తెలంగాణలో మళ్లీ జగన్‌…

362

ఆంద్రజ్యోతి రాధా కృష్ణ వండివార్చిన వార్త..!!

ఆంధ్రజ్యోతికి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అక్కర్లేదు.  రాధాకృష్ణకు  తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు అక్కర్లేదు.  రాధాకృష్ణకు కావాల్సింది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు. నారావారి రాజకీయ ప్రయోజనాల కోసం రాధా కృష్ణ ఎంత నీచపు రాతలకైనా పాల్పడతారు. అమ్మలాంటి అక్షరానికి చేతబడి కూడా చేయిస్తారు. మన దేశాన్ని యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అని భారత రాజ్యాంగం చెబుతోంది. భారత దేశ ప్రజాస్వామ్యానికి సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తి సమాఖ్య కాదు. కేంద్రం మీదనే రాష్ట్రాలు ఆధార పడాలి.

కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత,బంగారు బాతులాంటి హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. 2014 -19 లో చంద్రబాబు దోపిడీ, అరాచక, అవినీతి పాలనతో ఏపీ మరింత ఆర్ధికంగా నష్టపోయింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తమైంది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టేనాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో  కేవలం రూ.100 కోట్ల రూపాయలు ఉన్నాయంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దివాళ ఆర్ధిక  వ్యవస్థ నుంచి ఏపీని కాపాడటానికి సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ఆర్ధిక  క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాసొమ్మకు కాపలాదారుగా ఉన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సక్రమంగా ఉపయోగిస్తూ రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

ఎక్కడా కూడా నిధుల్లేవు అనే మాట రాకుండా జాగ్రత్త పడుతూ పాలనా రధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తన 18 నెలల పాలనలోనే దేశంలోనే బెస్ట్ సీఎంల్లో ఒకరిగా నిలిచారు. కారణం..ఆర్ధిక క్రమశిక్షణతో, కేంద్రంతో మంచి స్నేహంతో తన పనులు తెలివిగా చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో ఏమాత్రం అనుభవంలేకపోయినా దేశంలో తలపండిన సీఎంలు శభాష్ జగన్‌ అనేలా పాలనా రథాన్ని నడిపిస్తున్నారు. రాజకీయంగా కూడా తెలివిగా కేంద్రం పెద్దలతో సఖ్యతగా ఉంటూ ఢిల్లీ ఇచ్చే నిధులను విమర్శలకు తావివ్వకుండా ఖర్చు చేస్తున్నారు సీఎం జగన్‌.

కేంద్రం, బీజేపీ పెద్దలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో స్నేహంగా ఉండటాన్ని ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ, చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు.  2019 ఎన్నికలకు  ముందు అతి తెలివి తేటతో మోదీని ఇష్టమొచ్చినట్లు విమర్శించి, రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, భార్య లేని మోదీకి కుటుంబం విలువ ఏం తెలుసంటూ చంద్రబాబు చేసిన రాజకీయ  విమర్శలను మోదీ అండ్ కో ఇంకా మర్చిపోలేదు.  అందుకే..ఎన్‌డీఏ -2 గవర్నమెంట్  ఏర్పడిన తరువాత చంద్రబాబు ఎన్ని సార్లు మోదీ అపాయింట్‌మెంట్ అడిగినా దొరకలేదు.కనీసంఅమిత్ షా కూడా చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మోదీ – అమిత్ షాలతో స్నేహంగా ఉండటం, చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వక పోవడాన్ని ఆంధ్రజ్యోతి రాధా కృష్ణకు కళ్లల్లో కారం కొట్టినట్లు ఉంటుంది. ఏపీలో వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే  కేంద్రం, జగన్‌ మద్య స్నేహం చెడగొట్టడానికి రాధా కృష్ణ తన పేపర్‌, టీవీలో అనేక వార్తలు వండివార్చారు. కానీ…మోదీ – జగన్‌ స్నేహంలో నిజాయితీ, ప్రజలకు సేవా చేయాలనే తపన, అంతకు మించి ప్రజాస్వామ్య విలువులు ఉన్నాయి . ఈ విషయాన్ని రాధా కృష్ణ గ్రహించాలి.

దుబ్బాక, గ్రేటర్‌లో ఫలితాలతో కేసీఆర్‌ అప్రమత్తమవుతారు. దీనిలో సందేహం లేదు. రాజకీయంగా ఎత్తులు వేయడంలో కేసీఆర్‌ చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలో, కమలనాధులను ఎలా కట్టడి చేయాలో కేసీఆర్‌ దగ్గర వ్యూహం తప్పక ఉంటుంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టవచ్చు. ఈ లోపే రాధా కృష్ణ అక్షర రాక్షసం చూపించడం చూస్తుంటే ఎల్లో  బ్యాచ్‌కు జగన్‌ అంటే ఎంత భయమో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికే కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో  జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ బీజేపీని  ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ  వైఎస్‌ జగన్‌ మాత్రం పక్క  రాష్ట్ర సీఎంతో గౌరవంగానే ఉంటున్నారు అలానే..మోదీ -అమిత్ షాలతొ స్నేహంగా ఉంటున్నారు. ఇది వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలోని రాజకీయ పరిణితిని చూపిస్తుంది. కేసీఆర్‌ – మోదీ -అమిత్ షాలతొ స్నేహ, ప్రజాస్వామ్య, భారతీయ ధర్మాన్ని పాటిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. ఇది చంద్రబాబు – రాధా కృష్ణలకు మింగుడు పడని విషయం.

“తెలంగాణలో మళ్లీ జగన్‌” వండి వార్చిన వార్తతో ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టి బీజేపీకి చంద్రబాబును దగ్గర చేయాలనేది రాధా కృష్ణ ఆలోచనగా స్పష్టంగా కనిపిస్తోంది.  రాధా కృష్ణకు  తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అక్కర్లేదు. తెలుగు ప్రజల సంక్షేమం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండటం అక్కర్లేదు. తెలుగు ప్రజలు, నేతలు కొట్టుకు చావాలి. ఆ రక్తపుటేరుల్లో చంద్రబాబు – రాధా కృష్ణ సింహసనమేసుకుని కూర్చోవాలి. ఇది వారి రాజకీయ లక్ష్యం. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ సీపీని విస్తరించాలనే ఆలోచన వైఎస్‌ జగన్‌మోహణ్ రెడ్డికి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే..ఏపీలోనే ఆయనకు కోటి తల నొప్పులు ఉన్నాయి. ఆంధ్రులు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద ఎంతో నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. చంద్రబాబు నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో  వైఎస్‌ జగన్‌ ఉన్నారు.

మేనిఫెస్టోలో 90శాతానికిపైగా హామీలు నెరవేర్చినప్పటికీ కొత్త పథకాల రూపకల్పనకు ఆలోచనలు చేస్తున్నారు. విద్య, వైద్య  రంగాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. 18 నెలల కాలంలో విద్యా రంగంలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలతో  ప్రైవేటు పాఠశాలల నుంచి 2లక్షల మందికిపైగా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో పేరు నమోదు చేసుకున్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు పాలనలో మూలన పడిన 108, 104 వాహనాలను మళ్లీ రోడ్డెక్కించారు. అంతేకాదు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాల కోసం రూ.5,472కోట్లు కేటాయించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా  రూ. 7,500 కోట్లతో ఒకేసారి16 కొత్త మెడికల్ కాలేజీలే ఏర్పాటు చేస్తున్నారు. 60 లక్షల మందికిపైగా నెలలో ఒకటో తేదీ రాగానే పింఛన్లు ఇస్తున్నారు.  ఇలా..ఒక పక్క ఆర్ధిక  వ్యవస్థను చక్క దిద్దుకుంటూ, మరో పక్క   ప్రజల అవసరాలను తీరుస్తూ ఏపీ పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇటువంటి  పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని విస్తరిస్తారని అనుకోవడం ఆంధ్ర జ్యోతి రాధా కృష్ణ వండివార్చిన వార్తే కాని దానిలో ఆవగింజంత కూడా నిజం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్‌ఆర్‌ కుటుంబ అభిమానులు లక్షల్లో ఉన్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవను, ఆయన చూపిన అభిమానాన్ని వారు ఎప్పటికీ మరిచిపోరు. అందుకే..వైఎస్‌ఆర్‌ సీపీ స్థాపించిన కొత్తలో తెలంగాణ రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గమే కాకుండా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు వైఎస్ఆర్‌ సీపీకి అండగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంతో కొంత మంది వెనక్కి తగ్గినప్పటికీ తెలంగాణ ప్రజల నరాల్లో దాగిన వైఎస్‌ఆర్‌పై అభిమానం వారి రక్తంతో సమానంగా ప్రవహిస్తుంటుంది.

ఇప్పటికీనాకు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మెస్సేజ్‌లు పెడుతుంటారు, నాతో చాలా మంది మాట్లాడుతుంటారు. వైఎస్‌ఆర్‌పై తెలంగాణ ప్రజల అభిమానం వెల కట్టలేనిది. దానిని ఓట్ల రూపంలో మల్చుకోవాలనే ఆలోచన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఇప్పట్లో ఉందని నేను అనుకోను. ఎందుకంటే..ఆయన ఇప్పుడిప్పుడే చంద్రబాబు అరాచక పాలన నుంచి ఆంధ్రులను బయటపడేసే పాలనలో నిమగ్నమై ఉన్నారు.

తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. వారికి ఎప్పుడు ఎవరి నాయకత్వం కావాలో వారికి తెలుసు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు కాబట్టే చంద్రబాబు తెలుగు దేశం పార్టీని రాష్ట్రం నుంచి వెలివేశారు. గ్రేటర్‌లో 106సీట్లలో పోటీ చేస్తే అన్ని చోట్ల  టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది. హైదరాబాద్‌లో  ఉన్న చంద్రబాబు ఆయన తనయుడు లొకేష్ కనీసం గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. కారణం..ఓటుకు కోట్లు భయం. ఓటు కోట్లు భూతమై చంద్రబాబును  వెంటాడి ఆంధ్రలోని కరకట్టకు తరిమేశాయి. వీటి గురించి ఆంధ్రజ్యోతిలో రాధా కృష్ణ అసలు రాయడు.

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటును చీల్చడానికి, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రెడ్ల ఓట్లు చీల్చడానికి వైఎస్‌ జగన్‌ను కేసీఆర్ కాక పడుతున్నారు అని మాత్రం తాటి కాయంత అక్షరాలతో రాసి అక్షర రాక్షసం చేస్తారు. ఇవి పత్రికా విలువలా? ఇవి జర్నలిజం విలువలా? అని రాధా కృష్షను ప్రశ్నిస్తున్నాను. ఏపీకి కేంద్రంతో ఉన్న స్నేహాన్ని చెడగొట్టాని చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులు మరోసారి కన్నెర్రజేస్తారని రాధా కృష్ణ గుర్తు పెట్టుకోవాలి. మోదీ -అమిత్ షా -జగన్‌ల స్నేహం నీ రాతలతో చెడిపోతుందని మీరు అనుకోవడం వట్టి మీ భ్రమ. స్నేహ రాజకీయాలు చేసేది ఎవరు? కన్నింగ్ రాజకీయాలు చేసేది ఎవరు? అనేది మోదీ -అమిత్ షాలకు తెలియదని అనుకోవడం మీ తప్పు.

ఇప్పటికైనా రాధా కృష్ణ ప్రజలకు పనికి వచ్చే వార్తలు రాయాలి.తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు వచ్చే వార్తలు రాయాలి. ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమ పథకాలను బతికించే  వార్తలు రాయాలి.   మా బాబే అధికారంలో ఉండాలి. మరెవ్వరూ ఉండకూడదని మీరు అనుకుంటే రాజకీయ  సమాధి కాక తప్పదు. కాలిపోయి కమురు వాసన వస్తున్న పార్టీని బతికించాలని రాధా కృష్ణ పడే తాపత్రయం చూస్తుంటే  హవ్వా అనిపిస్తోంది..!

-వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్

2 COMMENTS