సింగర్ సునీత నిశ్చితార్థం…

716
టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో సునీత ఒకరు. ఈమె కేవలం సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు కూడా. కొన్ని రోజుల ముందు నుండి సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమేనని రుజువు చేస్తూ సింగర్‌ సునీత సోషల్‌ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా “ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్‌ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిలలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. . మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని సునీత మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేశారు.