నేతిబీరకాయలన్నీ కట్టగట్టుకొని పోయి,నూతిలో పడ్డాయట

221

కేంద్రం APMC వ్యవస్థను నీరుగార్చటానికే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చింది.కచ్చితంగా అడ్డుకుంటాం ౼ వామపక్ష కూటమి
APMC  శాశ్వతంగా ఉంటుందని, కనీస మద్దతు ధర ఉంటుందని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలు.
౼ వామపక్ష ప్రగతిశీల కూటమి
నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి.అందుకే రైతు చట్టాల పేరుతో మార్కెట్ వ్యవస్థను APMC ని నాశనం చేయాలని చూస్తుంది.
౼ వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర కూటమి
కార్పోరేట్లకు అప్పనంగా రైతు పంటను దోచిపెట్టడానికే రైతుచట్టాలు.
౼ వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర లౌకిక కూటమి
మార్కెట్ కమిటీలు APMCs రద్దు చేయమంటూ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందే.
౼ ప్రగతిశీల ప్రజాతంత్ర లౌకిక వామపక్ష కూటమి
అంబానీ ఆదానీలు మొదట్లో రైతులకు ఎక్కువ ధర ఆశపెట్టి ఎవరినీ మార్కెట్ కు పోకుండా చేసి కొన్నేళ్ళకు APMC పూర్తిగా మూతపడేటట్లు చేసే కుట్రే ఈ రైతు చట్టాలు.
౼ ప్రగతిశీల ప్రజాతంత్ర లౌకిక వామపక్ష విప్లవ కూటమి
MSP, APMC లు కొనసాగిస్తామని లిఖిత పూర్వక హామీకి ప్రభుత్వం ఒప్పుకుంటేనే ప్రభుత్వంతో చర్యలు.
౼ ప్రగతిశీల ప్రజాతంత్ర లౌకిక వామపక్ష విప్లవ మహిళా సమాఖ్య
MSP, APMC లపై ప్రభుత్వం లిఖిత పూర్వక హామీకి అంగీకరించినంత మాత్రాన సరిపోదు రైతుచట్టాలు వెనక్కు తీసుకోవాల్సిందే.
౼ ప్రగతిశీల ప్రజాతంత్ర వామపక్ష విప్లవ రైతు పోరాట సమితి
అబ్బా…
ఇంకెన్ని ప్రగతిశీలాలున్నాయి Sir …వినీ వినీ విసుగొచ్చేస్తుంది …..మీరు కూడా అలా అంటే ఎలా చికెన్ పారాయణ గారూ..?చిన్నప్పట్నుండి ప్రగతిశీలం ప్రజారాజ్యం మంటూ గజ్జెకట్టి ఎగిరినోడివి…ఇప్పుడు నేను రాసినవన్నీ… మొత్తం వామపక్షాల గ్రూపుల్లో దొవ్వాణా కాదు. ఏకాణా కూడా కాదు…
మొత్తం దాదాపు వందవరకుంటాయి తెల్సిందా…?ఓహ్ Great Sir… దేశమంతా కలిసి వందనుకుంటున్నారా ఏందీ …? అయితే…,  మీరు కాలే కాలే పప్పులో కాలేసినట్లే.దాదాపు అలాంటి పేర్లతోనే…, పంజాబ్ లో వంద ఉంటాయి. బీహార్ లో వంద ఉంటాయి.
బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర,…. ఇలా అన్నిచోట్లా కనీసం వందకు తగ్గకుండా ఉంటాయి తెల్సిందా…
మరి వాటిమధ్య సత్సంబంధాలు లేవా Sir,…?
ఓహ్ లేకపోవడమేంటి Mr.చికెన్ పారాయణ గారూ..ప్రతీ సమాఖ్య మిగిలిన 999 సమాఖ్యలను….. బూర్జువా , భూస్వామ్య, పెట్టుబడిదారుల తొత్తు, దోపిడీ సంఘం అంటూ మరీ ముద్దుగా పిలుసుకుంటుంటారు కూడా…అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్య మా వామపక్షాలదే అన్నమాట …  చిన్నప్పట్నుండీ గజ్జెకట్టి ఎగిరినందుకు ఈ స్థాయికి వచ్చిందంటూ ఆనందంగా ఎగిరి గంతేసాడు చికెన్ పారాయణ..
See Mr.చికెన్ పారాయణ గారూ…
నీకు ఆకలెక్కువే ఆవేశం ఎక్కువే… కానీ, ఆలోచనే తక్కువోయ్ …మొత్తం దేశంలో వెయ్యికి పైగా వామపక్ష కూటములు ఉన్నాయన్నానే గానీ…, Total గా ఎంతమందో నేనేం Reveal చేయలేదే ..Tension పెట్టకుండా చెప్పండి Sir… మొత్తం దేశంలో ఇన్ని కూటముల్లో కలిసి ఎన్ని లక్షలమంది ఉండొచ్చంటావ్  ?
లెక్కబెట్టడం చాలా Simple వోయ్ చికెన్ పారాయణా…అన్ని కూటములకూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొరికారట కానీ,… కానీ,… కానీ,…సగానికిపైగా సంఘాలకు ఇప్పటికీ మూడవ నాల్గవ స్థానాలే ఖాళీగా ఉన్నాయట… కారణం కూడా చాలా Simple వోయ్… మూడవ నాల్గవ స్థానంలో ఎవరుంటారంటూ బయటపడి…,
ఈ బూర్జువా సంఘాలతో విప్లవం వచ్చేదీలేదు సచ్చేదీలేదంటూ…., వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల విప్లవ, రైతు, కార్మిక, కర్షక, లౌకిక, సమాఖ్య, మహిళా, పీడిత, తాడిత, అభ్యుదయ, మావోయిస్టు, లెనినిస్టు, మార్క్స్, కూటమి,…ఇవే పదాలను అటుఇటు ఇటుఅటు మారుస్తూ…,వెంటనే కొత్త కూటమి పెట్టి…,
Number 1, Number 2, స్థానాలు చేజిక్కించుకుంటూ తమలోని నిజమైన విప్లవ స్పూర్తిని చాటుకుంటున్నారట

సరే Sir,
మరి, ఇన్నిరకాల వామపక్ష విప్లవ కూటముల ఒత్తిడికి కేంద్రప్రభుత్వం తప్పకుండా తలవంచి ఉంటుందనుకుంటా …? ఏంది వంచేది పారాయణ గారూ…?
ముందుగా మీ ప్రగతిశీల కూటమి పాలిస్తున్న కేరళలో…, APMC ఉంటేవెతికి పట్టుకురా పోండి అని పంపించిందట…అన్నీ వెళ్లి…..,అరవంలో ఎంత అరచినా ఫలితం లేదట…
ఒక్క APMC కనపడితే ఒట్టు.ఉంటే కనబడుతుంది గానీ లేనిదెక్కడినుండి కనబడుతుందంటూ అసలైన రైతులంతా ముసిముసిగా నవ్వుకుంటున్నారట
అవును మరి…., మనసంతా Tukde Tukde Gang పై పెట్టి, మనువు రైతులతో చేస్తున్న మీ బూటకపు ఉద్యమాలు UTTER FLOP కాకుంటే BETTER SHOWS ఐతాయా ఏంది ..?

 – నర్రా