుట్టె  తిరుగుతున్నాయని చెప్పొచ్చు. వివరాల్లో కి వెళితే ఈ విమర్శల సినిమా స్క్రిప్ట్ లో అనేక విలువైన విషయాలు వెలుగు చూశాయి.

 రాజకీయ మార్పుకు వేదిక ఉంటేనే రజిని తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే  పుకార్లను  మిగిలిన రాజకీయ పార్టీలు పుట్టించి వాటిని ప్రజల్లోకి వెళ్లేలా చేశాయి. ఇలాంటి పుకార్లపైన  అయన స్పoదన ఏమిటని  రజని ఫ్యాన్ క్లబ్ సీనియర్ ఎక్సిక్యూటివ్ ని అడిగినపుడు  అయన  స్పందిస్తూ, రాజకీయాల్లోకి రావడం కోసం రజని చేసిన గ్రవుండ్ వర్క్  చెబితే ఎవరూ నమ్మరు.66,627 బూత్ కమిటీలను ఒక్కొక్క ఏరియాకి  పది చొప్పున ఏర్పాటు చేశారు. ఏరియా, సర్కిల్ మరియు బ్రాంచ్ కార్యాలయాలు  ప్రారంభించేశారు . ప్రత్యామ్నాయ పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు ప్రతి రోజూ  రజినితో సన్నిహితంగా మెలుగుతున్నారు . రజని రోజూ రెండు గంటలు ఫోరమ్ జిల్లా కార్యదర్శులతో సంప్రదిస్తున్నారు . కరోనా ముప్పు రజిని పక్కన ఆలోచించేలా చేస్తుంది అనేది నిజం. కానీ తప్పుడు వార్త ఏమిటంటే, ఎన్నికలు దగ్గరకు వస్తే, కరోనాను వంక చూపి  ఆయన పదవి నుంచి తప్పుకుంటారు అనే విమర్శ.” అని దానిని రజని తన నిర్ణయంతో పటాపంచలు చేశారని  అయన అన్నారు. ఇటీవల ఢిల్లీ పోల్ సర్వే కి  చెందిన ఒక ప్రైవేట్ సంస్థ “ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారా?” అనే అంశం మీద ” తమిళనాడులోని 172 నియోజకవర్గాల్లో  సర్వే జరిపింది .ఈ సంస్థ జూలై, ఆగస్టు నెలల్లో రహస్య సర్వే నిర్వహించి ఫలితాలను రజనీకి సమర్పించారు. పోల్ చేసిన వారిలో దాదాపు 60 శాతం మంది కొత్త రాజకీయ మార్పును కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ప్రజలకి అవగాహన పెరిగిందని  ఈ సర్వేతో రజని గ్రహించారు.ఈ సర్వేల ఆధారంగానే ఆయన తన ప్రవేశం గురుంచి స్పష్టతను ఇచ్చారని తెలిసింది.

రజిని రాజకీయాలకు రారు అనే ఇతర పార్టీల పుకార్లను తమిళ ప్రజలారా నమ్మనుగాక నమ్మరు అని తేలి పోయింది. . రజనీ రాజకీయ రాకతో  ఆయనపైనే వ్యతిరేక సంచలనం సృష్టించిన ఒక  ప్రముఖ  రాజకీయ పార్టీ కుటుంబ సభ్యుడు ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేశారు. వారు రజినీని రాజకీయాల్లోకి రాని విధంగా ఉంచడానికి శతవిధాలా ట్రై  చేశారు. ఈ అర్ధంలేని పుకార్లు చదివిన  తరువాత  రజినీకి కోపం వచ్చింది. చెన్నై, కృష్ణగిరి, తూత్తుకుడి జిల్లా కౌన్సిలర్లతో మాట్లాడుతూ “ఇది ప్రారంభం మాత్రమే..  మేము ఎన్నికల ఆట ఆడటం ప్రారంభించక ముందే, ప్రతిపక్షాలు కేకలు వేయడం ప్రారంభించాయి.వారి కేకలే  మాకు రానున్న ప్రజాభిమానాన్ని  సంకేతం అన్నారు.

అవార్డుపై బురద..?
నటుడు రజనీకాంత్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వార్త గత ఏడాదిన తమిళనాడులో హాట్ టాపిక్  అయ్యింది . ఈ అవార్డుకు “ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ” అని పేరు పెట్టారు. ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డును నిన్న గాక మొన్న వచ్చిన రజని కి  ఇవ్వడం ఏమిటంటూ ,శ్రీ లంక ఉగ్రవాదుల కి సపోర్టు ఇచ్చే దర్శకుడు సీమాన్  రజనీకాంత్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం ను  అభినందిస్తున్నాను.  ఇళయరాజా, భారతి రాజా, కమల్ హాసన్ వంటి అతని కంటే ఎక్కువ సాధించిన వారు స్క్రీన్ ప్రపంచంలో ఉన్నారు. కానీ, రజనీకి ఇచ్చినదానిని బట్టి చూస్తే, ఆయన బిజెపికి చాలా సన్నిహితంగా ఉన్నందున ఆయనకు ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటూ నేరుగా ఆరోపించారు.

రజినీకి ఇవ్వనున్న ఈ అవార్డు వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉంది. రజినీకి తమ వలలో పడి పోయినందుకు బిజెపి ఈ అవార్డు ఇస్తోందనే ఆరోపణ లు, విమర్శ లు వచ్చాయి.ఇది పక్కన బెడితే అవార్డు ప్రకటించిన తరువాత, రజనీకాంత్ సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు నుండి మంచి అభినందన లను  అందుకున్నారు. మరీ ముఖ్యంగా, రజిని తో దోస్తీ కి కుస్తీ పడుతున్న డాక్టర్ రామదాసు శుభాకాంక్ష లు అందరినీ ఒక్క క్షణం ఆశ్చర్యపరిచాయి.ఎందుకంటే  2004 లో, వీరప్పన్ గురించి రజిని చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన డాక్టర్ రామ్దాస్, ‘బాబా’లో’ ధూమపానం ‘వంటి పోస్టర్లను విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రజిని, రామ్దాస్ల మధ్య భారీ ఘర్షణగా చెలరేగింది.అప్పటి నుంచి రాందాస్ రజనికి శత్రువుగా ఉంటూ వచ్చారు. అటువంటి శత్రువే తిరిగి రజనీని పొగడటంతో అందరూ ముక్కున వేలుసుకున్నారు. అయితే ఈ అవార్డును ప్రకటించిన కేంద్ర సమాచార, ప్ర సార శాఖ మంత్రి ప్రకాష్ జవ్దేకర్ తన ట్విట్టర్ పేజీ లోగత కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమకు రజనీకాంత్ చేసిన కృషికి గుర్తింపు గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించినందుకు సంతోషం గా ఉందని చెప్పిన విషయం అందరికి తెలిసినదే. .

కమల్ హాసన్ మాత్రం తెలివిగా తనకి అవార్డును ప్రకటించలేదన్న భాధను  సినిమాటిక్ నవ్వుతో  అదిమిపెడుతూ ‘రజినీకి అవార్డు ఇవ్వడానికి కారణం నాకు తెలుసు, రజినికి అది తెలుసు’ అని సమాధానం ఇచ్చారు. తనకు, రజనీకి మధ్య ఎలాంటి అపార్ధాలూ  ఉండకూడదని భవిష్యత్లో తాను రజని ద్వారా  పొందబోయే  రాజకీయ రంగ ప్రయోయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమల్  రీల్ మార్చారని అందరూ అనుకున్నారు.

తమిళుల దృష్టిలో..
తమిళులు మాట్లాడుకునే విషయాల్లో ప్రతి రెండు లేదా మూడో పదం రజని అని సర్వేలలో తేలడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా తమిళులను ఏకం చేయడంలో తమిళ భాషకు మొదటి స్థానం ఉన్నప్పటికీ, రజినీకి సినిమా అనే  కళారూపం ద్వారా అదే  వరుసలో స్థానం ఉందనే విషయాన్ని మనం అంగీకరించాలి. తమిళులలో రజని అంటే ఇంత అభిమానం ఎందుకంటే ,రజిని అంటే పాజిటివిటీ, రజిని అంటే విజయం, రజిని అంటే నిరంతర ప్రయత్నం, రజిని అంటే హార్డ్ వర్క్, రజిని అంటే ఉత్సుకత, రజిని అంటే సింప్లిసిటీ  అనేది తమిళుల మనస్సుల్లో నాటుకొనిపోయిన  కొన్ని నిర్దిష్టమైన భావాలు.

కర్ణాటకలో, ముంబైలో తమిళులను ఓడించిన వట్టల్ నాగరాజ్,  దివంగత బాల్ ఠాక్రేతో రజినీకి మంచి సంబంధాలున్నాయి. నాగరాజ్ అల్లరి ప్రసంగాలు కర్ణాటక ప్రజలకు నచ్చవు. కానీ రజినీ  ఆయన్ని తన అభిమాన వక్తగా పేర్కొన్నారు . మరో  అడుగు ముందుకు వేసి రజినీ, “బాల్ ఠాక్రే నాకు దేవుడిలాంటివాడు” అని కూడా  అన్నారు. తమిళనాడు ప్రజలు వీటి  గురించి పెద్దగా పట్టించుకోరు, కాని తమిళనాడు ను  ఎవరు పాలించాలనే దాని గురించి వారు చాలా స్పష్టంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రజని ఓడిపోయే సన్నివేశం ఎదురుపడితే  దానిని ,తమిళనాడు ప్రజలు దీనిని ఖచ్చితంగా అంగీకరించరు. కారణం రజిని వైఫల్యాన్ని తమ సొంత వైఫల్యంగా భావించగలిగే వారే తమిళ ఓటర్లు .రజినిని ఓడించకూడదని అనుకునే వారే తమిళనాడు ప్రజలు.రజిని పార్టీ ప్రారంభిస్తానని చెప్పగానే తమిళ వోటరుల మానసిక స్థితి అమ్మయ్యా అనుకోని కుదుటపడ్డట్టైంది. కానీ మిగిలిన ద్రావిడ పార్టీలకు గొంతులో పచ్చి వెలగ పడ్డట్టయింది అనేది నిర్వివాదాశం. రజనీని మధ్యవర్తుల ద్వారా  రంగంలోకి రాకుండా చేయడానికి కూడా ఒక రెండు పార్టీలకు చెందిన పెద్దలు రాయబారాలు నడిపారు. అమిత్ షా నిఘా నేత్రంతో అవి పారక పోవడంతో, చివరకు కమలంతో చేతులు కలపకుండా ఉంటె రాజకీయాల్లోకి రావచ్చని వారు చెప్పడం విశేషం. కమలనాధుల రాజకీయ శైలే భిన్నంగా ఉంటుందన్న సంగతి వారికీ తెలియక పోవడం హాస్యాస్పదం.

– డాక్టర్ చల్లా జయదేవ్
సీనియర్ జర్నలిస్ట్, చెన్నై