కాశీ కాశీ పాపవినాశి!

679

కాశీ కాశీ అంటేనే పాపం వినాశ మోతుందని అర్ధం . ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్తే  పుణ్యమస్తుందంటారు కాని  కొన్ని వేల జన్మలు పుణ్యం చేస్తే కాని కాశీలో కాలు పెట్టలేరు . అందుకే పుణ్యకాశీ  ఆనే పేరు వచ్చినది . పధ్నాలుగు భువనాల్లో , ముల్లోకాల్లో కాశీతో సమానమైన క్షేత్రమే లేదు . పరమేశ్వరుడైన శివుడు అనునిత్యం నిద్రించేది కాశీలోనే . బ్రహ్మ సృష్టి ఆరంభిచినది కాశీనుండే , సూర్యుని తొలి కిరణం ప్రసరించినది కాశీలోనే , శ్రీమహావిష్ణువు  తొలి పాదం మోపింది కాశీలోనే ,  రావణాసురుడిని వధించినందుకు  శ్రీరామచంద్రుడంతటి వాడు బ్రహ్మ హత్యా పాతకము నివారించుటకు కాశీలోనే శివలింగమును  ప్రతిష్టించారు  ఈప్రాంతమును  రామేశ్వరమని అంటారు . వైష్ణవులు కాశీకి రాకూడదనే నియమము ఎక్కడా  లేనేలేదు  ఇలాంటి దుష్ప్రచారము చేసే దొంగస్వాముల మాటలు  నమ్మటం  మానవుని అజ్ఞానము మాత్రమే.

ఏ మతం వారైనా  ఏ సాంప్రదాయం వారైనా కాశీకి రావచ్చును .  యావత్ ప్రపంచమునకు ఆధ్యాత్మిక కేంద్రం కాశీక్ష్షేత్రం .   పరమేశ్వరుని త్రిశూలం మీద ఉంటుంది కాశీఖండం మహా ప్రళయమొచ్చినా  చెక్కుచెదరనిది కాశీఖండం .  శివుని యొక్క జటాఝాటము నుండి కంఠము వరకు  ఓంకారఖండము , కంఠము నుండి జఠరము వరకు విశ్వనాధఖండము , జఠరము నుండి పాదముల వరకు కేదారఖండము .కాశీలో పంచక్రోశీ పరిక్రమ మరియి గంగ దాటకుండా  9 నెలల 9 రోజులుండటాన్ని గర్భావాసం అంటారు అలా ఉంటే మాతృ ఋణం తీరటంతో పాటు మరుజన్మ ఉండదు . పరమేశ్వరుని తొలి అవతారం  దక్షిణామూర్తి మలి అవతారం కాలభైరవుడు .  పంచముఖ బ్రహ్మకు అహంకారము పెరిగినప్పుడు బ్రహ్మ యొక్క ఐదవశిరస్సు కాలభైరవుని ఎడమచేతి బ్రొటనవేలి గోటితో ఖండించాడు  ఆ సమయంలో కాలభైరవుని చేతినుండి బ్రహ్మ శిరస్సు విడిపోదు కాలభైరవుడు కాశీకి చేరిన మరు క్షణం బ్రహ్మ శిరస్సు నేల మీద పడుతుంది అప్పటి నుండి కర్మవిమోచన క్షేత్రముగా పిలువబడుతుంది . అప్పటి నుండే కాలభైరవుడు కాశీని స్ధిరనివాసంగా ఏర్పరచుకున్నారు .  అంతుపట్టని సమస్యలున్నప్పుడు  జ్యోతిష్యులు కుండలి లో కర్మస్ధానము  పరిశీలించి   ఒక్కసారి కాశీకి వెళ్ళిరమ్మని  హితవు చెబుతారు . కర్మ అడ్డు పడుతున్నప్పుడు ఒక్కోసారి  జాతకం లోని యోగము కూడా పనిచేయదంటారు .

నవగ్రహ దోష పరిహారములకు  దేశమంతా తిరగవలసిన పని లేదు ప్రతి పరిహారమునకు పరిష్కారము కాశీలో కలదు .  పితృదోష నివారణ  , పితృశాప , గురుదోష నివారణ పరిహారమునకు  కాశీని మించిన క్షేత్రమే లేదు . ఈ దోషములకు కర్ణాటక లోని  గోకర్ణక్షేత్రములో నారాయణబలిపూజ చేయించవలెన్న ఖర్చు షుమారు ఇరవై  వేలకు పైమాటే కాని కాశీలో పిశాచకుండ్ నందు చేసే కార్యక్రమునకు షుమారు పదివేలు అవుతుంది .  మిడిమిడి  జ్ఞానంతో  చెప్పే జ్యోతిష్యం చెప్పే వారిని ఆశ్రయించటం  మోసపోవటం కూడా  ఒకరకమైన కర్మలాంటిదే .

ఎవరి అస్ధికలు కాశీలో నిమజ్జనం చేస్తే వారు మరుజన్మలో  కాశీలో జన్మిస్తారు . కాశీ గురించి  పరిపూర్ణముగా తెలుసుకుంటం మానవునికి ఒక జన్మ చాలదని చెబుతారు . కాశీని మహాస్మశానమంటారు ఆ ఉద్ధేశ్యంతో పూర్వము నుండి కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా  అనే సామెత వచ్చినది . దాని పరమార్ధం తెలియక కొంత మంది  కాశీకి  రావటానికి సంకోచిస్తారు .