రైతే రాజు.. 

1128

రైతులను దోచుకునే దళారీ కోసం..మరో దళారీ  ఎందుకు?

గ్రామస్వరాజ్యంతోనే శ్రీరామరాజ్యం సాధ్యం అని స్వతంత్ర్యం సిద్దించిన నాటి నుండి నేటివరకు దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతులను ఆకర్షించడానికి వెల్లబుచ్చిన  సూక్తులు నేటి మీద వ్రాతలుగానే నిలిచాయి. మాజీ ప్రధాని స్వర్గీయ  లాల్ బహుదూర్ శాస్త్రీ “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో సరిహద్దుల వెంట దేశ భద్రత కోసం త్యాగాలు చేసే సైనికులతోబాటు దేశంలో ప్రజల ఆహర భద్రత కోసం పరిశ్రమించే రైతాంగానికి  స్పూర్తి నిలిపారు. అయతే కాలక్రమేణ అన్నదాతకు అన్నం కరువై, అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యం అన్నరీతిన పరిస్థితులు సృష్టించిన వ్యవస్థలు ఆహర మరియ నిత్యావసర వస్తువుల మార్కెట్ల ధరలకు రైతుకు అందే ఫలసాయం మధ్య అంతరంగా “మధ్యవర్తుల రూపంలో ఏర్పడిన దళారీ వ్యవస్థ” చక్రబంధంలో ఒకవైపున రైతులు నష్టాలలో నలిగిపోయారు,
మరోవంక వినియోగదారుల రూపంలో ప్రజలు నష్టపోయిన విషయం విదితమే. గడచిన 70 సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో ప్రతి రాజకీయ పక్షం, రైతు సంఘాలు, సామాజిక కార్యకర్తలు నేటి వరకు పాలకులను ప్రశ్నించిన అంశం ఒక్కటే, ఏదైన వస్తువు ఉత్పత్తి చేసిన లేదా సేవలను అందిస్తున్న సంస్థ లేదా వ్యక్తి స్వేచ్ఛ గా దేశంలో ఎక్కడైన వారు నిర్ణయించిన ధరలకు మార్కెటింగ్ చేసుకోగలుగుతుంటే, రైతు పండించిన పంటకు రైతుకు ముందుగానే ధర ఎందుకు తెలియడం లేదు మరియ స్వేచ్ఛ గా దేశంలో తమకు నచ్చిన ప్రాంతాలలో తమ ఉత్పత్తులను ఎందుకు మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు, అలాగే అసంఘటిత దళారుల కమీషన్ వ్యవస్థ రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకుండా, దేశం మొత్తం చైన్ గా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసేవారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలనే తలంపుతో గడచిన ఆరు సంవత్సరాల్లో అనేక సంస్కరణలను అమలు పరచారు, చట్టాలు చేశారు. ముఖ్యంగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో భూసార పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేక మౌలిక సదుపాయాలతో కూడిన విధానాలను ప్రవేశపెట్టి భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించడం వల్ల, రైతులు ఏ పంట వేస్తే నాణ్యతతో కూడిన అధిక దిగుబడి వస్తుందన్న అవగాహన కల్పించడమే కాకుండా, వారికి అవసరమైన సాంకేతిక పరిఙ్ఞనం పై అవగాహన కల్పించడం ద్వార రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు వేసిన ప్రణాళిక ద్వార నేడు సానుకూల ఫలితాలకు సాధ్యమవుతుంది.

ఎరువుల ధరల నియంత్రణ మరియ వేప పూతతో ఎరువుల సప్లై చేయడం ద్వార నకిలీ ఎరువుల వ్యాపారం చేసే దొంగలకు చెక్ పెట్టడం, గంటలకొద్ది క్యూలలో యద్దలు లేకుండా, కొరత లేకుండా సకాలంలో రైతులకు ఎరువులను అందేవిధంగా చేయడం మరియ సకాలంలో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను చట్టాలు చేసే చేసేవిధంగా ప్రోత్సాహించారు. రైతులను ప్రతికూల పరిస్థితుల నుండి బయటవేసి ఆదుకోవడానికి  ఫసల్ బీమా యోజనను సమర్థవంతంగా అమలు చేశారు.రైతులకు పెట్టుబడి సాయం క్రింద 75 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వార సంవత్సరానికి ఆరు వేల రూపాయలను 12.50 కోట్ల రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం చారిత్రాత్మకం. వీటిని కొనసాగిస్తూనే, 2019 లో మరల అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన మరింత వేగంగా రైతుల ఆదాయం స్వామినాధన్ కమీషన్ సిఫార్సు మేరకు పెట్టుబడికి 50% అధనంగా వచ్చేవిధంగా  మరియ వినియోగదారుల కు చౌకగా వ్యవసాయ ఉత్పత్తులు అందించేందుకు రెండు నూతన చట్టాలను తేవడంతోబాటు, వినియోగదారుల రక్షణ చట్టంకు అవసరమైన సవరణలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది.

పార్లమెంట్ ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలలో, “రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక ( ప్రోత్సాహం – సౌలభ్యం ) చట్టం” 2020 ద్వార : రైతులు తమ ఫలసాయాన్ని వారు ఉత్పత్తి చేసిన రాష్ట్రంలో కాని లేదా దేశంలో ఎక్కడైన ఎటువంటి ఆటంకం లేకుండా అమ్ముకునే వెసులుబాటు కల్పించడంతో, స్వేచ్ఛగా రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ లేదా మండీల వెలుపల వారికి నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు కలిగింది. దీనివల్ల, రైతులకు మంచి ధర రావడమే కాకుండా రవాణా మరియ పన్నులు/లైసెన్స్ ఫీజులు వల్ల కలిగే ఆర్థిక భారంలో బాగా తగ్గుదల కనబడుతుంది,
పంజాబ్ వంటి రాష్ట్రాలలో పన్నుల వసూళ్లు 8% వరకు ఉంది. ఈ చట్టం ద్వార నిర్వహణ సౌలభ్యం కోసం ఈ-ట్రేడింగ్ ద్వార తమ ఉత్పత్తులను తేలికగా ఇతరులకు అమ్ముకునే అవకాశం అన్నదాత కి కలిగింది. దీనికి రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏవరైతే రైతుల నుండి కొనుగోలు మార్కెటింగ్ లో భాగస్వామ్యం అవుతారో, వారే కల్పించాల్సి ఉంది.  అలాగే, రెండవ చట్టం ” రైతు ( సాధికారత-రక్షణ ) ధరల భరోస ఒప్పందం- వ్యవసాయ సేవ చట్టం 2020 ద్వార “ఒకే దేశం – ఒకే వ్యవసాయ మార్కెట్” కు అంకురం ఏర్పడి, రైతులు నేరుగా వ్యవసాయ ఆధారిత వ్యాపార సంస్థలు, టోకు మరియ చిల్లర వర్తకులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారులు తో అమ్మకాల లావాదేవీలు నెరపేందుకు మార్గం సుగమం అవ్వడం అయ్యింది. రైతులు ఆయా సంస్థలతో చేసుకునే  ఓప్పందాలకు రక్షణ కల్పంచడమే కాక, ఉత్పత్తుల అమ్మకాలు జరిగిన మూడు రోజులలో రైతులకు చెల్లింపులు జరిగే విధంగా చట్టం చేయడమైనది.

రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసిన సంస్థలు ఓప్పందాల అమలులో ఇబ్బందులు వస్తే, పరిష్కారానికి జిల్లాస్థాయి అధికారులకు భాద్యతలు ఇవ్వడం జరిగింది. రైతులకు మరియ సంస్థల మధ్య ఓప్పందాల ద్వరా రైతులకు ఆధునిక సాంకేతిక పరిఙ్ఞనం తో పాటు నాణ్యమైన విత్తనాలు మరియ ఎరువుల మొదలైన సేవలను పొందడమే కాకుండ ముందుగానే రైతు తమ ఉత్పత్తి ధర నిర్ణయించుకోవడం ద్వార తమ ఆదాయం పెంచుకొవచ్చు. ఈ నూతన చట్టాలతోపాటు, వినియోగదారుల రక్షణ చట్టం సవరణ ద్వరా వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ దిగుమతులపై నియంత్రణ మరియ వివిధ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నిల్వల పై ఆంక్షలు పై అనేక మార్పులను చేయడం జరిగింది.

మన దేశంలో రైతులకు అధిక దిగుబడి వచ్చినప్పుడు లేదా ఇతర దేశాల నుండి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు అధిక మొత్తంలో దిగుమతులు అయినప్పుడు మన రైతులు త్రీవ్రంగా నష్టపోయేవారు, రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఖనీస మద్దతు ధరలను ప్రకటించి ధాన్యం, పప్పు దినుసులు, మొక్కజొన్న తదితర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార అర్హులైన పేద ప్రజలకు రేషన్ అందిస్తుంది. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వలు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వార, మండీల ద్వార మరియ మార్క్ ఫెడ్ ద్వరా ఇలా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరచి రాష్ట్రాలకు అర్హమైన ధామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పై సప్లై చేస్తోంది.

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల పై ప్రకటించే ఖనీస మద్ధతు ధరను కొనసాగిస్తున్నట్లు ఈ చట్టంలోనే పేర్కొనడం మరియ గతంలో ఎన్నడు లేని విధంగా ఖనీస మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో, ప్రతిపక్ష పార్టీలు ఖనీస మద్దతు ధర ఈ చట్టాలతో రద్దు అవుతుందన్న దుష్ప్రచారం పటాపంచలు అయ్యాక వారి వాదన మసకబారింది, అలాగే రాష్ట్రాలలో స్థానిక వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతాయని చట్టంలో పేర్కొనడంతో, వాటిని మూత వేస్తారనే మరో దుష్ప్రచారం కూడా పటాపంచలై వారి వాదనలో పసలేదని నిరూపితమైయ్యంది. ఈ చట్టల అమలులో రాష్ట్రప్రభుత్వల బాధ్యత చాల కీలకమైనది, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతుల ఆదాయ వృద్ది కోసం ఈ చట్టాలు తేవడం ద్వార తమ సంకల్పాన్ని వాస్తవం చేశారు, ఇక ఈ చట్టాలను సరిగా అమలు చేయడం ద్వరా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పై తమ చిత్తశుద్ది చాటాలి.

కాంగ్రేస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టో లో రైతులను ఆదుకోవడానికి పెట్టిన అంశాలే నేడు చట్టరూపంలోకి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాస్తవం చేస్తూ ” రైతే రాజు ” అంటుంటే, అసహనంతో సహవాసం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ చట్టాలను తూర్పార పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ పత్రం పై మాత్రమే,కారణం కాంగ్రెస్ పార్టీ రైతులను దోచుకుంటున్న మధ్యవర్తుల కోసం మధ్యవర్తిగా వ్యవహరించాలనే తన స్వభావాన్ని అవిష్కరిస్తూంది – బిజెపి కమిట్మెంట్ వాస్తవ ఫలితాల సాధన దిశగా అడుగులు వేయడమని తేలిపోయింది.ఈ క్రింది వాస్తవాలు పరిశీలించాక కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేక బంద్ ను సమర్ధిస్తారో లేక వ్యతిరేకిస్తారో ఒక నిర్ణయానికి రండి.

గోధుమలను కొనడంలో ప్రభుత్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది?
రూ.75వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొరేట్‌ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది. ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2 మిలియన్‌ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. మహీంద్రా గ్రూప్‌ కూడా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించింది. నెస్లే, గోద్రెజ్‌లాంటి బడా ప్రైవేట్‌ కంపెనీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.

ఈ-చౌపాల్‌ కేస్ స్టడీ:
ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలో ఈ-చౌపాల్‌ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్‌ సహకారంతో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్‌ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది.
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్‌ మోడల్‌ గ్రామాల్లో ఇంటర్నెట్‌ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది. చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చేసుకోవడంలో ఇది మెలకువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది.

ఈ-చౌపాల్‌ మోడల్ ఎలా పనిచేస్తుంది?
అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతంలో సోయాబీన్‌ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం ఒకరు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్ పథకం గురించి విని, అతను ఈ-చౌపాల్‌ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాడు. ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూటర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్‌ ధరల గురించి వివరించడం గమనించాడు.ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్‌ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే.రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్‌ తయారు చేసి గ్రామాల్లో రైతులకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు, సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.

కానీ ఈ 20 సంవత్సరాల కాలంలో  ఒక సంస్థ రైతులను మోసం చేయాలనుకున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. కాని నేడు నూతన వ్యవసాయ చట్టం ద్వారా  రైతులు అమ్మిన ఉత్పత్తి కి కొనుగోలుదారుల చెల్లింపులు మరియు చెల్లింపుల కాలపరిమితి పై చట్టపరమైన రక్షణ కేంద్ర ప్రభుత్వం రైతులకు కల్పించింది.
ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40 లక్షలమంది రైతుల నెట్‌వర్క్‌గా మారింది. 10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్‌ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఈ-చౌపాల్‌ ఒక మోడల్‌. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్ గ్రూప్‌లైన అంబానీలు, అదానీలు వ్యవసాయరంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది, కాబట్టి రైతులు వ్యతిరేకిస్తున్నారు అనే వాదనతో రెచ్చగొట్టడం సరైనది కాదు. కారణం, దేనినైనా వ్యతిరేకించే ముందు ఇటువంటి ఉదాహరణలు చెప్పి వాస్తవాలు కప్పిపుచ్చడానికి అలవాటుగా ఏడమ వాటం పార్టీలకు రివాజుగా మారింది. ట్రై పార్టీ అగ్రిమెంట్ ద్వారా గ్రామాలలో జరిపే పాలసేకరణలో ఏలా ఉత్పత్తిదారులు అలవాటు పడ్డారో, అలాంటి పరిస్థితే “ఏఫ్ పీ” ఓ ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కట్టుదిట్టమైన నిభంధనల ప్రకారం జరుగుతాయి.

వ్యవసాయంలో పెను మార్పులు
గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటు శక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి. టెక్నాలజీ, కొత్త విత్తనాలు, నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసాయాభివృద్ధికి కారణం. ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించాయి. కానీ ఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్‌ వినిపించింది, దానిలో భాగంగా నేడు నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వకాలంలో ఈ కొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కానీ, నేడు అదే కాంగ్రెస్స్ పార్టీ రాజకీయ లబ్ది కోసం రైతులను రెచ్చగొట్టడంలో బాగా బిజీ అయ్యింది.

ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్‌ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతున్నారు అనేది సత్యం, దానిలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలలో రైతుల కోసం అనేక రక్షణాత్మక నిభంధనలు ఉన్నాయి.
అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చింది, తమను పరిగణనలోకి తీసుకోకుండా, హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారని ప్రచారం చేస్తున్న వామపక్ష మరియు కాంగ్రెస్స్  అనుకూలురు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాని రైతుల శ్రేయస్సు కోసం మాత్రం కాదు.

కనీస మద్దతు ధర కేవలం 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం, భవిష్యత్తు అనిశ్చితి భయం వల్ల కనీస మద్దతు ధర ప్రారంభ ప్రామాణిక ధరగా నూతన వ్యవసాయ చట్టాలలో పొందుపరచాలనే వాదన్ని అర్థం చేసుకోవచ్చు. అయతే కనీస మద్దతు ధర  ఇప్పుడు 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే ఉంది.
వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్‌ అంటున్నారు. ఇదే నిజమైతే ఐటిసీ రైతులతో చేసుకున్న ఒప్పందాలు విజయవంతంగా అమలు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలతో మరింత రక్షణ రైతుల ఉత్పత్తి అమ్మకాల పై ఏర్పాటు చేయబడింది. కేవలం రాజకీయ ప్రోద్బలంతో రైతులను రెచ్చగొట్టడం ద్వారా వాస్తవాలు తొక్కిపెట్టడం వల్ల రైతులకు అన్యాయం చేసిన వారవుతారు.

-లంకా దినకర్ (బికాం., ఎఫ్. సి.ఏ.)

2 COMMENTS