బ‌ల్లిశాస్త్రం చెప్పే నిజాలు ఇవే..

బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళనపడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి.
మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది.
కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం.
వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు.
ఇక స్త్రీలపై బల్లి పడితే… తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి.
స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు.. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు.
ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.
బల్లి పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి.
బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మరియు శాస్త్ర వివరణ.

                                                                               చింతా గోపీ శర్మ సిద్ధాంతి
                                                లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం) 
                                                                             పెద్దాపురం, సెల్:- 9866193557

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami