చలికాలంలో ఆస్తమా ఉన్న వారు జర భద్రం..  

386
Asthma vector icon illustration

చలికాలంలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, జాగింగ్‌ చేసేవాళ్లు, ఆస్తమా, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇబ్బందిపడతారు. చల్లటి గాలులు శరీరం తెల్లగా పొడిబారినట్టు మారుతుంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతి హీనంగా మారుతుంది. అరికాళ్లు పగిలి ఇబ్బంది పెడ తాయి. శరీరంలో తేమ శాతం తగ్గిపోయి దురదలు వస్తాయి. ముఖంపై పగుళ్లు చోటు చేసుకుంటాయి. అరతే కాకుండా చేతులపై పగుళ్ల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయి. ఈ కాలంలో ఇంటి పనులు, ఆఫీసులో పనులతో చాలా ఇబ్బంది పడుతుంటారు.
పరీక్షా కాలం : తేమశాతం తగ్గడం వల్ల మహిళల్లో హార్మోన్‌కు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మధుమేహం, థైరాయిడ్‌ ఉన్న వారికి ఇది ఒక పరీక్షా కాలం. అరచేతులు పగిలిపోతాయి. ఈ కాలంలో వినియోగించే సబ్బులు, షాంపూ, దుస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

చేతులు,పాదాలు పగిలితే :
చలికి చేతులు, పాదాలు పగులుతుంటాయి. అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో కొద్దిసేపు పాదాలు ఉంచి తీయాలి. గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచడం వల్ల అలసట తగ్గి పోతుంది. అరచేతులు, వేళ్ల సందుల్లో పగుళ్లు ఉంటే కూడా ఈ పద్ధతి పాటించవచ్చు.

జాగింగ్ ‌చేసేవారుకు జాగ్రత్తలు  :
– తెల్లవారు జామున 5 గంటల నుంచి 6 గంటల మధ్య జాగింగ్‌ చేయవద్దు.
– చెట్టు ఉన్న ప్రాంతాలలో కాకుండా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో జాగింగ్‌ చేయాలి.
– తలకు మంకీటోపీలు ధరించాలి. చెవుల్లో దూది పెట్టుకోవాలి.
– వాకింగ్‌ చేసే వారు షూ, సాక్స్‌ వేసుకోవాలి.

వృద్ధులు పాటించాల్సిన పద్ధతులు :
– చల్లటి వాతావరణంలో జాగింగ్‌ చేయవద్దు.
– మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల తో బాధ పడేవాళ్లు ముందుగా వ్యాక్సిన్‌ వేసు కోవాలి. దగ్గు, జలుబు రెండు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్‌ను కలవాలి. పండ్లు ఎక్కువగా తీసు కోవాలి. వాజిలిన్‌, క్రీమ్‌, పెట్రోలియం జెల్లి, వంటి వాటిని వినియోగించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

అందరూ పాటించాల్సిన పద్ధతులు :
– గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
– వేడినీటితో తల స్నానం చెయొద్దు.
జుట్టును వదులుగా ఉంచుకోవాలి.
స్నానానికి సున్నిపిండి, శనగపిండి ఉప యోగించాలి. స్నానం చేయగానే పొడిగుడ్డతో తుడుచుకొని మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. పెదవులకు లిప్‌క్రీమ్‌ వినియోగించాలి. వాహ నాలు నడిపేవాళ్లు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి.

ఆస్తమా బాధితులకు సూచనలు :
– దగ్గు జలుబు ఉన్న వారికి దూరంగా ఉండాలి.
ఎక్కువగా చలిగా ఉండే సమయంలో బయట తిరగొద్దు. నిద్ర లేవగానే చల్లటి ప్రదేశంలోకి వెళ్లొద్దు. మందుల వాడకంలో నిర్లక్ష్యం చెయవద్దు.చలికాలంలో ఆస్తమా వచ్చే అవకాశం ఉన్న వాళ్లు ముందుగానే మందులు వేసుకోవాలి.
జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మందులు
ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి.

దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ… ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసాలి.
భారంగ్యాది_చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో  కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది.
శృంగారాభ్రరస_మాత్రలు: ఉదయం 1, రాత్రి 1  అగస్త్యహరీతకీ రసాయన
(లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి.
ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది  ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం.

                                                                                                    -నవీన్ నడిమింటి
                                                                                                                  9703706660