56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు,డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

671

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు,డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
‘బీసీ సంక్రాంతి సభ’లో సీఎం  వైయస్‌ జగన్‌
విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో కార్యక్రమం

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 139 వెనకబడిన కులాల కోసం రాష్ట్రంలో
ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.ప్రతి కార్పొరేషన్‌లో 12 మంది డైరెక్టర్లు.మహిళలకు తగిన ప్రాతినిథ్యం
కల్పిస్తూ, మొత్తం పదవుల్లో 50 శాతం పదవులు వారికి కేటాయింపు.ఇన్నాళ్లూ కనీసం ఉనికి కూడా తెలియకుండా, అన్ని రంగాలలో పూర్తిగా వెనకబడిన కులాలను కూడా గుర్తించిన ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు.

బీసీ సంక్రాంతి సభ’లో సీఎం  వైయస్‌ జగన్‌ ప్రసంగం

నెల ముందే సంక్రాంతి:
        ‘ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు
ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. అదే వేదిక మీద మీరందరూ ఇక్కడే ప్రమాణ
స్వీకారం చేయడం నా మనస్సుకు ఎంతో సంతోషం ఇస్తోంది. కార్పొరేషన్ల
ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించబడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన
సందర్భంగా, మీ అందరినీ చూస్తుంటే, సంక్రాంతి పండగ నెల రోజుల ముందే
వచ్చిందా అన్నట్లు ఉంది’.

సామాజిక న్యాయం–అక్క చెల్లెమ్మలు:
        ‘139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు. ప్రతి కార్పొరేషన్‌కు ప్రతి
జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు. రాష్ట్ర చరిత్రను తిరగ
రాసేలా బలహీన వర్గాలను బలపర్చేలా మరో అడుగు ముందుకేశామని ఈ వేదికగా
చెబుతున్నాను. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే.
672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం
చేశారని గర్వంగా చెబుతున్నాను. అక్క చెల్లెమ్మలకు ఈ స్థానం కల్చించడం
అంటే, మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం’.

‘ఆలయాలు, బోర్డులు, మార్కెట్‌ యార్డులు, బోర్డులలోనూ నామినేటెడ్‌
పదవుల్లో కూడా బీసీలకు ఈ స్థాయిలో పదవులు దక్కడం, దేశ రాజకీయ, సామాజిక
చరిత్రలో జరగలేదు. పైగా అందులో సగం అక్కచెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా
చూశారా? అని అడుగుతున్నాను.

మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా ప్రతినిధులు. అర్హులైన
ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం అందేలా, అటు ప్రభుత్వం, ఇటు మీ
సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు
నిర్వర్తించబోతున్నారు. ఇది పదవి కాదు. బాధ్యత అని గుర్తుంచుకోండి’.

ఆ దుస్థితిని కళ్లారా చూశాను:   
‘నా 3648 కి.మీ పాదయాత్రలో చూశాను. గ్రామంలో 1000 మంది ఉంటే
కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలా కనిపించ లేదు. అది కూడా
టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్‌ చూపిస్తే తప్ప, జన్మభూమి కమిటీలు
ఒప్పుకుంటే తప్ప అవి రాలేదు. ఆ స్థాయిలో కార్పొరేషన్లు దిగజారాయి’.

అందుకే ఈ నిర్ణయం:
‘అందుకే ఈ కార్పొరేషన్‌ వ్యవస్థలో మార్పులు. రాజకీయాలు,
పార్టీలు, వివక్షకు తావు లేకుండా, లంచాలకు అవకాశం లేకుండా అర్హులైన ప్రతి
ఒక్కరికి శాచురేషన్‌ పద్ధతిలో పథకాలు అమలు చేయాలన్న తపన, తాపత్రయంలో
కార్పొరేషన్‌ వ్యవస్థలో సంపూర్ణ మార్పులు చేశాం.

ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా న్యాయ చేసేందుకు మీ అందరినీ
ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది. బీసీ పేద వర్గాలలో ప్రత ఇంట్లో
సంతోషం కనిపించాలి. ఆ బాధ్యత మీ అందరి మీద పెడుతున్నాను’.

నాడు చెప్పాను–అమలు చేశాను
      ‘బీసీలు అంటే వెనకబడిన వారు కాదు. వారు మన సంస్కృతి, నాగరికతకు
వెన్నెముక అని నాడు ఏలూరు సభలో చెప్పాను. గత ప్రభుత్వం బీసీలను ఏ రకంగా
వెన్నెముక విరిచిందో చూశాం. మనం అధికారంలోకి వస్తే, వారి జీవితాలు
మారుస్తానని మాట ఇచ్చాను.

ఈ 18 నెలలు అందు కోసేమే పని చేశాను. పేదలకు అండగా నిలబడ్డాను. బీసీలు,
ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కనీవినీ ఎరగని
విధంగా తోడుగా, అండగా నిలబడ్డాము.

మేనిఫెస్టోను ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత మాదిరిగా భావించాము.
అందులో చెప్పిన వాటిని 18 నెలల్లోనే 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం’.
‘బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు
తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం అని ప్రతి రోజూ
అనుకుంటాను. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు అవకాశం ఇచ్చాడని
అనుకుంటాను’.

మాట తప్పిన గత ప్రభుత్వం:
‘2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో
చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి, కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీల
విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో ఒకటి చూస్తే.. బీసీలకు ఏటా రూ.10 వేల
కోట్లు ఇస్తామన్న గత ప్రభుత్వం, ఆ 5 ఏళ్లలో మొత్తం రూ.50 వేల కోట్లు
బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, నిజానికి అప్పుడు బీసీల కోసం చేసిన
ఖర్చు ఆ 5 ఏళ్లలో కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది’.

మరి ఈ ప్రభుత్వం వచ్చాక..:
        ‘అప్పుడు ఆ పరిస్థితి అయితే, మన అందరి ప్రభుత్వం వచ్చాక ఈ 18
నెలల కాలంలోనే బీసీలపై రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని ఈ సందర్భంగా
సగర్వంగా చెబుతున్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున
ఉన్న ఈ పేద వర్గాలకు ఈ 18 నెలల కాలంలోనే రూ.59,317 కోట్లు చేసి, 4.45
కోట్ల మందికి మేలు చేయగలిగాము’.
‘ఇదే 18 నెలల కాలంలో బీసీ అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఏకంగా
రూ.38,519 కోట్లు ఖర్చు చేసి, అక్షరాలా 2.88 కోట్ల కుటుంబాలకు మేలు
చేయగలిగామని కూడా గర్వంగా చెబుతున్నాను.
ఒక్కో కుటుంబంలో ఏడు పథకాలు కూడా అందాయి’.

ప్రత్యేకించి మన బీసీలను తీసుకుంటే, వారి కోసం ఈ 18 నెలల
ప్రయాణంలో ఏం చేశామని చూస్తే..
– శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు తొలుత తీసుకున్న నిర్ణయం
– క్యాబినెట్‌ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60
శాతం పదవులు ఇచ్చాం.
– 5 గురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అని
గర్వంగా తెలియజేస్తున్నాను.
– శాసనసభ స్పీకర్‌ కూడా బీసీనే. తమ్మినేని సీతారామ్‌ ఎంతో సౌమ్యుడు. మంచివాడు.
– గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు చూస్తే, రాజ్యసభకు కనీస ఒక్క బీసీని కూడా
పంపలేదు. కానీ ఈరోజు 18 నెలలు కూడా కాక ముందే, 4గురిని రాజ్యసభకు పంపితే
అందులో ఇద్దరు బీసీలు. సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి అన్న ఇక్కడే ఉన్నారు.
– గతంలో మార్కెట్‌ యార్డు పదవుల్లో బీసీలు కనిపించే వారు కాదు. ఆలయాల
పదవుల్లో ఎస్సీ ఎస్టీలు ఉండే వారు కాదు.
– అందుకే నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం
పదవులు, వాటన్నింటిలో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం చేశాం’.

గ్రామ, వార్డు సచివాలయాలు:
        ‘ఈరోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత
ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలో 83 శాతం ఉన్నారు.
ప్రభుత్వ పథకాలు నేరుగా వారి ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. 50 ఇళ్లకు ఒక
వలంటీర్‌ను పెట్టాం. వారి సేవలకు నిజంగా సెల్యూట్‌ చేయాలి. ఎక్కడా
వివక్ష, రాజకీయం లేదు అర్హత ఉంటే చాలు, ఇంటి తలుపు తట్టి డబ్బు
ఇస్తున్నా. ఈ 18 నెలల్లో దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2.60
లక్షల వలంటీరు, మరో 1.30 లక్షల వంది సచివాలయాల్లో పని చేస్తున్నారు. ఆ
విధంగా గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం. 18 నెలల కాలంలో ప్రతి అడుగు మంచి
జరగాలి. పేదలకు మంచి చేయాలని ప్రతి రోజూ దేవుడిని మొక్కుకుంటాను’.

పథకాలు–లబ్ధిదారులు–బీసీలు:

అమ్మ ఒడి:
– ఇందులో 82 లక్షల పిల్లలకు 43 లక్షల తల్లులకు ఏటా రూ.6500 కోట్లు.
వారిలో బీసీలు 19.66 లక్షల మంది ఉన్నారు.
– వచ్చే జవనరి 9న రెండోసారి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం.

వైయస్సార్‌ రైతు భరోసా:
– దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి. ఒక్కో కుటుంబానికి ఏటా
రూ.13,500 ఇస్తున్నాం. ఇందు కోసం అక్షరాలా రూ.6,750 కోట్లు ఖర్చు చేశాం.
– వారిలో బీసీ రైతు కుటుంబాలు 23.69 లక్షలు కాగా, ఈ రెండేళ్లలో వారికి
రూ.6,140 కోట్లు ఇచ్చాం.

రైతులకు సున్నా వడ్డీ పథకం:
– ఇందు కోసం ఈ 18 నెలల కాలంలో చెల్లించిన మొత్తం రూ.1207 కోట్లు కాగా,
లబ్దిదారులు 14.58 లక్షల.
– వారిలో 7.14 లక్షల మంది బీసీలు కాగా, వారికి అక్షరాలా రూ.511 కోట్ల
మేలు జరిగింది.

ఉచిత పంటల బీమా:
– ఈ పథకంలో 9.48 లక్షల రైతుల కోసం మొత్తం రూ.1252 కోట్లు ఖర్చు చేయగా,
వారిలో బీసీ రైతులు 4.48 లక్షలు.
– వారికి ఈ పథకంలో రూ.588 కోట్ల మేలు చేయడం జరిగింది.

ఇళ్ల స్థలాల పట్టాలు:
– ఒక యజ్ఞం మాదిరిగా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు
కూడా కాకముందే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఒక యుద్ధమే
చేశాం.
– ఈనెల 25న క్రిస్మస్‌. అదే రోజు వైకుంఠ ఏకాదశి. 31 లక్షలకు పైగా ఇళ్ల
స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం. 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రతి
గ్రామానికి వచ్చి, వాటిని అందజేస్తారు.
– ఇళ్ల స్థలాల పట్టాలు తీసుకోనున్న వారిలో 15.92 లక్షల మంది బీసీ అక్క
చెల్లెమ్మలు ఉన్నారు. నేరుగా వారి పేరుతోనే కోర్టు నుంచి అనుమతి రాగానే
రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వబోతున్నాం.

టిడ్కో ఇళ్లు:
– మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లలో 1.53 లక్షల బీసీలకు లబ్ది జరగబోతుంది.

వైయస్సార్‌ నేతన్న నేస్తం:
– ఈ పథకంలో 81 వేల కుటుంబాలకు లబ్ధి. వారికి ఈ 18 నెలల్లో రూ.384 కోట్లు
ఖర్చు చేశాం. వారంతా బీసీలే.

వైయస్సార్‌ మత్స్యకార భరోసా:
– ఈ పథకంలో మొత్తం రూ.210 కోట్లు ఖర్చు చేయగా, లబ్ధిదారులు 1.07 లక్షలు.
వారు కూడా బీసీ కుటుంబాలే.

జగనన్న చేదోడు:
– రజకులు, నాయీ బ్రాహ్మణ సోదరులు, టైలర్లు. మొత్తం లబ్ధిదారులు 2.98
లక్షలు కాగా, వారిలో బీసీలు 2.27 లక్షల మంది ఉన్నారు.
– వారికి ఈ పథకంలో ఇచ్చిన మొత్తం రూ.227 కోట్లు.

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ:
– ఈ పథకాన్ని గతంలో నిర్వీర్యం చేయాలని చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక
పక్కాగా అమలు చేయడంతో మొత్తం 9.67 లక్షల మంది లబ్ధిదారులపై రూ.2340
కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
– వారిలో బీసీలు 5.24 లక్షల మంది కాగా, వారి కోసం చేసిన వ్యయం మొత్తం
రూ.1255 కోట్లు.

వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా:
– పథకంలో 2.61 లక్షల లబ్ధిదారులపై మొత్తం రూ.165 కోట్లు ఖర్చు చేయగా,
లబ్ధిదారులలో బీసీల సంఖ్య 1.38 లక్షలు.
– వారిపై చేసిన వ్యయం రూ.87 కోట్లు.

వైయస్సార్‌ పెన్షన్‌ కానుక:
– ప్రతి నెలా ఒకటో తారీఖునే సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి ఈ
పెన్షన్‌ అందిస్తున్నాం.
– ఈ పథకంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 61.94 లక్షలు కాగా, వారికి ఈ 18
నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు ఇచ్చాం.
– ఇందులో బీసీ కుటుంబాలు 30.27 లక్షలు కాగా. వారికి ఈ 18 నెలల్లో
రూ.12,230 కోట్లు పెన్షన్లుగా ఇచ్చాం.
– ఇది బీసీ అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మల మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ.

వైయస్సార్‌ ఆసరా:
– పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు (2019, ఏప్రిల్‌)
ఉన్న రుణాలు రూ.27,163 కోట్లు. రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో ఆ
మొత్తం ఇస్తామన్నాం.
– ఆ మేరకు రూ.6792 కోట్లు మొదటి దఫాగా ఇచ్చాం.
– మొత్తం లబ్ధిదారులు 87.74 లక్షలు కాగా, వారిలో 42.60 లక్షల మంది బీసీ
అక్కచెల్లెమ్మలు ఉన్నారు.
– వారికి మొదటి విడతలో రూ.3260 కోట్ల సాయం అందించగా, నాలుగేళ్లలో మొత్తం
రూ.13,040 కోట్లు బీసీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం.

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ:
– పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకంలో రూ.1400 కోట్లు
వారి చేతిలో పెడుతున్నా.
– ఈ పథకంలో మొత్తం లబ్ధిదారులు 90.37 లక్షలు కాగా, వారిలో బీసీ అక్క
చెల్లెమ్మలు 48.39 లక్షలు ఉన్నారు.
– వారికి ఈ పథకంలో అందించే ప్రయోజనం ఏకంగా రూ.720 కోట్లు.

వైయస్సార్‌ చేయూత:
– ఈ పథకంలో అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం
రూ.75 వేలు ఇవ్వబోతున్నాం.
– పథకంలో 24.56 లక్షల అక్క చెల్లెమ్మలకు తొలి ఏడాది రూ.4604 కోట్లు ఇచ్చాం.
– ఆ డబ్బుతో వారికి నెల నెలా ఆదాయం రావాలని చెప్పి, బ్యాంకుల నుంచి
రుణాలు ఇప్పించడమే కాకుండా, వారు వ్యాపారం చేసుకుంటే నష్టాలు రాకుండా
జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద కంపెనీలు ఐటీసీ, రిలయెన్సు,  పీ అండ్‌ జీ,
అల్లానా, హిందుస్తాన్‌ లీవర్‌ లిమిటెడ్, అమూల్‌తో ఒప్పందాలు చేసుకున్నాం.
– డెయిరీలు, మేకల, గొర్రెల పెంపకం, రీటెయిల్‌ షాపుల ద్వారా ఆదాయం వచ్చేలా
ఏర్పాటు చేయడం జరిగింది.
– ఇందులో బీసీ అక్కచెల్లెమ్మలు 14.81 లక్షలు కాగా, వారికి ఏకంగా రూ.2778
కోట్ల ప్రయోజనం కలుగుతోంది.

జగనన్న విద్యా దీవెన:
– పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.3857 కోట్లు ఇవ్వగా, మొత్తం
18.57 లక్షల పిల్లలకు మేలు జరుగుతోంది.
– వారిలో బీసీ విద్యార్థులు 9.30 లక్షలు కాగా, వారికి రూ.1684 కోట్ల మేలు జరిగింది.

జగనన్న వసతి దీవెన:
– ఈ పథకంలో గత 18 నెలలలో రూ.1221 కోట్లతో 15.57 లక్షల పిల్లలకు ప్రయోజనం
కలిగించగా, వారిలో బీసీ విద్యార్థులు 7.43 లక్షల మంది ఉన్నారు.
– వారికి మొత్తం రూ.553 కోట్లు ఇవ్వడం జరిగింది.
– ఇది జగనన్న ప్రభుత్వం. మీ అందరి ప్రభుత్వం. మీ అందరి కోసం ఆలోచించి
చేస్తున్న ఖర్చు ఇదంతా

జగనన్న విద్యా కానుక:
– ఇందులో 42.34 లక్షల పిల్లలకు లబ్ధి. వారికి గతంలో ఏవీ సమయానికి ఇవ్వని పరిస్థితి.
– ఆ పరిస్థితి మార్చి, వారు బాగుండాలన్న తపనతో వారకి బుక్స్, షూస్,
సాక్సులు, యూనిఫామ్, స్కూల్‌ బ్యాగ్‌ ఇస్తున్నాం.
– ఇందుకోసం రూ.648 కోట్లు ఖర్చు చేస్తుండగా, వారిలో బీసీ విద్యార్థులు 22
లక్షలు ఉన్నారు.

జగనన్న గోరుముద్ద:
– పిల్లల మధ్యాహ్న భోజనంలో పక్కాగా మెనూ. రోజుకో వెరైటీ.
– ఈ పథకంలో 32.52 లక్షల పిల్లలకు మేలు జరుగుతుండగా, వారిలో బీసీ
విద్యార్థుల సంఖ్య 17.23 లక్షలు

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ:
– ఈ పథకంలో మొత్తం 30.16 లక్షల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మేలు
జరుగుతుండగా, వారిలో 14.78 లక్షల బీసీలు ఉన్నారు.

వైయస్సార్‌ వాహనమిత్ర:
– ఈ పథకంలో ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో 2.75 లక్షల లబ్ధిదారులకు రూ.513
కోట్ల ఆర్థిక సహాయం చేయగా, వారిలో బీసీ లబ్ధిదారులు 1.22 లక్షలు ఉన్నారు.
– వారికి ఇప్పటి వరకు రూ.230 కోట్ల సహాయం చేయడం జరిగింది.

జగనన్న తోడు:
– వీధుల్లో చిరు వ్యాపారులు. వారికి మేలు చేయాలని గతంలో ఏనాడూ, ఎవరూ ఆలోచించలేదు.
– పథకంలో దాదాపు 9 లక్షల మందికి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు. ఆ
వడ్డీ భారం ప్రభుత్వం కట్టే ప్రయత్నం జరుగుతోంది. వారిలో బీసీలు 4.34
లక్షలు ఉన్నారు.

మాకే ఆశ్చర్యం కలుగుతుంది:
‘ఇది సందర్బం కాబట్టి చెప్పాల్సి వస్తోంది. ఇన్ని చేశామా? అని
అనిపిస్తుంది. కానీ జరిగాయి. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాతే
చెబుతున్నాను. ఇవి చెబుతుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.ఇప్పుడు
అన్నీ అమలు చేశానని గర్వంగా మీ బిడ్డలా, అన్నలా చెబుతున్నాను’.

అడుగు వెనక్కు వేయలేదు:
‘నేటి తరం ఆకాంక్షలు, అవసరాలు అర్ధం చేసుకుని ప్రభుత్వం తరపున
పూర్తి స్థాయిలో అండదండలు. కోవిడ్‌ సమయలో కూడా నాలుగు అడుగులు ముందుకు
వేశాను. ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు’.

అభివృద్ధి అంటే? నమ్మాం కాబట్టే:
‘ఇంటింటా పిల్లలు మంచి చదువులు చదువుకుంటేనే దాన్నే అభివృద్ది
అంటారని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం. 100 శాతం అక్షరాస్యత సాధిస్తేనే
అభివృద్ధి అంటారని చెప్పి నమ్మాం కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం.
కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు
జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు అని నమ్మాను కాబట్టే, ఆ దిశగా అడుగులు
వేశాను. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే దాన్నే
అభివృద్ధి అంటారు అని నమ్మాను కాబట్టే, ఆ దిశలో అడుగులు వేశాము.
విత్తనాలు మొదలు పంట అమ్మే వరకు రైతులకు అన్ని సేవలు అందితేనే అభివృద్ధి
అంటారని చెప్పి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము. ప్రభుత్వ బడులు
మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగాలని,
నాడు–నేడు ద్వారా వాటి రూపురేఖలు మారుస్తున్నాం’.

ఒక ఉద్యమంలా..:
‘సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఉచితంగా ఇంగ్లిష్‌
మీడియమ్‌లో వారి గ్రామాల్లోనే చదువుకోగలగడం, శతాబ్ధాలుగా ఇళ్లు లేని
కుటుంబాలకు స్థలంతో పాటు, ఇల్లు కట్టించి వారి చేతుల్లో పెట్టడం,
సామాజికంగా, ఆర్థికంగా, వైద్య పరంగా, గౌరవపరంగా, హోదా పరంగా, సదుపాయాల
పరంగా, నాలుగు మెట్లు వారు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం.. దీన్ని
అభివృద్ధి అని నమ్మాను కాబట్టే, ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాలు
చేస్తున్నాం’.

దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర:
‘ఇది ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్య పెట్టేందుకు గత ప్రభుత్వ
పాలకులు.. ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో, తాను సొంతంగా బాగు
పడేందుకు ఇన్‌సైడెడ్‌ ట్రేడింగ్‌ చేసి, తాను తన అనుచరులు, బినామీల చేత
భూములు కొనిపించి, అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి,
భూములు కొని, కొనిపించి.. వాటి విలువ పడిపోతుందని ఇవాళ ఒక
ఉద్యమంచేస్తున్నాడు’.
‘ఒక చెడిపోయిన బుర్ర అక్కడ పని చేస్తుంటే ఎలా ఉంటుంది? ఒక మంచి
బుర్ర ఇక్కడ పని చేస్తే ఎలా ఉంటుందనేది చూస్తే తెలుస్తుంది’.

మీ భుజస్కంధాలపై:
        ‘మీ అందరికి మంచి చేసే అవకాశం దేవుడు నాకిచ్చాడు.
పథకంలో అర్హత ఉన్నా రాని వారు ఎవరైనా ఉంటే, వారికి వాటిని అందించే
బాధ్యతను మీ భుజస్కందాలపై పెడుతున్నాను. మీరు జిల్లాలలో ఎక్స్‌ అఫీషియో
సభ్యులుగా వ్యవహరించబడతారు. ఎందుకంటే అక్కడ మీ వాయిస్‌ వినిపించాలి’ అంటూ
సీఎం తన ప్రసంగం ముగించారు.

        డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌బాషా, మంత్రులు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్,
గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌, వెలంపల్లి
శ్రీనివాస్‌, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య
(నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు,చెల్లుబోయిన
వేణుగోపాలకృష్ణ, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి
వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్,
వైయస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో
పాటు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.