ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

265
అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్‌లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్  ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీకి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి బాధ్య‌త వ‌హించ‌నున్నారు. నాగ్‌పూర్‌లో జరగబోయే 66వ ఎబివిపి జాతీయ స‌ద‌స్సులో వారిద్దరూ బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు.