కర్షక ఉద్యమంపై కేంద్రం మౌనానికి కారణమేమిటి?

733
అదనుచూసి పావులు కదుపుతున్న అమిత్‌షా

సుమారు రెండు నెలలు నుండి పంజాబ్ రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కేంద్రం ఏమి చేస్తోంది?  అది ఢిల్లీ వచ్చే దాకా ఎందుకు ఎదురు చూసింది? చాలా మంది ఈ ప్రశ్న వేస్తున్నారు..
‘ఆతడు’ సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్లు.. “ఆడు మగాడ్రా బుజ్జి ….ఎవడైనా కోపం తో కొడతాడు , లేదా బలంగా కొడతాడు …వీడేంట్రా చాల శ్రద్దగా కొట్టాడు”…ఇదీ మోడీ, అమిత్ షా, దోవల్ పని విధానం..
ఒక రాష్ట్రంలో శాంతి భద్రత లు ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఒక రాష్ట్రం తనంత తానుగా కోరితే కానీ రాష్ట్ర శాంతి భద్రతల విషయాలలో  కేంద్రం జోక్యం చేసుకోదు. అవసరం అనుకుంటే గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తుంది.  రాష్ట్రం మండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని కూడా సహాయం కోరకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంటుంది. అందుకే పంజాబ్ ఆందోళన లో కేంద్రం జోక్యం చేసుకోలేదు.
ప్రస్తుత పంజాబ్ రైతుల సమస్యకు వారి ఆందోళనకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దత్తు ప్రకటించింది. ఆందోళనకారులు రైలు పట్టాలు మీద కూర్చున్నా, హై వేన్లు బ్లాక్ చేసినా ఎవరిని అరెస్ట్ చెయ్యద్దు అని ఆదేశాలు ఇచ్చి తన రాజ్యాంగ బాధ్యత గాలికి వదిలేసింది.
పండిన పంటలు, ఉత్పత్తి పరిశ్రమలో తయారైన సరుకులు ఈ ఆందోళన వల్ల పంజాబ్ దాటి బయటకు పోలేదు..అలాగే పై ప్రాంతాల నుండి పంజాబ్ లోకి సరుకుల రవాణా కూడా ఆగి సప్లై చెయిన్స్ దెబ్బతిన్నాయి. దాని వల్ల రైతుల వద్ద ఫ్యాక్టరీలు వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దాంతో పంజాబ్ ప్రభుత్వం దిగి వచ్చి గూడ్స్ ట్రైన్స్ నడపమని వాటికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.  కానీ కేంద్రం నడిపితే గూడ్స్ మరియు ప్రయాణీకుల రైళ్లు కూడా నడుపుతాం కానీ ఒక్క గూడ్స్ రైళ్లు నడపడం కుదరదు అని తేల్చి చెప్పింది.
కేంద్ర వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయం అని కూడా పంజాబ్ ప్రభుత్వం చెప్పింది. అలా చెప్పిన తరువాత అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు విరమింప చేయవలసింది. కానీ రాబోయే పంజాబ్ ఎన్నికలను దృస్తిలో ఉంచుకొని ఈ రైతు ఆందోళనల ద్వారా లబ్ది పొందాలి అని ప్రణాళిక రచించినట్లు కనిపిస్తోంది.
పంజాబ్ లో తామే రెచ్చగొట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంక ఈ ఆందోళన కారులను దారిలోకి ఎలా తేవాలో తెలియక పంజాబ్ నుండి ఈ ఆందోళనను ఢిల్లీకి తరలించే ఏర్పాటు చేసింది. దాని వల్ల పంజాబ్ లో ధర్నాలు తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులు తగ్గుతాయి.పంజాబ్ రైతులు ఢిల్లీకి రావడానికి ఇదే కారణం.
సరే…ఢిల్లీకి వచ్చిన ఆందోళనలను కేంద్రం ఎందుకు విరమింపచేయలేదు?
కేంద్రానికి ఎప్పటికి అప్పుడు కేంద్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. వ్యవసాయ బిల్లులు పాస్ అయితే దేశంలో రైతుల రియాక్షన్ ఎలా ఉంటుందో అంచనా వెయ్యకుండానే బిల్లులు పాస్ చేసింది అని అనుకుంటున్నారా?
సెప్టెంబర్ నెలలో పాస్ అయిన బిల్లులపై ఒక్క పంజాబ్ రాష్ట్రం(కాంగ్రెస్ అధికారంలో ఉంది), కొద్దిగా హర్యానాలో తప్ప అపొజిషన్ పార్టీలు ఎంత రెచ్చగొట్టినా గత రెండు నెలలుగా ఏ రాష్ట్రంలోనూ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. అంటే కేంద్రానికి వచ్చిన సమాచారం కరక్టే అన్న మాట.ఆ సంగతి అపొజిషన్ పార్టీలు కూడా గ్రహించాయి. అందుకే ఢిల్లీలో గొడవ చేస్తే ప్రపంచ మీడియా దృష్ఠిలో పడవచ్చు అని పంజాబ్ ఆందోళన ఢిల్లీకి మార్చారు.
జాగ్రత్తగా గమనించి చూస్తే మహారాష్ట్రలోని దళితులను రెచ్చగొట్టడానికి కోరేగావ్ అల్లర్లు,
ఢిల్లీలో ముస్లిమ్స్ ని రెచ్చగొట్టడానికి CAA ఆందోళనలు వెనుక(అర్బన్ నక్సల్స్, దేశంలో ఉన్న జిహాదీ) ఉన్న గ్రూపులే కాక ఇప్పుడు ఖాలిస్తాన్ గ్రూపులు కూడా ఈ రైతు ధర్నాలు వెనుక వున్నాయి.
కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో నూ బిల్లులు వెనక్కి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అవసరం అయితే వీళ్ళను సంతృప్తి పరచడానికి ఒకటి రెండు సవరణలకు ఒప్పుకోవచ్చు.
అమిత్ షా ఏదీ ఊరికే చెయ్యడు. ఏదో కారణం ఉంటుంది. ఈ రైతు ఆందోళన బలవంతంగా అణచకపోవడానికి ఎదో కారణం ఉండవచ్చు. ఈ దేశ లోపలి శాంతి భద్రతలకు మూడు శక్తులు అత్యంత ప్రమాదకరం.
1. నక్సలైట్లు
2. ISI ప్రేరేపిత జిహాదీలు.
3. ISI ప్రేరేపిత ఖాలిస్తాన్ ఉగ్రవాదులు.
మహారాష్ట్రలో భీమా కోరేగావ్ ఆందోళన ద్వారా అర్బన్ నక్సల్స్ ని ఐడెంటిఫై చెయ్యడం జరిగింది. వాళ్లకు డబ్బులు ఎలా వచ్చాయో చానల్స్ గుర్తించారు. ఇక్కడ స్విచ్ ఆపితే అక్కడ అడవుల్లో ఆందోళనలు తగ్గుతాయి అని గుర్తించారు. అలాగే చర్యలు తీసుకున్నారు. చాలా మంది మీద కేస్ లు నడుస్తున్నాయి.
అలాగే CAA/NRC లను అడ్డుపెట్టుకుని ఢిల్లీ తగలెట్టిన దేశ లోపలి PFI వంటి జిహాదీ శక్తులను ఐడెంటిఫై చేశారు. ఆ ఆందోళనకు ఆర్ధికంగా సహాయం చేసిన వారిని గుర్తించారు. చర్యలు మొదలుపెట్టారు. సౌదీ ఏకంగా ఈ CAA NRC ఆందోళన కారులను డిపోర్ట్ కూడా చేసింది. ఇప్పుడు మోడీ కి సౌదీ తో చాల మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ జిహాదీలకు ఫండ్స్ ఫ్లో తగ్గింది. అలాగే పాక్ మీద సౌదీ గట్టి చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ ఈ పరిస్థితి గమనించి పాక్ ను వదిలి ఇప్పుడు  టర్కీ వైపు చూస్తోంది. ఈ మధ్య టర్కీలో కాంగ్రస్ పార్టీ ఓవర్ సీస్ ఆఫీసు ఓపెన్ చేసింది.
పూర్వం పాక్ తరుచుగా వెళ్లే ఆమిర్ ఖాన్ వంటి బాలీవుడ్ వారు ఇప్పుడు టర్కీ వెళ్తున్నారు.
ఇక మిగిలింది ఖాలిస్తాన్ ఉగ్రవాదం. ఇది పాక్ ISI సహాయంతో పంజాబ్ లో చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది. ఇప్పుడు పంజాబ్ రైతుల ఉద్యమం వెనుక నిలబడి ఆర్ధిక నైతిక మద్దత్తు ఇస్తున్న సంస్థలు ఈ భావజాలనికి ఆకర్షితులైన సంస్థలే. వీరికి కెనడా మరియు యూకే లో ఉన్న సిక్కు ఉగ్రవాద సంస్థలు సాయం చేస్తున్నాయి అని బయట పడింది.
ఇప్పటికే 16 మంది మీద NIA ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొన్న బ్రిటన్ లో ఇండియన్ హై కమిషన్ ముట్టడిస్తాం అని ప్రణాళిక వేశారు. కానీ ఒక్కరు కూడా ఆ ప్రోగ్రాం కి అటెండ్ కాలేదు.
ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగిన అన్ని రోజులు కేంద్రం ఏ ప్రత్యక్ష చర్యలు తీసుకోదు. ఒక సారి హింసాత్మకంగా మారిన మరుక్షణం అన్ని మూలాల తవ్వుతారు.
ఆ పరిస్థితి కి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చు. సాధారణ రైతులు ఇప్పుడు ఉద్యమం విరమిద్దాం అనుకున్నా ప్రస్తుతం ఉద్యమం వారి చేతుల్లో లేదు. నక్సల్, జిహాదీ ఖాలిస్తాన్ వాదుల చేతుల్లోకి పోయింది. సాధారణ రైతు సంఘాలు మొండి పట్టుకు పోకుండా ఏదో చర్చలు ద్వారా సమస్య పరిష్కారం కోసం హామీ తీసుకొని ఆందోళన విరమిస్తే శాంతి..లేదా కొన్ని రోజులు అల్లర్లు తప్పవు…సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

– సాంబశివరావు