చలికాలం…చర్మం జాగ్రత్త

208

చలికాలం చర్మం తీరు మారిపోయి కాస్త ఇబ్బందిగానే కనిపిస్తుంది. ఏదో లోషన్లు అవి వాడేసి సరిపెట్టేసుకుంటాం. కానీ, పిల్లల విషయంలో అలా ప్రయోగం చేయగలమా.. కచ్చితంగా కాదనే చెబుతాం. సహజ పద్ధతిలో జాగ్రత్తగా చూసుకోవాలనే చూస్తాం. చర్మం పొడిబారకుండా వీలైనంత కేరింగ్ తీసుకుంటాం. అలాంటి వారి కోసమే ఈ ఐదు చిట్కాలు.
1. కలబంద గుజ్జు : పిల్లల చర్మం విషయంలో హార్ష్ కెమికల్స్ వాడి తాత్కాలిక ఉపశమనం పొందినా తర్వాత చర్మం తీరుమారిపోతుంది. వీటి నుంచి బయటపడటానికి కలబంద జెల్ వాడండి. నూనెలో కలిపి ముఖానికి, శరీరానికి రాయండి.
2. నూనెతో మసాజ్ : క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఆయిల్ తో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో రక్త సరఫరా మెరుగై చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. దీని కోసం బేబీ మసాజ్ ఆయిల్ తీసుకుని చేతులతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయండి.
3. మంచి సబ్బు : కెమికల్స్ ఎక్కువగా ఉన్న సబ్బు కాకుండా కరెక్ట్ సోప్ ఎంచుకోండి. నేచురల్, ఆర్గానిక్ మిక్స్‌డ్ సోప్ అయితే ఇంకా బెటర్. కొబ్బరినూనె వంటివి కలిసిన సబ్బులు చాలా ఉత్తమం. మామూలు రోజుల కంటే చలికాలం స్నానం చేయించే సమయాన్ని తగ్గించండి.
4. హ్యూమిడిఫైర్ : చలికాలం హీటర్లు తేమను దూరం చేసేస్తాయి. చలి గాలి కారణంగా పొడిబారిపోవడంతో పాటు తేమకు దూరం అవుతుంది. హీటర్ వాడే వాళ్లు కచ్చితంగా మీ పాపకు తేమ అందించాలంటే హ్యుమిడిఫైర్ ను తెచ్చుకోండి.
5. పెదవులనూ మర్చిపోకండి : శరీరం మొత్తం పట్టించుకుని పెదవులను విస్మరించకండి. పెట్రోలియం జెల్లీ ఉన్న క్రీములు వాడండి. లేదా పెదాలను హైడ్రేట్ గా ఉంచే మాయిశ్చర్లను వాడండి. బేబీల కోసం లిప్ బాం వాడకండి. అవి కలర్ ఫ్లేవర్ తో ఉంటాయి కాబట్టి హానికరం.