ఒమన్ సుల్తాన్-ఈ శతాబ్దపు కర్మ యోగి !

637

ఈ శతాబ్దంలో అందరికంటే గొప్పవాడు స్టీవ్స్ జాబ్స్ వాడి అమ్మా మొగుడ్లు కాదు. నన్ను అడిగితే ఈ శతాబ్దం లో అత్యంత గొప్ప వ్యక్తి ఒమన్ సుల్తాన్ “ఖబూస్ బిన్ సయిద్” అంటాను. ఒమన్ ఒక ఎడారి అరబ్బు దేశం. 1970 వరకు బాహ్య ప్రపంచం తో ఎక్కువ సంభందాలు ఉండేవి కావు. తండ్రి నిరంకుశ పాలన కి అడ్డుకట్ట వేసి 1970 లో ఒమన్ దేశానికి ఖబూస్ బిన్ సయిద్ చక్రవర్తి గా ప్రమాణ స్వీకారం చేసాడు.

2010 లో ఐక్యరాజ్యసమితి గడిచిన 40 సంవత్సరాల కాలం లో అత్యంత అభివ్రుద్ది చెందిన దేశాల లిస్ట్ ప్రకటించినప్పుడు ఒమన్ దేశానికి అగ్రస్థానం ఇచ్చింది. దీనికి కారణం ఒకే ఒక్కడు అతనే ఒమన్ సుల్తాన్ “ఖబూస్ బిన్ సయిద్”. యవ్వనాన్ని ఎంజాయ్ చేస్తూ జల్సా గా తిరగమంటే తాను మాత్రం చదువుకోవాలి అన్నాడు. ఇంగ్లాండ్ లో మాత్రమే కాదు, ప్రపంచం అంతా తిరిగాడు. మన భారతదేశం కూడా వచ్చి మాజీ రాష్ట్రపతి శంకర్ దయళ్ శర్మ దగ్గర కొన్ని రోజులు చదువుకున్నాడు, భారత దేశం అంటే మక్కువ ఎక్కువ. ఇంకా బ్రిటీష్ రాయల్ మిలటరీ లో కూడా కొంతకాలం పని చేశాడు.
ఖబూస్ బిన్ సయిద్ ఒమన్ దేశాన్ని ఆధునీకరించిన ఒక దార్శినికుడు మాత్రమే కాదు, ఒక కర్మ యోగి. 1976 లో పెండ్లి చేసుకొని మూడు యేండ్ల తర్వాత కుటుంభ కలహాల కారణం గా విడాకులు తీసుకొన్నాడు. దేశాన్ని అభివ్రుద్ది చేయాలని కంకణం కట్టుకొని మళ్ళీ పెండ్లి చేసుకోలేదు. ఒమన్ లో పనిచేయటానికి వెళ్ళిన ప్రతి బయటి దేశ కార్మికుడూ మా దేవుడు లేడు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు అంటే అతను ఎంత గొప్పవాడో అర్దం చేసుకోవచ్చు (కోలాన్ క్యాన్సర్ వలన జనవరి 10, 2020 న ఈ ఆధినిక మానవ చక్రవర్తి ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు at the age of 79).
ఈ శతాబ్దం లో అందరికంటే గొప్పవాడు స్టీవ్ జాబ్స్ కాదు, ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ అంటాను నేను. ఎక్కడ ఉన్న దేశాన్ని ఎక్కడికి తీసుకువచ్చాడు, ముస్లిం సుల్తాన్ అయినా పెండ్లి చేసుకోకుండా, పిల్లలని కనకుండా దేశం అంతా తన కుటుంభం అనుకున్నాడు. ముస్లిం దేశం అయినా కొన్ని చర్చ్ లు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు. ఇంకా విశ్వవిద్యాలయాలు కట్టించాడు. దేశం లో ఉండే ప్రజలకి మత స్వేఛ్చ ఇచ్చాడు. ఒమన్ లో 90% అక్షరాస్యత. 4% మాత్రమే సాగుభూమి, మిగతా అంతా ఎడారి అయినా ఆ 4% లో ప్రతి ఇంచు ని ఉపయోగించుకోగలిగితే చాలు అనేవాడు. ఎడారి లో తాగటానికే నీళ్ళు ఉండవు కానీ ఒమన్ లోని పురాతన అఫ్లజ్ ఇర్రిగేషన్ సిస్టం ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించింది.
సామాన్య కార్మికుడు ట్యాక్స్ కట్టే పని లేదు, సోషల్ సెక్యూరిటీ కోసం కొంత మొత్తం కడితే చాలు. ప్రతి కార్మికుడూ కాలర్ ఎగరేసుకొని గర్వం గా బతికే దేశం ఒమన్. ప్రపంచం లో one of the best టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఒమన్. ప్రాఛీన మానవుడు అడుగు పెట్టిన కొన్ని ప్రదేశాల్లో ఒమన్ ఒక్కటి. చాలా నీట్ గా ఉండే దేశాల్లో ఒమన్ ఒకటి. మన దేశం, మన రాజకీయ నాయకులు జీవితాంతం చదవాల్సిన పుస్తకం ఒమన్ మరియూ ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్.
ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ లేడు అన్న విషయం ఒమన్ కి మాత్రమే కాదు, ఈ శతాబ్దపు అత్యంత గొప్ప మనిషి లేడు అని ఈ ప్రపంచానికి తీరని లోటు. కొన్ని రోజులు యూరప్ లో చికిత్స కోసం వెళ్ళి ట్రీట్ మెంట్ చేస్తే ఇంకా బతకొచ్చు అని చెప్పినా నా దేశ కార్మికులు చిందించిన చెమట, రక్తం తో ఇంకా నేను బతాకల్సిన అవసరం లేదు అని స్వదేశానికి వచ్చి చనిపోయిన ఖబూస్ బిన్ సయిద్ నిజం గా ప్రస్తుత ప్రపంచానికి గర్వకారణం.సెల్యూట్ సార్. ఈ శతాబ్దపు గొప్ప మనిషి ఖబూస్ బిన్ సయిద్ అనే చక్రవర్తి బతికిన కాలం లో నేను కూడా బతికాను అని గర్వం గా చెప్పుకుంటా.
– జగన్

1 COMMENT