నిరంతరం ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి

403

కొత్త కార్పొరేటర్ లకు ఉప సభాపతి పద్మారావు గౌడ్ హిత బోధ సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లను తమ పార్టీ కైవసం చేసుకోవటం ఆనందాన్ని కలిగిస్తోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తాము వారి వెన్నంటే నిలిచామని, కొత్తగా ఎన్నికైన కార్పరేటర్లు కుడా అదే పద్దతిని పాటించాలని అయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ కు చెందిన నూతన తెరాస కార్పరేటర్ల విజయోత్సవం శనివారం నామాలగుండు కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ … తెలంగాణా వాదానికి సికింద్రాబాద్ ప్రాంతం చిరకాలంగా కంచు కోటగా నిలిచిందని, తమ విజయాన్ని అడ్డుకొనేందుకు ఎన్ని శక్తులు ప్రయత్నించినా విజయం తమ పార్టీనే వరించిందని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో సికింద్రాబాద్ అభివృధికి పాటుపడతామని స్పష్టం చేశారు. మేయర్ పదవి ఎంపిక వ్యవహారం తమ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. కొత్తగా కార్పరేటర్లు గా ఎన్నికైన లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ , మోతీ శ్రీలత శోభన్ రెడ్డి, కుమారి సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్,రామేశ్వర్, త్రినేత్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు,