వైసిపి ప్రభుత్వంతో కుమ్మక్కైన హిందూమత పీఠాధిపతులు

741

టిటిడి నిర్ణయాన్ని పీఠాధిపతులు సమర్థించడం న్యాయమా
తమ సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న పీఠాధిపతులు
కాశీభట్ల సాయినాథ్ శర్మ

తిరుపతి : ప్రపంచంలోనే హిందూ మత విశ్వాసాలకు భక్తికి మూల స్థానమై భూలోక వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమలలో శాస్త్ర ప్రమాణాలు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులపాటు తెరిచి ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టిటిడి బోర్డు ప్రకటించినప్పటికీ  హిందూ మత పీఠాధిపతులు కొందరు సమర్థించడం హిందూ ధర్మాన్ని మంట కలిపే  కుట్రలోభాగమేనని వీరిని సమర్థిస్తున్న  పీఠాధిపతులు కూడా తమ స్వప్రయోజనాల కోసం ఈ  కుట్రలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ పీఠాధిపతుల తీరుపై ధ్వజమెత్తారు .

తిరుపతిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు .ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ రోజు నుంచి పది రోజుల పాటు తెరిచి ఉంచుతామని ,శాస్త్ర విరుద్ధంగా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా టిటిడి తీసుకొన్న నిర్ణయాన్ని కొందరు పీఠాధిపతులు సమర్థించడం ,మరి కొందరు నోరు మెదపకపోవడం చూస్తే ,రాష్ట్రంలో హిందూమత విశ్వాసాలు ఆచార సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నా  పీఠాధిపతులు అందరూ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం చాలా శోచనీయం అని ఆయన పేర్కొన్నారు .అనాదికాలంగా శాస్త్ర ప్రమాణాలకు లోబడి వస్తున్నా ఉత్తర ద్వార దర్శనం ఆచారాన్ని పదిరోజులపాటు తెరిచి ఉంచితే ఉత్తర ద్వారం ప్రాశస్త్యం  తగ్గిపోవడమే కాకుండా , క్రమక్రమంగా తిరుమల ప్రతిష్టను కూడా దిగజార్చి హిందూ మతాన్ని విశ్వాసాలను దెబ్బతీయడమే భాగంగా ఈ ప్రభుత్వంలో కొందరు చేస్తున్నా ప్రణాళికాబద్ధమైన చర్యలకు  పీఠాధిపతులు *వంత పాడడం ,,చాలా హేయ కరమైన చర్యగా ఆయన అభివర్ణించారు .వైకుంఠ ఏకాదశి పది రోజులు ఉత్తర ద్వారం తెరిచేటట్లు అయితే     వైకుంఠం ద్వాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్ర స్నానం ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు .చక్ర స్నానం చేయిస్తే ఉత్సవాలు ముగింపు పలికినట్లుకాదా అని ఆయన ప్రశ్నించారు .వైకుంఠ ద్వాదశి రోజున శ్రీవారికి చక్రస్నానం చేయించి అప్పటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఉత్తర ద్వారం తెరిచి ఉండటంవల్ల ఆ ద్వారా ప్రవేశ ప్రదక్షిణ చేసే భక్తులకు జరిగే ప్రయోజనం ఏంటో  తెలపాలని ఆయన సూచించారు.

పదిరోజులపాటువైకుంఠద్వారం తెరిచేటట్లు అయితే  ఉత్తర ద్వార దర్శనం మూసే పదవరోజు స్వామివారికి చక్రస్నానం ఎందుకు పెట్టుకోకూడదు అని ఆయన ప్రశ్నించారు .ఈ విషయం పీఠాధిపతులకు తెలియదా అని ఆయన సూటిగా మాట్లాడారు రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రోజురోజుకు దిగజార్చి మంట కలుపుతున్న హిందూ మత పీఠాధిపతులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతు న్నారని ఆయన పీఠాధిపతుల తీరును ఘాటుగా విమర్శించారు ..ఇలా హిందూ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేస్తున్నా పట్టించుకోని పీఠాలు ఎందుకు పీఠాధిపతులు ఎందుకు అని ఆయన మండిపడ్డారు .

ఇప్పటికైనా ఇంకావారం రోజులు సమయం  ఉంది కావున వైకుంఠ ద్వార విశిష్టత  దెబ్బతినకుండా పీఠాధిపతులు అందరూ వైకుంఠద్వార విశిష్టతను ప్రభుత్వానికి వివరించి వైకుంఠ ద్వారం పది రోజులు తెరిచి  ఉంచాలన్నా టిటిడి నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పీఠాధిపతులకు సూచించారు.హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే హిందూ మత విశ్వాసాలను ఆచార సాంప్రదాయాలు నిలబెట్టే వారైతే తక్షణమే ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరారు.

కంచి కామకోటి పీఠాధిపతి,మంత్రాలయం పీఠాధిపతి .త్రిదండి  విశాఖ శారదా పీఠం తదితర పీఠాధిపతులు పది రోజులు ఉత్తర ద్వారం తెరిచి ఉంచవచ్చు అనే విషయాన్ని టీటీడీ పాలకమండలి ఉప సంఘానికి తెలియజెప్పారని,టీటీడీ పాలకమండలి చెబుతున్న విషయాన్ని ఎంతవరకు వాస్తవమో శాస్త్ర ప్రమాణాల ఆధారంగా పీఠాధిపతులు ప్రజలకు  తెలియజేయాలని కోరారు అలా కాకుండా తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కుమ్మక్కై హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే పీఠాధిపతులు కు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు.