ఎవరు ‘సెటిలర్లు’…???ఎవరు ‘పర్మినెంట్ రెసిడెంట్లు’…???

244

ఎలెక్షన్లు జరిగేది ఎప్పుడైనా… అది అసెంబ్లీకైనా… పార్లమెంట్ కైనా… స్థానిక సంస్థల్లో దేని కైనా… ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ‘జీహెచ్ఎంసీ’ కైనా… తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎప్పుడు ‘ఎలెక్షన్లు’ అన్నప్పుడల్లా ‘ఆంధ్రా సెటిలర్లు ఎటువైపు… ఎవరివైపు…!’ అనే మాట కొంతకాలం వార్తల్లో ఉంటోంది…
ఐదేళ్ల క్రితం తెరాస పార్టీ జీహెచ్ఎంసీ ఎలెక్షన్లలో అఖండ విజయం సాధించినప్పుడు… ఆంధ్రా సెటిలర్లు అంతా తెరాస కు, సంపూర్తిగా కేసీఆర్ – కేటీఆర్ కు మద్దతు గా,  పూర్తి అనుకూలం గా వోటు వెయ్యడం వల్లనే జీహెచ్ఎంసీ ఎలెక్షన్లలో తెరాస ఘన విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠం తో పేర్కొన్నారు… ఇది నిజం కూడా… అప్పట్లో తెలంగాణ ఏర్పాటైన కొత్తలో, అప్పటికే రాష్ట్రం లో సంపూర్ణ అధికారం లో ఉన్న తెరాస పార్టీ కే జీహెచ్ఎంసీ ఎలెక్షన్ లో కూడా మద్దతు పలికితే హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందుతుంది అని ఆంధ్రా ప్రజలు పరిపూర్ణం గా విశ్వసించారు…
అదేంటి…!!! ఇదేంటి…!!! ఇది ఎలా సాధ్యం…!!!… ఆంధ్రా వాళ్లకు సిగ్గు లేదా…?… కేసీఆర్ కు… కేటీఆర్ కు… తెరాస కు… ఎలా వోటు వేస్తారు…?… ఇలా ఎందరో ఎన్నోరకాలు గా ఆంధ్రా వాళ్ళను ఎప్పిటిలాగానే ఆడి పోసుకున్నారు… చాలా మంది యథాశక్తి ఆంధ్రా ప్రజల విషం పై చల్లారు. కానీ ఆంధ్రా ప్రజల విచక్షణ వాళ్లకి వుంది… అది ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదు… ఉద్యమం లో భాగం గా చాలా సార్లు ఆంధ్రా ప్రజలను, ఆంధ్రా ప్రాంతాన్ని, ఆంధ్రా సంస్కృతి ని గురించి అవమానకరం గా మాట్లాడిన కెసిఆర్ ను, తెరాస నాయకుల్ని కూడా ఆంధ్రా ప్రజలు క్షమించారు…
ఎందుకు…???… ఆంధ్రా ను ఖూనీ చేసిన కాలకూట విషం లాంటి  కాంగ్రెస్ పార్టీ కన్నా, అప్పట్లో హైదరాబాద్ లో బలంగా లేని బీజేపీ పార్టీ కన్నా, కొందరు స్వార్థ -నీచ-వంచక ఆంధ్రా రాజకీయనాయకుల కన్నాఅంతా సమానమే అంటూ భరోసా ఇచ్చిన కెసిఆర్ – కేటీఆర్ లు చాలా మెరుగు అని వాళ్ళు భావించారు… కేటీఆర్ పై కొత్త నమ్మకం తో అతనిలో కొంత మంచి భవిష్యత్తు ను వాళ్ళు చాలా నమ్మారు అని నమ్మితీరాల్సిన నిజం…  ఫలితం గానే అప్పట్లో తెరాస అఖండ విజయం.మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆంధ్రా సెటిలర్లు అంతా మళ్ళీ తెరాస కు, సంపూర్తిగా కేసీఆర్ – కేటీఆర్ కు మద్దతు గా,  పూర్తి అనుకూలం గా వోటు వెయ్యడం వల్లనే ఈ జీహెచ్ఎంసీ ఎలెక్షన్లలో కూడా తెరాస విజయం సాధ్యమైందని, నలభై సీట్లు పోయినా, ఈమాత్రమైనా, ఇలాగైనా ఒడ్డున పడిందని విశ్లేషకులు ఇప్పుడు మళ్ళీ పేర్కొంటున్నారు… ఇది కూడా  నిజం గానే కనిపిస్తోంది…
మళ్ళీ ఎందుకు…???… ఆంధ్రా ను ఖూనీ చేసిన ఎప్పటికీ నమ్మలేని  కాలకూట విషం లాంటి  కాంగ్రెస్ పార్టీ కన్నా, ఏడేళ్లు గా ఆంధ్రాకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్న బీజేపీ పార్టీ కన్నా,  ఎంతో కొంత భరోసా ఇస్తున్న  కెసిఆర్ – కేటీఆర్ లు చాలా మెరుగు అని వాళ్ళు మళ్ళీ భావించారు అనుకోవాలి.
ఆంధ్రా ప్రజల కృతజ్ఞత, నమ్మకం, విశ్వాసం, విచక్షణ ప్రశ్నించే స్థాయి గానీ, యోగ్యత గానీ ఉన్న నాయకులు గానీ, పార్టీ లు గానీ భారత దేశం లో లేరు. ఇప్పుడైనా, ఇకనైనా తెరాస, కెసిఆర్, కేటీఆర్ లు కళ్ళు తెరిచి, తప్పులు గుర్తించి, పునరాలోచించి, అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఎంతవరకైనా రాజకీయ సమాధే…!
ఇకపోతే ముఖ్యంగా… “Settler” meaning: “a person who moves with a group of others to ‘live’ in a new country or area”… ఇది ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ ప్రామాణిక ఇంగ్లీష్ డిక్షనరీ చెప్తున్నఅర్థం… అంటే… “ఒక వ్యక్తి కొందరితో కలసి ఒక కొత్త ఏరియా కో లేదా కొత్త ప్రాంతానికో లేక ఏదైనా కొత్త దేశానికో బ్రతకటానికి పొతే నే వాళ్ళను “సెటిలర్లు” అని పిలవాలి అని… ఆంధ్రా వాళ్ళను ఏ ప్రాతిపదికన సెటిలర్లు అని పిలుస్తున్నారో చెప్పాలి…? ఆంధ్రా వాళ్ళు ‘సెటిలర్లు’ ఐతే ఇక ‘పర్మినెంట్ రెసిడెంట్లు’ ఎవరు…?… అసలు ‘సెటిలర్’ అనే పదం వాడటమే తప్పు. ఆంధ్రా ప్రజలు ఇక్కడకు బ్రతకానికి రాలేదు. వాళ్ళు ఇక్కడకు వలస కూడా రాలేదు. వాళ్ళ రాష్ట్ర రాజధాని లో వాళ్ళు శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకున్నారు.
చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం వారు ‘పర్మినెంట్ రెసిడెంట్లు.  వాళ్ళ రాష్ట్రం లో వాళ్ళు ఉండగానే వాళ్ళను వాళ్ళ ప్రమేయం లేకుండానే వారిని  కాందిశీకుల్ని, వలసవాదుల్ని  చేసారు. ఇప్పుడు విడమర్చి చెప్తే Andhra వాళ్లకు జరిగిన అన్యాయాలకు  ఉపమానాలు, పేజీ లు కూడా సరిపోవు. ఒక నీచమైన రాజకీయ కుట్రకు ఆంధ్రా ప్రజలు బలి అయ్యారు. కేవలం కొందరు స్వార్ధ నీచ వంచక రాజకీయ నాయకులవల్ల వాళ్ళ స్వంతం అనుకున్న ప్రాంతమే పరాయిది అయిపోయింది.
ఒకరకం గా… ప్రపంచం లో ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ్నుంచో వచ్చినవాళ్లే, ఎక్కడో ఒకక్కడ ఎదో ఒక దగ్గర సెటిల్ ఐన వాళ్ళ్లే. కానీ, సెటిలర్ అనే పదం ఒక తక్కువ స్థాయిని, అమర్యాద ను సూచిస్తుంది. దయ చేసి ఆంధ్రా ప్రజలను సెటిలర్లు అని పిలవకండి… దాన్ని మించిన అవమానం ఆంధ్రులకు మరొకటి లేదు…  చట్టబద్దంగా, రాజ్యాంగబద్ధం గా అందరూ సమానమే… ఇక్కడ అందరూ పర్మినెంట్ రెసిడెంట్లు మాత్రమే… సెటిలర్లు ఎవరు లేరు. జై హింద్ … భారత మాతకు జై…

   పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ,
  శృంగవృక్షం,
                                                                                               Near భీమవరం,
                                                                                           పాలకోడేరు మండలం,
                                                                                          పశ్చిమ గోదావరి జిల్లా,
                                                                                                ఆంధ్ర ప్రదేశ్.