ఇది ఐదు తరాల ఉమ్మడి కుటుంబం…

956

ఏ సమాజానికైనా తొలి మెట్టు కుటుంబం.ఆ కుటుంబ వ్యవస్థలోనే భారతీయ సంస్కృతి నిక్షిప్తమై ఉంది. తల్లి, తండ్రి, పెదనాన్న, చిన్నాన్న, మేనత్త, మేనమామ, జేజి, తాత, పిన్ని, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, మనుమలు.ఇలా అందరూ ఒక ఇంటిపట్టుగా నివసించి ఇంటి పెద్ద అదుపాజ్ఞల్లో జీవించడం అనాదిగా వచ్చిన భారతీయ ఆచారం.
అది ఒకప్పటి మాట.కానీ జనం చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలన్న నినాదానికి ఆకర్షితులైపోవడంతో పెద్ద కుటుంబాలకు కాలం చెల్లిపోయింది.
కానీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు వేరే..జనాభా పెరుగుదలను అరికట్టడానికి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడంలో భాగంగా ‘చిన్న కుటుంబ చింత లేని కుటుంబం’ అపి ఇచ్చిన నినాదాన్ని మరో విధంగా భావించిన వాళ్లూ ఉన్నారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో విశ్వాన్ని పిడికిలిలో పట్టేశానని మనిషి సంబరపడుతున్నాడు. అయితే ఇదే ప్రపంచీకరణ కారణంగా కుటుంబ వ్యవస్థ ఏ మేరకు విచ్ఛిన్నమైనదో గుర్తించలేకున్నాడు.  పెళ్లి చూపుల నాడే వేరే కాపురాల గురించి నిర్ణయమై పోతున్న ఈ తరంలో ఉమ్మడి కుటుంబాలను కేవలం సినిమాల్లోనో, టెలివిజన్‌ సీరియళ్లలోనో చూసి ఆనందించాల్సిన దుర్గతి పట్టింది.
అయితే కుటుంబ వ్యవస్థ ఎంత బలమైనదంటే ఈ పరిస్థితుల్లో కూడా అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ N రఘువీరారెడ్డి కుటుంబంలో 387 మంది ఏ కార్యక్రమాలు నిర్వహించిన అందరూ కలసికట్టుగా నిర్ణయలు తీసుకొనే ఉమ్మడి కుటుంబాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.దీనికి అర్థం ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని నిరూపిస్తున్నారు రఘువీరారెడ్డి  ఉమ్మడి కుటుంబ సబ్యులు.

వారి కుటుంబం  ఆర్థికంగా,రాజకీయంగా.సామాజికంగా, ఎదగడానికి ఈ ఉమ్మడి కుటుంబం ఒక మూలస్తంభంగా నిలబడింది అనే దానికి నిదర్శనం అని చెప్పవచ్చు..తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు అని వారి కుటుంబ పెద్దల విగ్రహాలుఇంటి ముందే ఏర్పాటు చేసుకొని నిత్యం వారిని స్మరించుకుంటూ ఉన్నా 387 మంది తో  కులలతో సంబంధం లేకుండా 14 కులలవారు ఇమిడి ఉన్న  ఆదర్శవంతమైన ఉమ్మడి  కుటుంబం. “కలసి ఉంటే కలదు సుఖం’ అని నిరూపిస్తున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ గత ఐదు తరాల ఉమ్మడి కుటుంబ సభ్యులు..

3 COMMENTS