మాపై వివక్ష చూపకుండా సమాజంలో మమ్మల్ని భాగస్వాములు చేయండి

534

_మీడియా సమావేశంలో సెక్స్ వర్కర్స్ వేడికోలు

అక్రమ రవాణా కు గురికాబడి ప్రత్యామ్న్యాయ ఉపాది అవకాశాలు లేక సమాజంలో అవహేళనలు, వేదింపులు, హింస, చిన్న చూపు తో పాటు అప్పులు ఉబిలో నుంచి బయటకు రాలేక తమ జీవనం కోసం తప్పనిసరి పరిస్తుల్లో “సెక్స్ వర్కర్స్” గా మారి తమ జీవితాలు వెళ్ళదీస్తున్న సెక్స్ వర్కర్స్ నేడు కోవిడ్ మహమ్మారి వల్ల మరింత దుర్భల పరిస్థితి లో కొట్టుమిట్టాడుతున్నారు .. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఆదుకొని వీరికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు కల్పించాలని అక్రమ రవాణా భాధితుల రాష్ట్ర సమాక్య “విముక్తి” రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా కోరారు.

గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో “సెక్స్ వర్కర్స్ పై హింసను నిరోధించాలి అనే అంతర్జాతీయ దినోత్సవం” (International Day to End Violence Against Sex workers) పురష్కరించుకొని అక్రమ రవాణా భాధితుల సమాఖ్య – విముక్తి మరియు ఇండియా లీడర్స్ ఫోరం అగనేస్ట్ ట్రాఫికింగ్ (India Leaders forum against trafficking- ILFAT) రాష్ట్ర శాఖ సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో షుమారు రెండు లక్షల మంది మహిళలు వ్యభిచారంలో మగ్గుతున్నారని వీరిలో షుమారు ఒక లక్ష మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే “రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ” కార్యక్రమ్మాల్లో రిజిస్టర్ కాబడి ఉన్నారు. వీరు కాక అక్రమ రవాణా నుంచి విముక్తి పొందిన వారు మరో రెండు వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సెక్స్ వర్కర్స్ లో షుమారు 60% మంది తమ 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు లోపల అక్రమ రవాణా కు గురికాబడి అనంతరం సెక్స్ వర్కర్స్ గా తమ జీవితాలు వెళ్ళదీస్తూ ఉన్నారు.

కోవిడ్ తర్వాత రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్ పై పలురకాల హింసలు పెరిగాయి అని అవి షుమారు 55% గా ఉంది అని అంటూ ఇటీవల్ ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే లో తెలిపింది. వీరిలో వ్యభిచార గృహాలలో ఉండేవారిలో 35% ఉండగా, హైవే, డాబాలు, వివిధ రహదారులు పక్కన వ్యభిచారం చేసేవారిలో 58% మంది ఉండగా, వీరిని ఉంచుకొన్న వాళ్ళు, బ్రోతల్ ఓనర్స్ మరియు కుటుంభ సబ్యులు వల్ల 45% పలు రకాల హింసలు కు గురి అవుతు ఉన్నారు.

కోవిడ్19 మహమ్మారి ప్రభావం అట్టడుగున ఉన్నవారిపై అసమానంగా ప్రభావం చూపగా, సెక్స్ వర్కర్స్ పై దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మహమ్మారి సమయంలో పని కోల్పోవడం దేశం లోని వివిధ రెడ్ లైట్ ప్రాంతాలు మరయు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని వ్యభిచార ప్రాంతాల నుండి భారీగా 70% సెక్స్ వర్కర్స్ పైగా తమ స్వంత గ్రామాల్లోని తమ ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. వారు తమ గ్రామాలు, ఇళ్ళకు తిరిగి రావడం నిజమగ వారికి ఒక తప్పనిసరి పరిస్థితే. అందుకు కారణం అనేక మంది సెక్స్ వర్కర్లకు, వారి కుటుంబాలు మరియు సంఘాల నుండి తాము చేసే వ్యభిచారం చుట్టూ ఉన్న కళంకం మరియు బహిష్కరణ కారణంగా “ఇంటికి తిరిగి రావడం” ఒక ఎంపిక కాదు
సత్వ అనే సంస్థ ఇటీవల ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన ఒక 1 4 5 మంది సెక్స్ వర్కర్స్ తో ఒక శాంపిల్ సర్వే చేయడం జరిగింది.

• సెక్స్ వర్కర్స్ వారి సంపాదన 100% పూర్తిగా తగ్గిపోయింది అన్నారు
• 74% మంది ఎక్కువ వద్దికి ప్రవేటు వ్యక్తులు నుంచి అప్పులు తీసుకొన్నట్లు తెలిపారు.
• 88% మందికి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు లేవని, 61% మందికి అసలు ఎటువంటి జీవనోపాదులు లేవని తెలియజేశారు
• 57% మంది ఇతర ఉపాది అవకాశలు ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాని ఈ కోవిడ్ వల్ల ఎటువంటి ఉపాది అవకాశాలు వారికి లభించలేదు. ఫలితంగా వారు వారి కుటుంభాలు చాలా ఇబ్బందులు ఎడుర్కొనవలిసిన పరిస్థితే ఏర్పడింది
• కోవిడ్ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వీరిలో కొంత మందికి ఉపాది అవకాశాలు లభించాయి. అయితే వీరికి తగిన విద్య, పనిలో నైపుణ్యాలు లేనందువల్ల, వివిధ జీవనోపాదులు గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలీ చాలని అతి తక్కువ వేతనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు
• ప్రత్యామ్నాయ జీవనోపాధిని వారికి అవాంఛనీయమైన లేదా అసాధ్యమైనదిగా చేసే ఇతర ముఖ్య కారణాలు: వారు ఇష్టపడే జీవనోపాదులు లభ్యం కాకపోవడం, బ్రోతల్ గృహాల వెలుపల వారు ఉండటానికి స్థలం లేకపోవడం, వేశ్యాగృహం లో ఉంటూ బయట ప్రత్యామ్న్యాయ ఉపాది, ఉద్యోగం తీసుకోవడంలో సిగ్గు, సమాజం తనను ఆదరిస్తారో లేదో అనే భయం మరియు పిల్లల సంరక్షణ కు తగిన మద్దతు లేకపోవడం / పిల్లలను ఒంటరిగా వేశ్యాగృహంలోనే విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోవడం లాంటి భయాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని సంస్థలు / వ్యక్తులు తప్పుడు వాగ్దానాలు చేయడం గురించి కూడా భయాందోళనలు.

డిమాండ్స్:
• ప్రభుత్వ ప్రణాలికలు మరియు సంక్షేమ ప్రయోజనాల నుడ్ని మమ్మల్ని మినహాహించవద్దు. మా పేదరికం, మా దుర్బలత్వం , అట్టడుగు స్తాయిలో ఉన్న మమ్ము సమాజంలో కలపండి
• ఈ దేశంలోని మిగతా పౌరలందరికి లాగే మాకు సమాన హక్కులు ఇవ్వండి- రేషన్ కార్డులు అందుకునే హక్కు, బ్యాంకు ఖాతాలు తెరుచుకునే హక్కు, జనధాన్ యోజన ప్రోయోజనాలు పొందే హక్కు అధర్ కార్డులు, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకునే ఆర్ధిక ప్రయోజనాలు పొందే హక్కు
• మేము వేశ్యాగృహం నిర్వాహకులు, మేడంలు మరియు పింప్ లు వల్ల మాత్రమే కాకుండా కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు, ప్రైవేటుగా అధిక వడికి అప్పులు ఇచ్చే వారి ద్వారా కూడా మేము హింసకు, దోపిడీకి గురవుతున్నామని ప్రభుత్వాలు గుర్తించాలి, అలాగే మా సాధికారత, అన్ని రకాల దోపిడీ నుంచి మాకు రక్షణ కల్పిస్తూ మా సమస్యలు, మా హక్కులు వినడానికి వీలుగా ఒక పాలసీని రూపొందించండి
• మమ్మల్ని నేరస్తులుగా చూడకండి, మా నిస్సహాయత ను ఆధారంగా చేసుకొని మమ్మ్మల్స్ని లైంగిక దోపిడీకి గురిచేసి మా నుండి లాభం పొందిన వారందరిని నేరస్తులుగా గుర్తించి వారికీ శిక్షలు వేయండి
• సెక్స్ వర్కర్స్ 35 ఏళ్ళు దాటినా తర్వాత తమ జీవనం కోసం వ్యభిచార గృహాల యజమానులు, పింప్, మేడం మరియు త్రాఫ్ఫికెర్స్ గా మారకుండా వారిని నివారించటానికి వీలుగా సెక్స్ వర్కర్స్ కు రక్షణ, ఆర్ధిక పునరావాసం తో పాటు వారి సాధికారత కోసం రాష్ట మరియు జాతీయ స్తాయిలో ఒక పాలసీ ని రూపొందించండి
• మమ్మల్ని రెస్క్యూ చేసిన వెంటనే పునరావాసం పేరున మమ్మల్ని ఆశ్రయ గృహాలలో నెలలు, ఏళ్ళు తరబడి ఉంచి మా (మానవ) హక్కులకు బంగం కలిగించవద్దు. అందుకు బదులుగా కమ్యూనిటీ ఆధారిత పునరావాస విధానాలను అనుసరించండి
• అన్ని రకాల మానవ అక్రమరవాణా అడ్డుకునేందుకు వీలుగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము
• అక్రమరవాణాకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని చట్టాలు మరియు విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేందుకు రాష్ట ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీ ని ఏర్పాటు చేయాలి. ఈ పర్యవేక్షణ కమిటీ లో సెక్స్ వర్కర్స్ మరియు అక్రమరవాణా నుండి విముక్తి పొందిన బాధితులు ను కూడా సబ్యులుగా నియమించాలి.
• సెక్స్ వర్కర్స్ కు వివిధ ఉపాధి పధకాల్లో శిక్షణ ఇచ్చి ప్రత్యామ్న్యాయ జీవనోపాదులు వెంటనే ఏర్పాటు చేయాలి.
• వారు ఉపాది శిక్షణలు పొందే సమయంలో వారి జీవనం కోసం ప్రతేక జీవన్ బ్రుతి కల్పించాలి.
• సెక్స్ వర్కర్స్ కు GO Ms No: 1/2003 ప్రకారం సామజిక అవసరాలు (గృహాలు,ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు) తో పాటు తమ పిల్లల చదువు, రక్షణ భాద్యతలు ప్రభుత్వాలు చేపట్టాలి .
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్స్ వర్కర్స్ ను అప్పుల బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలి. అందుకు వీలుగా ఆర్థిక భద్రత (బ్యాంకు ఖాతాలను తెరవడం, కొత్త వెంచర్లను ప్రారంభించడానికి రుణాలు తీసుకోవడం మరియు భవిష్యత్తు కోసం పొదుపులు ప్రారంభించడం) అందించే ప్రత్యామ్నాయ జీవనోపాధి ప్రణాళికలను అందించడం ద్వారా రుణ బంధాల గొలుసును విచ్ఛిన్నం చేయాలి.
• స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అందించి సేవలు పొందే సెక్స్ వర్కర్స్ మాత్రమే వారి వద్దః రిజిస్టర్డ్ అయి ఉన్నారు. కాబట్టి మిగిలిన సెక్స్ వర్కర్స్ కూడా రిజిస్టర్ అయ్యేవిధమగా ఒక విధానం రూపొందించాలి
• చాలా మంది వ్యభిచారంలో ఉన్న మహిళలు బిసి, ఎస్సీ, ఎస్టీ వంటి గ్రూపులకు చెందినవారు, ఆయా సంబంధిత కార్పొరేషన్ సంస్థలు ద్వార వారికి G.O.Ms No.1 ప్రకారం రుణాలు ఇవ్వడంలో మద్దతు ఇవ్వాలి. అలాగే పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేలా సెక్స్ వర్కర్స్ సిబిఓల నుండి సిఫారసు రావాలి. మహిళలందరినీ వివిధ విభాగాలలోని అన్ని సంబంధిత పథకాలతో కవర్ చేయవచ్చ.
• సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ పథకాల జాబితాను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తూ మరియు వారికి ఆ పథకాల గురించి అవగాహనా కల్పించాలి
• సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా బాధితులపై కళంకం మరియు వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సెక్స్ వర్కర్స్ పట్ల వివక్షత తొలగించేలా చేయడానికి మరియు వారు తిరిగి సమాజంలో పునరేకీకరణను మరింత అంగీకరించేలా సమాజం యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి పౌర అవగాహన సదస్సులు ప్రారంభించబడాలి.
• కోవిడ్ మహమ్మారి నేపద్యంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు మేరకు సెక్స్ వర్కర్స్ అందరికి కనీసం ౩ నెలలు రేషన్ పంపిణి చసి వారికీ ఆర్ధిక సహకారం అందించాలి. ప్రభుత్వం నుండి అన్ని సేవలను పొందటానికి రేషన్ కార్డులను వెంటనే జారీ చేయండి
• 2015 నుంచి విముక్తి కాబడిన లైంగిక అక్రమ రవాణా బాధితులకు వెంటనే బాధితుల నష్ట పరిహారం పథకం క్రింద నష్ట పరిహారం చెల్లించాలి.
• G.O.M s .N o. 28 క్రింద విముక్తి కాబడిన సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా బాధితులకు తక్షణ ఉపశమనం క్రింద రూ. 20, 000 / – వారి అత్యవసర ఖర్చులను తీర్చడానికి ఒక నెలలోపు నగదు రూపంలో తక్షణ ఉపశమన మద్దతు అందించాలి
• భాదితుల మరియు సాక్షులు రక్షణ పథకం, 2018 సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి తక్షణమే ఈ పధకం అమలులోకి తీసుకొని రావాలి

ఈ సమావేశం లో ఇండియా లీడర్స్ ఫోరం అగనేస్ట్ ట్రాఫికింగ్ (India Leaders forum against trafficking- ILFAT) రాష్ట్ర శాఖ కన్వీనర్ శ్రీమతి భాను ప్రియ, కో- కన్వీనర్ శ్రీమతి రజని, విముక్తి వివిధ జిల్లాల కన్వీనర్ లు శ్రీమతి పుష్పవతి, శ్రేమతి చిన్న దుర్గ, శ్రీమతి మౌనిక, శ్రీమతి జానకి, హెల్ప్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ భాస్కర్, శ్రీ మంత్రు నాయక్ తో పాటు వివిధ జిల్లాలు నుంచి వచ్చిన మరో 20 మంది విముక్తి సబ్యులు పాల్గొన్నారు.