దేవాదాయశాఖమంత్రి వ్యాఖ్యలపై భాజపా నిరసన

478

కాకినాడ : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ యువమోర్చ సురేంద్రమోహన్ పిలుపుమేరకు ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.  కాకినాడ జిల్లా చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ యువ మోర్చా అనపర్తి వెంకటేష్  ఆధ్వర్యంలో కాకినాడ అచ్చుతాపురం రైల్వే గేట్ వద్ద ధర్నా జరిగింది.

రాష్ట్ర  దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్గాలను  సుందరీకరణ చేస్తామని మరియు  దర్గాలను  కట్టిస్తామని చేసిన వ్యాఖ్యలు చెప్పడం ఏదైతే ఉందో అత్యంత దారుణమైనవని భాజపా నాయకులు అన్నారు.ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పై విధంగా చేయొచ్చు కానీ దేవాదాయ శాఖ మంత్రిగా దర్గాలు కట్టిస్తాం చర్చిలు  కట్టిస్తాం అని చెప్పడం ఏవిధంగా కూడా సమర్ధనీయం కాదన్నారు. మంత్రి దేవాదాయ ,ధర్మాదాయ శాఖ కి రాజీనామా చేసి దర్గాలైనా కట్టించుకోవచ్చు లేదా మసీదు లైన కట్టించుకోవచ్చు లేదా చర్చి లైన తన సొంత నిర్ణయంతో కట్టించుకోవచ్చునని,కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గా ఉంటూ అన్య మతాలకి ఈ విధంగా కట్టిస్తాం అని చెప్పడం భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ సాలిగ్రామం లక్ష్మీ ప్రసన్న, జి కళ్యాణ్ కుమార్, కర్రీ సత్యనారాయణ రాజు, రమేషు, ముసల గంటి సురేషు, కవికొండల భీమశంకర్, మండల అధ్యక్షులు గౌతు చిన్న, బెస్ట్ మండలం అధ్యక్షులు మూర్తి,ఆకొండి సునీల్, మామిడాల శ్రీనివాస్, విజయ రామయ్య,పితానీ  లీల తదితరులు పాల్గొన్నారు.