ఆయుర్వేదాన్ని ఐఎంఏ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

భారత ప్రభుత్వం. ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయటానికి నవంబర్ నెల 2020 లో అనుమతి ఇచ్చిన సందర్బంగా .IMA వారు వ్యతిరేకిస్తున్న సందర్బంగా నా అభిప్రాయం.
Alopathy వైద్యం అనేక శాస్త్రాల సమ్మేళనం.Thermameter.Bp operatusVentilators
అనేక పరికరాలు బయో మెడికల్ ఇంజినీర్లు లేదా ఫిజిక్స్ ప్రొఫెసర్ లు కనిపెట్టారు. మందులు ఫార్మసీ సైన్స్ చేసిన నవాళ్లు, కెమిస్ట్రీ ప్రొఫెసర్లు కనిపెట్టారు. కొత్త ఔషధాలు బియోటెక్నాలజీ సైటిస్ట్ లు రీసెర్చ్ చేసి జంతువులమీద ప్రయోగం చేసి వైద్యులకు అందిస్తారు.
క్రీస్తు పూర్వం సుశ్రుత మహర్షి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టడమే కాకుండా కొన్ని రకాల సస్త్ర చికిత్స లు చేశారు వీటి గురించి వీటి గురించి అన్ని వివరాలు సుశ్రుత సంహిత గ్రంధం లో ఉన్నాయి ఇప్పుడు అలోపతి వైద్యులు ఉపయోగిస్తున్న అనేక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ సుశ్రుత సంహితలో వివరించిన పరికరాలు లేదా వాటి రూపాంతరాలు.
సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను ఆయుర్వేద సుశ్రుత మహర్షి ఆవిష్కరిస్తే ఆ సుశ్రుత సంహిత గ్రంధం మూలసిద్ధాంతాల ఆధారంగా అభివృద్ధి చేసుకున్నవే. ఎక్సర్ లు,స్కానింగ్ మిషన్లు ఫిజిక్స్ శాస్త్ర వేత్తలు కనిపెట్టారు. వ్యాక్సిన్ లు వైరలోజిస్ట్ లు కనిపెట్టారు .
ఒకటేమిటి అన్ని విభాగాలు వేరే రంగానికి చెందిన వాళ్ళు కపెట్టినవే. వాళ్ళు వాడే టెక్నికల్ టర్మ్స్ గ్రీక్, ఇంగ్లిష్, లాటిన్,సంస్కృతం లాంటి బాషలనుండి ఉద్భవించినవే. అన్ని రంగాలకు చెందిన మేధావులు కనిపిట్టిన వాటిని ఉపయోగిస్తూ అన్నిటికి మేమె మూల కారకులం అని ప్రజలలో గొప్పగా వెలిగిపోతున్న అలోపతి వైద్యం.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు సిలబస్ లో ఉన్న , చదువు కున్న లేదా P G లో నేర్చుకున్న సర్జికల్ ప్రొసీజర్లు మాత్రమే ప్రాక్టీస్ చేయటానికి అనుమతి ఇచ్చింది కానీ అన్ని రకాల శస్త్ర చికిత్స లు కాదు.
శాస్త్రవేత్తలు,మేధావులు కనిపెట్టిన ఆవిష్కరణలు మానవాళి అందరికి ఉపయోగ పడాలి గాని
ఒక రంగం శాత్రవేత్తలు కొత్తగాకనుక్కున్నవి ఇతర రంగాలు వాడకూడదనటం దూరహంకారం,మోనోపోలిజం.ఒకరు ఆవిష్కరించినవి ఏ రంగాల వారైనా తగిన ట్రైనింగ్ తో క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ అనుమతి తో ఎవరైనా ఉపయోగించు కోబట్టే ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందింది.
నూతన ఆవిష్కరణలు ఆయుర్వేద వైద్యులు వాడకూడదంటే ఇదే సిద్ధాంతం అలోపతి వైద్యుల్లకు వర్తిస్తుంది. అసలు వైద్యము అనేది అనేక శాస్త్రాల సమ్మేళనం. ఆయుర్వేద వైద్యులు మాత్రం ఇవి ఏవి ఉపయోగించడానికి వీలు లేదు,మేము మాత్రమే హక్కుదారులం అని అనటం ఎంతవరకు సమంజసం?
– డాక్టర్.నాగేశ్వరరావు.
సీనియర్ ఆయుర్వేద వైద్యులు
ఆనంతపురము.