కామ్రేడ్ నారాయణ ఒంటరి కాదు

952

కామ్రేడ్ నారాయణ ఒంటరి కాదు అనే ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ముందుగా కామ్రేడ్ నారాయణ  నిబద్ధత కొరకు మాట్లాడాలి
రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ కామ్రేడ్ నారాయణ .చాలా సందర్భాలలో తమ పుట్టిన ప్రాంతం మీద అత్యంత ప్రేమ ఎవరైనా కనబరుస్తారు, అలాంటిది నారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో,  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణలో పుట్టి నటువంటి బిడ్డలు ఎవరైనా  తెలంగాణా కి వ్యతిరేకంగా మాట్లాడితే , వారిపై భౌతిక దాడులకు దిగిన సందర్భాలు కోకొల్లలు. అలానే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుండి  ఎవరైనా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోవడాన్ని సమర్థిస్తే వారిపైన అక్కడ భౌతిక దాడులకు దిగారు.
   అటువంటి సందర్భంలో ప్రజలంతా భావోద్వేగాలలో కొట్టుకుపోతుంటే , కామ్రేడ్ నారాయణ తెలంగాణ కచ్చితంగా కావాల్సిందే అని తెలంగాణ ప్రజల తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ కి వన్నె తెచ్చే విధంగా తెలంగాణ ఉద్యమం లో పాదయాత్ర మొదలు కొంటె, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి గ్రామగ్రామాన తిరిగాడు, తన ప్రసంగాల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ
తెలంగాణ ఉద్యమంలో కామ్రేడ్ నారాయణ చేసే పోరాటానికి జాతీయ మీడియా సైతం నారాయణ గారిని కొనియాడుతూ నారాయణ  చేసిన ఉద్యమాల కొరకు ప్రస్తావిస్తూ రాసేవి.
         అప్పుడు కామ్రేడ్ నారాయణ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్నాడు, పార్టీ నిర్ణయం లో భాగంగా గా చేసే ఉద్యమాలలో లో పార్టీ ప్రతిష్ఠ పెంచే విధంగా , కమ్యూనిస్టు పార్టీ విశ్వసనీయత పెరిగే విధంగా కమ్యూనిస్టు శ్రేణులను కలుపుకుంటూ  పోరాటాలు చేశాడు.ఈ క్రమంలో ఆంధ్రాలో కామ్రేడ్ నారాయణ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
   ఆ సందర్భంలో కామ్రేడ్ నారాయణ అన్నమాట, నా దిష్టి బొమ్మ కాదు నన్ను తగలబెట్టండి అయినా నేను తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటాలు చేస్తా అని నిక్కచ్చిగా చెప్పాడు  కొన్ని సందర్భాలలోప్రత్యేక రాష్ట్రం కొరకే వెలిసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి,ఆ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా తమ విమర్శల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తమ పని విధానం ద్వారా , దిశానిర్దేశం చేసినటువంటి ,  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, గద్దర్ అన్న,  విమలక్క, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ,  ఇంకా ప్రజా సంఘాల కొద్ది మంది నాయకుల తో పాటుగా  కామ్రేడ్ నారాయణ పెద్దన్న పాత్ర పోషించారు.
అఖిలభారత యువజన సమైక్య రాజకీయ శిక్షణా తరగతులు హైదరాబాద్ సెంట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, దేశ్ముఖ్ నగర్ లో జరిగాయి , అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ఉన్నారు.అఖిలభారత యువజన సమైక్య శిక్షణా తరగతుల లో , ఒకరోజు ఒక అంశం బోధించడానికి కామ్రేడ్ నారాయణ వచ్చారు. ఈ క్రమంలో ఏఐవైఎఫ్ క్యాడర్ అంతా రెడ్ సెల్యూట్ నారాయణ గారికి  అని లేచి నిలబడి చెప్పగా , చాలా నిర్బంధంగా ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చాడు.
నేను ఎవరని మీరు నాకు రెడ్ సెల్యూట్ చేస్తున్నారు, వ్యక్తుల చుట్టూ యువజనులు, విద్యార్థులు తిరగవద్దు అని , ఎర్రజెండా కు రెడ్ సెల్యూట్ చేయండని , వ్యక్తి ఆరాధన నియంతృత్వానికి దారి తీస్తుందని , మనమంతా కేవలం ఎర్ర జెండా బిడ్డలమని చాలా నిక్కచ్చిగా చెప్పాడు. అదేరోజు కామ్రేడ్ నారాయణ  భోజన సమయంలో ఏఐవైఎఫ్ క్యాడర్ తోపాటుగా ప్లేట్ పట్టుకొని లైన్లో నిలుచున్నాడు, ఈ సందర్భంలో లో ఏఐవైఎఫ్ కార్యకర్త ఒకరు భోజనం నిండిన ప్లేటు తీసుకుని వచ్చి కామ్రేడ్ నారాయణ కు ఇవ్వబోతే చాలా సున్నితంగా తిరస్కరిస్తూ, నేను మీతో పాటు సమానం అని లైన్లోనే అందరితోపాటు భోజనానికి  వచ్చాడు , ఇది మా లాంటి వాళ్ళు పార్టీలోకి వచ్చిన కొత్తలో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గా కామ్రేడ్ నారాయణ నిబద్ధత కనబడింది.

పువ్వాడ అజయ్, కామ్రేడ్ నారాయణ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకసారి చూడండి
 నీ జాతకం విప్పితే బజారు పాలు అయితావ్
పువ్వాడ పేరు చెప్తేనే నీ ఫ్యాంట్ తడిసిపోతుంది
 మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు గారి దగ్గర పని తీసుకొని ఆయనకే దెబ్బ వేసావు
 2006లో మా నాన్నగారికి రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్నావు
 2009లో మా నాన్నకు ఎంపీ అభ్యర్థిగా సీటు రాకుండా నాలుగు కోట్లకు చంద్రబాబునాయుడికి అమ్ముకున్నావు
నారాయణ నీ చెవు తెగుతుంది బిడ్డ
99 టీవీ ఛానల్ ని అమ్ముకొని పార్టీని సున్నాకు తెచ్చావు
 చికెన్ నారాయణ అంటూ కించపరిచే మాటలు చేస్తూ ఇంకా కొన్ని విమర్శలు చేశాడు.
 ఇంకా మంత్రి పువ్వాడ అజయ్ ” నేను మీ మగ్దూం భవన్లో బంట్రోతు ను కాను “
అని అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ ఉద్దేశంలో, మగ్ధుం భవన్లో బంట్రోతు లు ఎవరు ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ నేపథ్యం ఏమిటి ? మంత్రి పువ్వాడ అజయ్ , ఇవాళ అనుభవిస్తున్న దర్పం , హోదా , ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి ?
   నిజమే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నట్టు , ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించాలి, పువ్వాడ కుటుంబం ఏమి కష్టం చేసి, ఏమి బండలు పగలగొడితే, ఏమి శ్రమ చేస్తే , ఒకనాడు సైకిల్ మోటార్ మాత్రమే ఉన్న కుటుంబానికి ఈరోజు ఖమ్మంలో విలువైనటువంటి భూములు, ఆస్తులు కోటాను కోట్ల సంపద ఎలా సమకూరాయి అనేది ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి.
తండ్రి కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ లో ఉంటాడు, కమ్యూనిస్టు పార్టీకి నాగేశ్వరరావు అందరికీ ఆదర్శం , కానీ కొడుకు కు ఎందుకు ఆదర్శం కాలేకపోయాడు తండ్రి కమ్యూనిస్టు పార్టీలో ఉండి పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తాడు
కొడుకు మరొక పార్టీలో ఉండి పెద్ద పదవులు అధిరోహిస్తారు అదేంటో విచిత్రం

శ్రామిక కార్యకర్తలు, దళిత బహుజన కులాల కార్యకర్తలు వారి తండ్రులు కమ్యూనిస్టు పార్టీలో ఉండి వారి పిల్లలు వేరే పార్టీలో ఉన్నప్పుడు, అగ్రకుల పెత్తందారీ నాయకత్వాలు, శ్రామిక కులాలకు సంబంధించిన వారిని ఒకనాటి తిట్లు తిట్టిన సందర్భాలు కోకొల్లలు .
కానీ చాలా విచిత్రంగా ఇటువంటివి మాత్రం అగ్రకుల నాయకత్వానికి అన్వాయించబడవు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కంచు కోట, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అత్యంత చైతన్యవంతమయినటువంటి జిల్లా, అలాంటి జిల్లా నుండి  కామ్రేడ్ నారాయణ ఎంపీగా ఓడి పోవడానికి గల కారణాలు ?
ప్రజలందరికీ ఈ కారణాలు బాహాటంగానే తెలుసు. మగ్దూం భవన్లో బంట్రోతులుగా ఇంకా ఉంటున్న వర్గాలు ఎవరు ? మగ్దూం భవన్లో చేరి, సాధారణ కుటుంబాల నుండి వచ్చినవారు పెద్ద పెద్ద పదవులు అధిరోహిస్తూ, కోట్ల రూపాయల సంపదలు పోగేసిన వర్గాలు ఎవరు ?
మా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ఎప్పుడూ ఒక మాట అంటారు.పశువులు ఎక్కడ పచ్చ గా ఉంటే అక్కడికి వెళ్లి మేత మేస్తాయి , సేద తీరుతాయని.
భారత కమ్యూనిస్టు పార్టీలో ఉండి బాగుపడి, పదవులు అధిరోహించి, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేవారు , పార్టీని మారి , పార్టీని , పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు అని
నిజమే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు అన్నట్లు నూటికి నూరుపాళ్ళు నిజం  ఈ సందర్భంలో వర్తిస్తుంది .
కామ్రేడ్ నారాయణ ఒంటరి కాదు   అని నేను ఎందుకు అన్నానంటే కామ్రేడ్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్నప్పుడు, కార్యదర్శిగా బాధ్యతలు నుండి తప్పుకున్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విడిపోయాక తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు శ్రామిక ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక్కడ కామ్రేడ్ నారాయణ చేస్తున్నాడు అని అంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చే పిలుపులను, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి శ్రామిక ప్రజల వైపు ఎప్పుడూ ఉంటూ మడమ తిప్పని పోరాటాలు చేశాడు. మానవీయుడు కార్ల్ మార్క్స్ ఒక మాట అంటారు నువ్వు ఈ వ్యవస్థ కి ఏమి అందిస్తావో, అదే నీకు తిరిగి వస్తుంది అని.
 ఈమాట కామ్రేడ్ నారాయణ కి వర్తిస్తుంది, ప్రజల కొరకు పోరాడిన నారాయణకు ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుంది, తెలంగాణ సమాజం నారాయణను అక్కున చేర్చుకుంటుంది. అందుకే కామ్రేడ్ నారాయణ ఎప్పుడూ ఒంటరి కాదు అయితే ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. కామ్రేడ్ నారాయణ కు మంత్రి పువ్వాడ అజయ్ కి జరిగిన ఉదంతం వారి వ్యక్తిగతం కాదు
వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ సహేతుకమైన  విమర్శలు చేస్తుంది. అదే పని ఇప్పుడు కామ్రేడ్ నారాయణ చేశారు.
కామ్రేడ్ నారాయణ   ఘటనలో పార్టీ వైపు నిలుచుని,  పువ్వాడ అజయ్ ని విమర్శించిన నాయకత్వానికి, నారాయణ పట్ల మంత్రి పువ్వాడ అజయ్ భాషని ఖండించిన నాయకత్వానికి ముందుగా విప్లవ వందనాలు.
కొద్ది మంది మాత్రం గోడ మీద పిల్లి వాటం చేస్తూ ఉన్నారు ?ఎవరి స్వలాభం కొరకు వారు మౌనంగా ఉన్నారు, అనేది ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నాటువంటి ప్రశ్నలు  మంత్రి పువ్వాడ అజయ్ చేసినటువంటి విమర్శలు తిప్పి కొట్టకపోతే, ఆ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో విజ్ఞులు అందరికీ తెలుసు. ఇప్పటికైనా కొద్ది మంది పెద్దలు నోరు విప్పి పార్టీపట్ల పువ్వాడ అజయ్ విమర్శలని తిప్పికొట్టాలని , తద్వారా అవన్నీ అబద్ధాలని సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యతని తీసుకోవాలి.
  మన కళ్ళముందు పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు ఈరోజు రాజ్యాధికారాన్ని సంపాదించి ప్రజలని ఏలుతున్నారు. ప్రజలను దోచుకునే బూర్జువా పార్టీలు రాజ్యాన్ని ఏలుతు ఉంటే, ప్రజల వైపు నుండి పోరాటాలు చేసే ఎర్రజెండాలు , రాజ్యాధికారానికి కనుచూపుమేరలో కూడా లేకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి ?  ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా ? ఎవరి స్వాలాబాల కోసం ?
చాలా సమాధానాలు మీకు స్ఫురిస్తాయి .చాలా వ్యవస్థలు ఈరోజు పతనమవడానికి కారణాలు, విద్యార్థి యువజనులు , వ్యవస్థల పటిష్ఠం వైపు కాకుండా , వ్యక్తుల చుట్టూ చేరి భజనలు చేస్తూ , వ్యక్తులను నియంతలు గా మారుస్తూ , ప్రశ్నించే వైపు కాకుండా వెన్నుముక లేని జోకుడు రాజకీయాలు చేస్తున్నారు.
వీటిని తిప్పికొడుతూ… మనకు వెన్నుముక ఉన్నదనివ్యక్తుల వైపు కాకుండా ఎర్ర జెండానే మన నాయకత్వం అని ఎర్రజెండా నీడలో ఉంటూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చు కుందాము. ప్రశ్న , తప్పు ఎవరు చేస్తే వారి పైన సందించాలి మన వాడైనామంది వాడైనా
  బానిస రాజకీయాల వైపా ఆత్మగౌరవ రాజకీయాల వైపా వ్యక్తుల వైపా వ్యవస్థల వైపా
విద్యార్థి, యువజన, మహిళ, ప్రజా సంఘాలు కామ్రేడ్ నారాయణ పై పువ్వాడ అజయ్ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పి కొట్టాలని కోరుకుంటూ

                                                                                  కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త
                                                                              – మారపాక రమేష్ కుమార్
                                                                                              న్యాయవాది